కర్ణాటక మహిళా సాధ్వి మహాదేవి కన్నుమూత

Submitted on 15 March 2019
The only woman sadhivi in Karnataka is Mahadevi's death

బెంగళూరు:  కర్ణాటకలో లింగాయత్‌ వర్గ మహిళా పీఠాధిపతిగా  మాతా మహాదేవి మహిళా సాధ్వి మహాదేవి కన్నుమూశారు. మహాదేవి తన 70 సంవత్సరాల వయస్సులో  శ్వాసకోశ సంబంధిత వ్యాధులు..బీపీ..మూత్ర పిండ సమస్యలతో బాధపడుతున్న క్రమంలో గురువారం (మార్చి 14)న కన్నుమూశారు. పలు మఠాలకు, పీఠాలకు ఆలవాలమైన  కర్ణాటక రాష్ట్రంలో ఏకైక మహిళా సాధ్విగా మహాదేవి పేరొందారు. రాష్ట్రంలోని బాగల్‌కోటె జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కూడల సంగమ కేంద్రంగా మహాదేవి బసవధర్మ పీఠాన్ని నిర్మించి.. బసవేశ్వరుని తత్వాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు.
Read Also: ముంబైలో కసబ్ బ్రిడ్జి : ఆ పేరు ఎలా వచ్చింది

ఆమె మాటనే వేదవాక్కుగా భావిస్తుంటాయి పలు పీఠాలకు సంబంధించిన శాఖలు. అంతేకాదు లక్షలాదిమంది భక్తులు..అనుచరగణాలకు కూడా ఆమె మాటే శాసనంగా భావిస్తుంటారు. చిత్రదుర్గ జిల్లాలో జన్మించిన మహాదేవి కాలేజ్ లో చదువు పూర్తి చేసిన తరువాత లింగాయత్‌ సన్యాస దీక్షను స్వీకరించారు. మంచి వాగ్ధాటి..ధైర్యం, తెగువ..ఆధ్యాత్మికత ఉట్టిపడే ఆహార్యం  మహాదేవి సొంతం. ఆమెను చూడగానే భక్తులు పరవశించిపోతారు. ఆమె మాటలను వేదవాక్కులుగా స్వీకరిస్తారు.ఆమె కన్నుమూసిన అనంతరం అంత్యక్రియలను శనివారం  కూడలసంగమలో లింగాయత్‌ సంప్రదాయం ప్రకారం నిర్వహించనున్నారు.  

women sadhivi Mahadevi
Dead
karnataka
Bagalkotte
District
Kudala Sangam

మరిన్ని వార్తలు