పారా మెడికల్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

Submitted on 18 October 2019
Notification release for replacement of seats in Para Medical Courses

రాష్ట్రంలో పారా మెడికల్‌ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి మొదటి విడత నోటిఫికేషన్‌ విడుదల అయింది. గురువారం (అక్టోబర్ 17, 2019) కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. శనివారం (అక్టోబర్19, 2019) ఉదయం 7 గంటల నుంచి (అక్టోబర్ 22, 2019) మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ జరుగుతుందని తెలిపారు.

నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సు బీఎస్సీ నర్సింగ్‌, రెండు సంవత్సరాల డిగ్రీ పోస్ట్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ నర్సింగ్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపి (బీపీటీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ మెడికల్‌ ల్యాబరేటరీ టెక్నాలజీ (బీఎస్సీ ఎంఎల్‌టీ) కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయని వెల్లడించారు. ఇప్పటికే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పూర్తి అయిందన్నారు.

తుది మెరిట్‌ జాబితాను యూనివర్సిటీ ద్వారా విడుదల చేసినట్లు వివరించారు. అర్హులైన అభ్యర్థులందరూ కోర్సు, కళాశాలల వారీగా నిర్దేశించిన గడువు లోగా ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించారు. శుక్రవారం (అక్టోబర్18, 2019) కాలేజీల వారీగా ఖాళీలను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని చెప్పారు.

notification
release
REPLACEMENT
seats
Para Medical Courses
Hyderabad

మరిన్ని వార్తలు