బీ అలర్ట్: ఆధార్‌తో లింక్ చేయలేదా.. పాన్ కార్డు క్యాన్సిల్

Submitted on 8 February 2019
 pan should link with aADHAR OTHERWEISE may cancel


పర్మినెంట్ అకౌంట్ నెంబర్(పాన్)కార్డుకు చిక్కొచ్చిపడింది. అందరికీ కాదు ఆధార్‌తో లింక్ చేయకుండా వాడే పాన్ కార్డులు క్యాన్సిల్ చేసేస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సేషన్(సీబీడీటీ) ఛైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. భారతదేశం మొత్తంలో ఉన్న 42 కోట్ల పాన్ కార్డు వినియోగదారులలో 23కోట్ల మంది మాత్రమే తమ ఆధార్ కార్డును పాన్ కార్డుకు లింక్ చేయించుకున్నారట. 

అయితే మిగిలిన వారు కూడా ఆధార్‌తో చేయించాలని మార్చి 31నాటికి లింక్ చేయించకపోతే వారి పాన్ కార్డులు క్యాన్సిల్ చేసేస్తామని అధికారులు వెల్లడించారు. 'పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడం వల్ల ఒక్క ఆధార్‌పై ఎన్ని పాన్ కార్డులు నమోదు అయి ఉన్నాయో తెలుస్తుంది. దానిని బట్టి డూప్లికేట్ పాన్ నెంబరుతో ఉన్న వినియోగదారులను సులువుగా గుర్తించవచ్చు. ఆధార్ పాన్‌తో లింక్ అయి ఉండాలి. పాన్ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయి ఉండాలి' అని  సీబీడీటీ ఛైర్మన్ చంద్ర వ్యాఖ్యానించారు. 

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లు చేసేందుకు ఏప్రిల్ 1 నుంచి తమ పాన్‌తో పాటుగా ఆధార్‌ను తప్పనిసరిగా జత చేయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 
 

Read Also:  ఓపిక పట్టండీ : 3 నెలల్లో భారీగా తగ్గనున్న DTH ఛానళ్ల ధరలు

Read Also:  జియో ఆస్తులు అమ్ముతున్న అంబానీ

Read Also:  RBI గుడ్ న్యూస్ : హోంలోన్ పై EMI ఎంత తగ్గుతుందో తెలుసుకోండి

Read Also:  వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక: మీ అకౌంట్ బ్లాక్ కాకూడదంటే..

Read Also:  డిజిటల్ రాజకీయం: ‘పొలిటికల్ యాడ్స్‌’పై ఫేస్‌బుక్ కొత్త టూల్

Read Also:  ఫీచర్స్ సూపర్ అంట : జియో 3 కమింగ్ సూన్

Aadhar Card
pan card

మరిన్ని వార్తలు