బీర్లకు రేషన్ : మనిషికి ఒక్కటే

Submitted on 23 May 2019
Only one Beer for Per Head

తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు దొరక్క అల్లాడుతున్న వారి బాధ ఒకవైపు అయితే,  తాగడానికి చల్లటి బీరు దొరక్క ఇబ్బంది పడేవారి బాధ మరోవైపు. మండే ఎండల్లో చల్లటి బీరు గొంతులో పోసుకుంటే ఆ ఫీలే వేరు, ఆ సుఖమే వేరు అనుకునే బీరు ప్రియులు తెలంగాణాలో బీరు కొరత ఏర్పడడంతో గగ్గోలు పెడుతున్నారు. ఒకేసారి నాలుగైదు బీర్లు పట్టుకెళ్ళే వాళ్లు స్టాక్ లేని కారణంగా ఒక్క బీరుతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. బీరు షాటేజ్ వల్ల ఒక్కరికి ఒక బీరు మాత్రమే అని మద్యం షాపుల వద్ద బోర్డులు తగిలిస్తున్నారు.

బీర్ల సరఫరా తగ్గిపోవడానికి నీటి కొరతే కారణమని, బెవరేజెస్ కార్పొరేషన్‌కు బీరు సరఫరా తగ్గిపోవడంతో వైన్ షాపులకు నిర్దేశిత రేషన్‌ను అమలు చేస్తున్నారు. సాధారణంగా రోజుకి ఒక్కో షాపుకు 100 నుండి 200 కేసులు సప్లయ్ చేస్తే, ప్రస్తుతం 25-30 కేసులకు మించి ఇవ్వడం లేదు. ఈ కారణంగా వైన్ షాపుల్లో ఒక వ్యక్తికి ఒకే బీరు అమ్ముతున్నారు. ఉన్న తక్కువ కేసు బీర్లు కూడా త్వరత్వరగా అమ్ముడు పోతుండడంతో షాపుల వద్ద  బీరు ప్రియులు గొడవలకు దిగుతున్నారు. దీంతో, రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాల్సిన షాపులను 8 గంటలకే మూసివేస్తున్నారు.  

Beer
ration
Telangana

మరిన్ని వార్తలు