ఓ!బేబి - టీజర్ : నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు

Submitted on 25 May 2019
Oh Baby Teaser

సమంత అక్కినేని, సీనియర్ నటి లక్ష్మీ ప్రధాన పాత్రధారులుగా.. బి.వి.నందిని రెడ్డి దర్శకత్వంలో, డి.సురేష్ బాబు, సునీత తాటి, టి.జి. విశ్వప్రసాద్, హ్యువు థామస్ కిమ్ కలిసి నిర్మిస్తున్న మూవీ.. 'ఓ బేబి'.. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడ 'ఓ బేబి' టీజర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..

'నా పేరు సావిత్రి కానీ, చిన్నప్పుడు అందరూ నన్ను భానుమతిలా ఉన్నావ్ అనేవాళ్ళు' అని లక్ష్మీ తనని తను పరిచయం చేసుకోవడంతో ఓ బేబి టీజర్ స్టార్ట్ అవుతుంది. 'ఇప్పుడు కూడా అందంగానే ఉన్నారుగా'.. అని ఆమెని పొగుడుతూ జగపతి బాబు వాయిస్ వినిపించగానే, లక్ష్మీ సిగ్గుపడుతూ.. 'మీరు నన్ను పాతికేళ్ళప్పుడు చూడాల్సింది' అని చెప్పడంతో.. సమంత ఎంటరవుతుంది.. నాగశౌర్య, సమంతని 'బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా'? అనడిగితే ఆమె తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం, శౌర్య షాక్ అవడం ఫన్నీగా అనిపిస్తుంది.

ఇక టీజర్ చివర్లో 'నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి.. చూస్తారుగా'.. అంటూ సమంత చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఈ మూవీలో సమంత, స్వాతి అనే సింగర్ క్యారెక్టర్‌లో కనిపించనుంది. మిస్ గ్రానీ అనే కొరియన్ మూవీ ఆధారంగా ఓ బేబి రూపొందుతుంది. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి డైలాగ్స్ : లక్ష్మీ భూపాల, కెమెరా : రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్ : జునైద్ సిద్దిఖీ, సంగీతం : మిక్కీ జె.మేయర్, కో-ప్రొడ్యూసర్ : వివేక్ కూఛిబొట్ల, యువరాజ్ కార్తికేయన్, వంశీ బండారు.

 

Samantha
Mickey J Meyer
Suresh Productions
B.V.Nandini Reddy

మరిన్ని వార్తలు