మేం వయసుకు వచ్చాం: మన శరీరంలో 3 విభిన్న మార్పులివే! 

Submitted on 7 December 2019
Our Bodies Age in Three Distinct Shifts, According to More Than 4,000 Blood Tests

శరీరానిదే వయస్సు. ప్రతి జీవికో వయస్సు పరిమితి ఉన్నట్టే.. అందులో ఎన్నో దశలు కూడా ఉంటాయి. వందేళ్ల మనిషి జీవితకాలంలో మొత్తం మూడు దశలు ఉంటాయని కొత్త పరిశోధన వెల్లడించింది. పసిప్రాయంలో పువ్వులా పరిమిళించే దేహం.. యువ్వనానికి రాగానే ఒక్కో దశలోనూ నడి వయస్సులోకి రాగానే మరోలా మారిపోతుంది. మన శరీరానికి మొత్తం కీలకంగా మూడు గేర్లు ఉంటాయని అంటున్నారు పరిశోధకులు.

వయస్సును బట్టి శరీరం ఒక్కో గేర్ మారుస్తుందని చెబుతున్నారు. అందులో ముందుగా 34ఏళ్లలో ఒక దశ ప్రారంభమైన వెంటనే శరీరంలో ఒక్కసారిగా మార్పులు సంభవిస్తాయి. ఆ తర్వాత వచ్చే రెండో దశ 60 ఏళ్లలో మొదలవుతుంది. ఈ దశలో శరీరంపై మార్పులను మీరే గమనించవచ్చు. ఇక ఆఖరిగా 78ఏళ్ల వయస్సులో మూడో దశతో విభిన్న మార్పులు సంభవిస్తాయని పరిశోధనలో గుర్తించారు. 

4వేలకు పైగా రక్త పరీక్షల్లో తేలింది ఇదే :
ఇందులో భాగంగా రీసెర్చర్లు.. మానవ శరీర వయస్సు ఎన్ని ఏళ్లకు మార్పు సంభవిస్తుంది అనేదానిపై 4వేలకు పైగా రక్తపరీక్షలు నిర్వహించినట్టు పరిశోధకులు తెలిపారు. ఫలితంగా మనిషి శరీరం మూడు దశల్లో ఉంటుందని నిర్ధారించారు. మరో మాటలో చెప్పాలంటే.. మానవుడి వయస్సు ఒకేసారి పెరిగిపోదు అనడానికి ఇదొక ఆధారంగా చూపించవచ్చు.

వయస్సు అనేది ఎప్పుడు నిరంతరాయంగా ఒకే వేగంతో పెరుగుతూనే ఉంటుంది. ఇదో సుదీర్ఘ ప్రక్రియగా చెప్పవచ్చు. వృద్ధాప్యంలోకి రాగానే మన శరీరంలో ఎలాంటి మార్పులు, సమస్యలు వస్తాయో అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన ఎంతో ఉపకరిస్తుందని రీసెర్చర్లు అభిప్రాయ పడుతున్నారు.

వయస్సు రీత్యా వచ్చే వ్యాధులు ఎక్కువ ఏ వయస్సులో వస్తుంటాయి.. వాటిలో అల్జీమర్స్ లేదా హృదయ సంబంధ వ్యాధులు ఏ వయస్సులో వచ్చే అవకాశం ఉంటుందో ఈజీగా గుర్తించవచ్చు. ఒక్కొక్కరి వయస్సును బట్టి వారి రక్తంలో ఏ స్థాయిలో ప్రొటీన్ వాడుతున్నారో కూడా అంచనా వేసేందుకు ఈ అధ్యయనం ఉపకరిస్తుందని రీసెర్చర్ల అభిప్రాయం.

‘లోతైన విశ్లేషణ ద్వారా కదలాడే వృద్ధాప్య ప్లాస్మా ప్రోటీమ్.. మనిషి జీవితకాలంలో మార్పును గుర్తించాం. ఈ మార్పుల్లో ప్రోటీన్ల సమూహాలు విభిన్న నమూనాలలో కదులుతున్న ఫలితంగా, వృద్ధాప్యం మూడు దశలు ఆవిర్భావంతో ముగుస్తుంది’ అని రీసెర్చర్లు తెలిపారు.

శరీరంలో మార్పులకు కారణం :
దీని కోసం పరిశోధక బృందం.. 18ఏళ్ల వయస్సు వారి నుంచి 95ఏళ్ల వయస్సు ఉన్న మొత్తం 4,263 మంది నుంచి బ్లెడ్ ప్లాస్మాను విశ్లేషించింది. ఫలితంగా జీవావరణ వ్యవస్థ ద్వారా 3వేల వివిధ ప్రొటీన్లు స్థాయి ఎలా ఉందో పరీక్షించారు. శరీరంలో వయస్సు రీత్యా ఏం జరుగుతుంది అని పరీక్షించగా 1,379 మందిలో వయస్సుతో పాటు ప్రోటీన్ల స్థాయి కూడా మారుతున్నట్టు గుర్తించామని వెల్లడించారు.

యవ్వన దశ (34ఏళ్లు), నడి వయస్సు దాటాక (60ఏళ్లు), వృద్ధాప్యం (78ఏళ్లు)లో విభిన్న ప్రోటీన్ల స్థాయిలో తరచుగా స్థిరంగా ఉంటున్నట్టుగా గుర్తించారు. అసలు ఇదంతా ఎందుకు ఎలా జరుగుతుంది అనేదానిపై క్లారిటీ ఇవ్వలేకపోయారు. కానీ, సగటు వ్యక్తి వయస్సు కంటే వేగంగా లివర్ వయస్సు పెరిగిపోతుందని హెచ్చరించవచ్చునని తెలిపారు.

మనిషిలోని రక్తం, వయస్సు మధ్య సంబంధం ఉందని గత పరిశోధనల్లోనూ పరిశోధకులు నొక్కివక్కాణించారు. రక్తంలోని నిర్దిష్ట ప్రోటీన్ల సాయంతో ఒక వ్యక్తి ఆరోగ్య స్థితిని నిర్ధారించవచ్చునని అందరికి తెలిసిందే. మనుషుల్లో పురుషులు, మహిళ్లలో వేర్వేరుగా వయస్సు రీత్యా ఆరోగ్య సమస్యలు ఉంటాయని మరో అధ్యయనంలో రుజువైంది.

అదేగానీ 5ఏళ్ల నుంచి 10ఏళ్ల లోపు వారిలో ప్రోటీన్ల స్థాయి ఎలా ఉంటుందో నిర్ధారించాలంటే ఎంతో పరిశోధించాలంటున్నారు. ఒక రక్త పరీక్ష ద్వారా మీ శరీర వయస్సును నిర్ధారించే అవకాశం ఇంకా ఉందని, కనీసం సెల్యూలర్ స్థాయిలోనైనా గుర్తించేందుకు ఆస్కారం ఉందని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు.

Bodies Age
Distinct Shifts
4
000 Blood Tests
new research
biological ageing

మరిన్ని వార్తలు