OMG డేస్ సేల్‌ : అసుస్ ఫోన్స్ భారీ డిస్కౌంట్ 

Submitted on 6 February 2019
'OMG Days Sell': Asus phones are huge discounts

ఢిల్లీ : పోటీ ప్రపంచంలో తమ కంపెనీ ప్రొడక్ట్స్ ను అమ్ముకునేందుకు మొబైల్ ఫోన్స్ సంస్థలు భారీ డిస్కౌంట్స్ ను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు అసుస్‌, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్న 'OMG డేస్ సేల్‌' ఫిబ్రవరి 6న ప్రారంభమైంది. నాలుగురోజులు కొనసాగే ఈ సేల్ ఫిబ్రవరి 9న ముగియనుంది. 2018లో గతేడాది నిర్వహించిన సేల్‌లో 20 ల‌క్షల అసుస్ ఫోన్ల అమ్మకం జ‌రిగిన నేపథ్యంలో మరోసారి ఈ సేల్‌ను నిర్వహించేందుకు అసుస్ సంస్థ సిద్ధమైంది. ఈ సేల్‌లో భాగంగా 'జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1' ఫోన్‌కు చెందిన అన్ని వేరియంట్లపై రూ.1500 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే 'జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2', 'జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం2' ఫోన్లపై రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.అలాగే 'జెన్‌ఫోన్ లైట్ ఎల్‌1'పై రూ.1000 డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. 

 

ఈ సేల్‌లో 'జెన్‌ఫోన్ 5జ‌డ్‌' వేరియంట్లపై రూ.8 వేల భారీ డిస్కౌంట్‌ను ఇస్తుండటం విశేషం. దీంతో ఫోన్ల కొనుగోలుపై నో కాస్ట్ EMI స‌దుపాయం కూడా కల్పిస్తున్నారు. కేవ‌లం రూ.99 కే ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ల‌ను కూడా సేల్ ద్వారా అందిస్తున్నారు. మంగళవారం (ఫిబ్రవరి 5)  అర్ధరాత్రి 12 గంటల నుంచి OMG డేస్ సేల్ ప్రారంభమయ్యింది.

Delhi
Asus
Fons
Flipkart
ONGZ Days
Sale
huge discounts
February 6

మరిన్ని వార్తలు