ఫిబ్రవరి 22న వస్తున్నాడు

Submitted on 11 February 2019
 NTR Mahanayakudu on feb 22nd

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ, నందమూరి తారక రామారావు జీవిత కథతో.. ఆయన నటవారసుడు నందమూరి బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్న ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో రెండు పార్ట్‌లుగా తెరకెక్కించగా, ఫస్ట్ పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు భారీ అంచనాల మధ్య, జనవరి 9న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. బాలయ్య వేసిన పలు గెటప్స్ బాగున్నాయనీ, తండ్రి పాత్రలో ఒదిగిపోయాడనీ, తండ్రి వారసత్వాన్ని అణువణువునా పుణికి పుచ్చుకున్నాడనీ, ఎన్టీఆర్‌కి బాలయ్య ఇచ్చే ఘనమైన నివాళి ఇదే.. అంటూ ప్రశంసలు వచ్చాయి.. కానీ, కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. ఫస్ట్‌పార్ట్‌లో జరిగిన మిస్టేక్స్, రెండో పార్ట్‌ విషయంలో జరగకుండా మూవీ యూనిట్ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది.

రీసెంట్‌గా మహానాయకుడు షూటింగ్‌కి కొబ్బరికాయ కొట్టేసారు. గతకొద్ది రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో రకరకాల వార్తలొస్తున్నాయి. ఆ వార్తలకు తెరదించుతూ... విద్యా బాలన్.. ఫిబ్రవరి 22 న మహానాయకుడు రాబోతున్నాడని చెప్పింది. డైరెక్టర్ క్రిష్ వర్కింగ్ పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసింది విద్యా బాలన్.. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కథానాయకుడు... మహానాయకుడిగా వెండితెరపై ఎలా ఉంటాడోనని ఫ్యాన్స్, ఫిబ్రవరి 22కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

వాచ్ ట్రైలర్...  

NTR Mahanayakudu
Balakrishna
Vidya Balan
Krish

మరిన్ని వార్తలు