ఫ్యాన్స్‌కి పూనకాలే...

Submitted on 16 February 2019
NTR Mahanayakudu Official Trailer-10TV

నటసింహ నందమూరి బాలకృష్ణ, తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించ సంకల్పించి, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు చేసాడు. ఫస్ట్ పార్ట్ కథానాయకుడు జనవరి 9 న రిలీజ్ అవ్వగా, సెకండ్ పార్ట్ మహానాయకుడు ఫిబ్రవరి 22 న ప్రేక్షకుల ముదుకు రానుంది. రీసెంట్‌గా ఎన్టీఆర్ మహానాయకుడు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు.ఎన్టీఆర్ రాజకీయ జీవితమంతా మహానాయకుడులో చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. రాజకీయ అరంగేట్రం, పార్టీలో ఒడిదుడుకులు వంటివన్నీ చూపించనున్నారు.

బాలయ్య అచ్చుగుద్దినట్టు నాన్నగారిలా కనిపిస్తున్నాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే అన్నగారిని చూస్తున్న ఫీలింగే కలుగుతుంది. జ్ఞాన శేఖర్ విజువల్స్, కీరవాణి ఆర్ఆర్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అద్భుతమని చెప్పాలి. ఫస్ట్‌పార్ట్‌తో కాస్త నిరాశపడ్డ నందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు, మహానాయకుడితో బాలయ్య ఆ లోటుని భర్తీ చెయ్యనున్నాడని పిస్తుంది. సెన్సార్ మహానాయకుడికి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది. ఫిబ్రవరి 22 న ఎన్టీఆర్ మహానాయకుడు వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

వాచ్ మహానాయకుడు ట్రైలర్...
 

Nandamuri Balakrishna
Rana Daggubati
Vidya Balan
M. M. Keeravaani
Krish

మరిన్ని వార్తలు