రోహిత్ @140, పాకిస్తాన్ టార్గెట్ 337

Submitted on 16 June 2019
PAKISTAN TARGET 335

మాంచెస్టర్ వేదికగా రోహిత్ విజృంభించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మిడిల్ ఓవర్లలో రెచ్చిపోయి పాకిస్తాన్‌కు 337 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. ఆరంభం నుంచి దూకుడు చూపించిన ఓపెనర్లు స్కోరు బోర్డు పరుగులు పెట్టించారు. రోహిత్ శర్మ(140; 113బంతుల్లో 14ఫోర్లు, 3సిక్సులు)తో అద్భుతమైన ఇన్నింగ్స్ కనబరిచాడు. 


విరామం కారణంగా తప్పుకున్న ధావన్ స్థానంలో  దక్కిన అవకాశాన్ని కేఎల్ రాహుల్(57; 78 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సులు)తో రోహిత్‌కు చక్కటి సహకారం అందించాడు. 23.5ఓవర్లకు తొలి వికెట్‌గా 136పరుగుల వద్ద రాహుల్ అవుట్ అవడంతో విరాట్ కోహ్లీ(77; 65బంతుల్లో 7ఫోర్లు)క్రీజులోకి వచ్చాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీతో పాటు నిలిచిన హార్దిక్ పాండ్యా(26; 19బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సు)తో మెరుపు ఇన్నింగ్స్‌తో సరిపెట్టుకున్నాడు. 

ఆ తర్వాత దిగిన మహేంద్ర సింగ్ ధోనీ(1)పరుగుకే అవుట్ అవగా, విజయ్ శంకర్(15), కేదర్ జాదవ్(9)లు నిలకడగా ఆడటంతో జట్టు 336 పరుగులు చేయగలిగింది. పాక్ బౌలర్లు మొహమ్మద్ అమీర్ 3వికెట్లు తీయగా,  హసన్ అలీ, వహబ్ రియాజ్ చెరో వికెట్ పడగొట్టారు. 

Pakistan
india
ind
Pak
2019 icc world cup
world cup 2019


మరిన్ని వార్తలు