ఎన్నికల్లో గెలిచిన గులాబ్‌ జామూన్‌ : పాకిస్థాన్ జాతీయ స్వీట్

Submitted on 9 January 2019
 Gulab Jamun Selection as Pakistan's National Sweet

పాకిస్తాన్‌ : ఒక స్వీట్ కోసం ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిన విషయం గురించి విన్నారా..గులాబ్‌ జామూన్, బర్ఫీ, జిలేబీ వీటికి  ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గులాబ్ జామూన్ విజయం సాధించింది. ఏంటీ జోక్ అనుకుంటున్నారా? కాదండీ నిజమే. పాకిస్థాన్  జాతీయ స్వీటు కోసం పాకిస్థాన్  ప్రభుత్వం పాక్ నేషనల్‌ స్వీట్‌ ఎన్నికలో ట్విట్టర్‌ ద్వారా పాల్గొనాల్సిందిగా ప్రజలను కోరింది. ఈ క్రమంలో గులాబ్‌ జామూన్, బర్ఫీ, జిలేబీ ఆప్షన్స్ ను కూడా ఇచ్చింది. ఈ ట్విట్టర్‌ పోల్‌లో ప్రజలు తమ ఓటుహక్కును ఉపయోగించుకున్న నెటిజన్స్  గులాబ్‌ జామూన్‌కు 47 శాతం మంది పాక్‌ ప్రజలు  ఓటు వేయడంతో పాకిస్థాన్ దేశపు జాతీయ స్వీటుగా గులాబ్‌ జామూన్‌ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో 34 శాతం ఓట్లతో జిలేబీ ద్వితీయ స్థానంలో, బర్ఫీ 19 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచాయి. ఈ ఆప్షన్స్ లో నెటిజన్స్ ‘గులాబ్ జామూన్’ ను ఎన్నుకున్నారు.

అంతేకాదండీ..ఈ ఓటింగ్ లో రిగ్గింగ్ కూడా జరిగిందనేది పాకిస్థాన్ ప్రజల్లో కొందరి వాదన. నేషనల్‌ స్వీట్‌పోల్‌లో ఓటింగ్‌ నిజాయితీగా సాగలేదనీ..రిగ్గింగ్‌ జరిగిందనీ పాకిస్థాన్ ప్రజలు భావిస్తున్నారు. ట్విట్టర్‌ మినహా ఈ ఎన్నికల్లో ఇతర సోషల్‌ మీడియాకు అవకాశం లేకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం 5 లక్షల కన్నా తక్కువమంది ఫాలోవర్స్‌ ఉన్న అధికారిక ట్విట్టర్‌ నుంచే పోల్‌ నిర్వహించడంతో జామూన్ ఎన్నికలో రిగ్గింగ్ జరిగిందని..అసలు గులాబ్‌ జామూన్‌ పాకిస్తానీ స్వీటు కాదన్నది  కొందరి వాదన. 

గులాబ్ జామూన్ మొగల్ వంశీకుల కాలంలో షాజహాన్‌ కుక్ లు కనిపెట్టారని కొందరంటోంటే.. కాదు కాదు టర్కీ ఆక్రమణదారుల ద్వారా ఈ స్వీట్ పాక్‌లోకి వచ్చిందని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తంగా జామూన్‌ పాకిస్తానీ స్వీటు కాదనీ, దీనికి విదేశీ రుచులున్నాయన్నది వీరి వాదన. ఏది ఏమైనా..ఓ స్వీట్ కోసం ప్రభుత్వమే ఆన్ లైన్ ఎన్నికలు నిర్వహించటం..నెటిజన్స్ ఓటింగ్ తో అధికారికంగా ఓ స్వీట్ ను ప్రకటించటం వెరీ వెరీ డిఫరెంట్ గా వుంది కదూ..

Pakistan
Government
Online
Sweet Poll
National Sweet
Gulab Jamun
Watts Ape
Netisans

మరిన్ని వార్తలు