ఆర్ఆర్ఆర్ షూట్ లో ఎన్టీఆర్ కు గాయం

Submitted on 24 April 2019
NTR Injury in RRR Sets-10TV

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి ఇంట్రడక్షన్ సీన్స్‌కే దాదాపు రూ.50 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చుపెట్టనున్నట్టు, తారక్ పక్కన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ నటించనున్నట్టు రకరకాల వార్తలు వస్తున్నాయి.
Also Read : ఇంట‌ర్ అల‌ర్ట్ : రీ-వాల్యూయేషన్, కౌంటింగ్ కు ఇలా అప్లయ్ చేసుకోండి

అవన్నీ కాసేపు పక్కన పెడితే, రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ షూట్‌లో ఎన్టీఆర్ గాయపడ్డాడు. తారక్ చేతికి గాయం అయ్యింది. అతను చేతికి కట్టుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యలేదు.. ఆర్ఆర్ఆర్ నెక్స్ట్ షెడ్యూల్ పూణేలో జరగనుంది.

హైదరాబాద్ అమీర్ పేటలోని కొన్ని లొకేషన్లలో షూటింగ్ జరుగుతుండగా.. ఎన్టీఆర్ చేతికి చిన్న గాయం అయ్యింది. ఈ గాయానికి చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చి.. చేతికి కట్టుతో బయటకు వెళుతున్నప్పుడు ఫొటోలు తీశారు కొందరు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంలో కలకలం రేగింది. ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అంటూ పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. అయితే యూనిట్ మాత్రం వాటిని ఖండిస్తోంది. చాలా చిన్న గాయం అని స్పష్టం చేసింది. అది ప్రమాదమే కాదని స్పష్టం చేస్తోంది. షూటింగ్ కు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించింది.
Also Read : మహర్షి : పదర పదర లిరికల్ సాంగ్

NTR
NTR Injury
Ram Charan
DVV Danayya
SS Rajamouli

మరిన్ని వార్తలు