గ్రేట్ సింబల్ ఆఫ్ ఫ్రాన్స్‌: మంటల్లో పురాతన చర్చ్

Submitted on 16 April 2019
One of the great symbols of France has suffered terrible fire damage

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ ప్యారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత నోట్రే డామే కేథడ్రల్‌ చర్చిలో పైకప్పు నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టు పక్కల ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకోవడంతో చర్చి భవనం కుప్పకూలింది. చర్చి ఆధునీకరణ పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదం  జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
Read Also : హైదరాబాద్‌లో లోన్ మోసం: నమ్మారో బ్యాంకులో మొత్తం నొక్కేస్తారు

అనేక గంటల పాటు నిరంతరాయంగా 400 ఫైరింజన్ల సాయంతో శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా చిన్నపాటి మంటలు ఎగిసిపడుతుండగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నోట్రే డామే కేథడ్రల్‌ చర్చి 12వ శతాబ్దానికి చెందిన పురాతన కట్టడం. ఎంతో చారిత్రాక ప్రాముఖ్యత కలిగిన చర్చిలో అగ్రిప్రమాదం జరగడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ భావోద్వేగానికి గురయ్యారు. 

నోట్రే డామేలో మంటలు చెలరేగాయని తెలిసి యావత్ దేశం భావోద్వేగానికి లోనయింది. కాలిపోతున్న చర్చిని అందరి పౌరుల్లాగే నాకూ బాధగా ఉందని మార్కోన్ తెలిపారు. వీలైనంత త్వరగా చర్చిని పునర్నిర్మించేందుకు ప్రయాత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.

మంటలు ఆరిపోక ముందు ఇదే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటన విడుదల చేశారు. నోట్రే డామేలో మంటలు భయానకంగా ఉన్నాయని ఆకాశం నుంచి నీళ్లు చల్లితే మంటలు చల్లారే అవకాశముందని అన్నారు.

అయితే, ఫ్లైయింగ్ వాటర్ ట్యాంకర్స్‌ ద్వారా నీళ్లు చల్లితే చర్చి పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని అక్కడి అగ్నిమాపక సిబ్బంది అభిప్రాయపడ్డారు.
Read Also : అప్లయ్ చేసుకోండి : అలహాబాద్ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

One of the great symbol
france
damage


మరిన్ని వార్తలు