కారుకు మంటలు అంటుకుని వృద్ధుడు సజీవ దహనం

Submitted on 21 January 2020
The old man burned alive in tandur

వికారాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. కారుకు మంటలు అంటుకుని ఓ వృద్ధుడు సజీవ దహనం అయ్యాడు. తాండూరు పట్టణంలోని గొల్ల చెరువు ప్రాంతానికి చెందిన వీరన్న(70) పట్టణంలోని మర్రిచెట్టు కూడలి సమీపంలో ఉన్న దుకాణాల సముదాయాల్లో చిన్న చిన్న పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ప్రతిరోజు మర్రిచెట్టు సమీపంలోని కాలనీలో ఉన్న ఓ పాత కారులో నిద్రిస్తూ ఉండేవాడు. 

ఆదివారం కట్టమైసమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదానం చేసేందుకు అని రాత్రి కారు సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో వంటలు చేశారు. వంటలు పూర్తయిన తర్వాత మంటలు ఆర్పి వేయకుండా వదిలేయడంతో టెంటుకు మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు ప్రమాదవశాత్తు వృద్ధుడు నిద్రిస్తున్న కారుకు వ్యాపించాయి. 

అప్పటికే మంటలు పూర్తిగా చెలరేగడంతో కారులో నిద్రిస్తున్న వృద్ధుడు సజీవదహనం అయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
 

Old man
burned alive
Vikarabad
tandur

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు