ఎంటెక్ చదివి సైబర్ నేరాలు : ఉద్యోగాలు, లోన్లు పేరుతో చీటింగ్

Submitted on 23 October 2019
One Man Arrested Cheating in the name of jobs and bank loans Hyderabad

చదివింది ఎంటెక్. ఉద్యోగం కోసం ట్రై చేశాడు. కానీ రాలేదు. రిచ్ లైఫ్‌కు అలవాటపడ్డాడు. కానీ చేతుల్లో సరిపడా డబ్బు ఉండలేదు. ఇంకేముంది..నేరాలకు పాల్పడ్డాడు. సైబర్ నేరాల బాట పట్టి గత రెండేళ్లలో రూ. 2 కోట్లు వసూలు చేశాడు. ఉద్యోగాలు, బ్యాంకు రుణాలు, పెళ్లిళ్లు..ఇతరత్రా వాటిపై 150 మందిని మోసం చేశాడు. రెండేళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఇతడిని పోలీసులు పట్టుకుని అతని నేరాలకు చెక్ పెట్టాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వివరాలు వెల్లడించారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే...
వీమవరం గ్రామానికి చెందిన శ్రీనివాస రావు 2016లో ఎంటెక్ కంప్లీట్ చేశాడు. విలాసవంతమైన జీవితం అనుభవించాలని కలలు కన్నాడు. ఇదే అతడిని నేరాల బాట పట్టించాయి. మ్యాట్రిమోనీ కన్సల్టెన్సీ పేరిట కొందరి వద్ద డబ్బులు వసూలు చేసి మోసగించాడు. దీనిపై కాకినాడ టూ టౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది. జైలుకెళ్లి బెయిల్‌పై బయటకొచ్చాడు. తర్వాత 2017 హైదరాబాద్‌కు మకాం మార్చాడు. అంబర్ పేట నివాసం ఏర్పాటు చేసుకున్నాడు.

ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తానంటూ..వివిధ పత్రికల్లో ప్రకటనలు గుప్పించాడు. తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికేవాడు. వేరే వేరే పేర్ల ఫోన్ సిమ్ కార్డులను ఏర్పాటు చేసుకున్నాడు. లక్ష రుణానికి రూ. 10 వేలు, రూ. 2 లక్షలకు రూ. 20 వేలు, బ్యాంకు బాలెన్స్ ఉంచాలని సూచిస్తాడు. బ్యాంకు పాస్ బుక్‌లు, ఏటీఎం కార్డు కాపీలు వాట్సప్ ద్వారా శ్రీనివాసరావు సేకరిస్తాడు. ఆన్ లైన్ చెల్లింపుల కోసం సెల్‌కు ఓటీపీ వస్తుందని, సో..పిన్ నెంబర్ చెబితే కానీ..అది సాధ్యం కాదని నమ్మిస్తాడు. చెబుతాడు. దీంతో ఇతని మాటలు నమ్మి పిన్ నెంబర్ చెప్పేస్తారు. కొన్ని ఓటీపీలను ఆన్ లైన్ టూల్స్ ద్వారా సేకరించి వివిధ ఖాతాలకు బదిలీ చేసేవాడు. ఇలా రెండేళ్ల నుంచి కథ నడిపిస్తున్నాడు.

మొత్తం 150 మందిని మోసం చేసి రూ. 2 కోట్లు వసూలు చేశాడు. ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొనే వాడు. ముఖానికి కర్చీఫ్ కట్టడం..ఇతరత్రా పాటిస్తూ..సీసీ కెమెరాలకు చిక్కుకోకుండా జాగ్రత్త పడుతాడు. జనాలు నిలదీస్తారనే ఉద్దేశ్యంతో ఎప్పటికప్పుడు మకాం మారుస్తుండే వాడు. ఈ మోసాలపై ఏపీలో 17 కేసులు, తెలంగాణలో నిజామాబాద్, కొత్తగూడెం, అంబర్ పే పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. ఓ బాధితుడి ఇచ్చిన కంప్లయింట్ మేరకు ఈస్ట్ జోన్ పోలీసులు రంగంలోకి దిగారు. కేసును సవాల్‌గా తీసుకున్నారు.

టెక్నికల్ డేటా, సెల్ నెంబర్స్ సిగల్న్ ఆధారంగా టవర్ నుంచి డేటా సేకరించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తున్నాడన్న సమాచారం పోలీసులకు వచ్చింది. మొత్తం 600 సీసీ టీవీ వీడియో ఫుటేజ్‌లను పరిశీలించారు. అంబర్‌పేటలో ఎక్కువగా ఉంటున్నాడన్న సమాచారం మేరకు పోలీసులు నిఘా పెట్టారు. ఎట్టకేలకు 2019, అక్టోబర్ 22వ తేదీ మంగళవారం శ్రీనివాస రావును అరెస్టు చేశారు. ఇతని వద్ద రూ. 11, 50, 000 నగదు, 12 సెల్ ఫోన్లు, 29 సిమ్ కార్డులు, ఒక ల్యాప్ టాప్, బైక్, మూడు ఏటీఎం కార్డులు, వివిధ పత్రికల అడ్వర్టైజ్‌మెంట్ క్లిప్పులును స్వాధీనం చేసుకున్నారు. 
Read More : చర్చలు జరిగేనా : ఆర్టీసీ సమ్మె 19వ రోజు..విలీనంపై వెనక్కి తగ్గుతారా

One Man Arrested Cheating in the name of jobs and bank loans Hyderabad

మరిన్ని వార్తలు