అంత్యక్రియలు కోసం ఆన్‌లైన్‌లో.. అమెరికాలో ఉద్యోగం వదిలేసి!

Submitted on 24 May 2019
Odisha-based Swargadwara startup offering funeral services

చనిపోయాక శాస్త్రీయబద్ధంగా అంత్యక్రియలు చేస్తే సద్గతులు కలుగుతాయని నమ్మకం అయితే శాస్త్రోక్తంగా జరగవలసిన అంత్యక్రియలు కార్యక్రమం మనుషులు బిజీ లైఫ్ కారణంగా తూతూ మంత్రంగా జరిపిస్తున్నారు. అయితే ఇటువంటి కార్యక్రమాలను జరిపించేందుకు ఒడిశాలో ఓ స్టార్ట్ అప్ కంపెనీ స్టార్ట్ చేశారు కొందరు యువకులు. భూవనేశ్వర్‌లోని ఈ కంపెనీ మూడు రకాల వ్యక్తులకు అంత్యక్రియలను చేసేందుకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకుంటే చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తుంది.

పెళ్లైన ఆడువారికి, విదవలకు, పురుషులకు ఏ రకంగా శాస్త్రీయ బద్ధంగా చేయాలనే వివరాలను సంస్థ ఆన్‌లైన్‌లో ఉంచుతుంది. వాస్తవానికి ఇది డబ్బులు కోసం చేస్తున్నప్పటికీ, మానవత్వం కూడా ఇందులో ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.మ చితి పెట్టే కార్యక్రమం నుంచి గంగాజలంలో కలపడం, శవంపై చిల్లర చల్లడం, నెయ్యి మొదలగు అన్నీ కార్యక్రమాలను వీరే చూసుకుంటారు. swargadwara.com ద్వారా కానీ Swargadwara పేజ్ ద్వారా కానీ ఎవరైనా అప్లై చేసుకుంటే వెంటనే స్పందించి ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు.

38ఏళ్ల ప్లబన్ అనే వ్యక్తి ఈ స్టార్ట్ అప్ కంపెనీని మొదలు పెట్టగా.. ఇప్పడు విదేశాల్లో ఉండేవారి కుటుంబసభ్యులు ఎవరైనా చనిపోతే ఇక్కడ వారి తరుపున ఏర్పాట్లు చేసేందుకు ఈ స్టార్ట్ అప్ కంపెనీ బాగా ఉపయోగపడుతుంది. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో 13ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్లబన్.. అమెరికాలోని కాలిఫోర్నియాలో మల్టీ నేషనల్ కంపెనీ Computer Sciences Corporation (CSC)లో జాబ్ వదిలేసి ఇండియా వచ్చి ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి దేశంలో ఉన్న ముఖ్యమైన నగరాలలో ఉన్న ఈ కంపెనీని రాబోయే కాలంలో మెట్రో నగరాలకు విస్తరిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. 

Odisha-based Swargadwara
startup company
funeral services

మరిన్ని వార్తలు