స్విస్ బ్యాంకుల్లో అక్రమసంపాదన...50మంది భారతీయుల లిస్ట్ రెడీ

Submitted on 16 June 2019
Noose Tightens on Swiss Account Holders, Details of at Least 50 Indians Shared

స్టిట్జర్లాండ్ బ్యాంకుల్లో అక్రమ సంపదను దాచుకున్న నల్ల కుబేరులపై కొరడా ఝళిపించేందుకు భారత్, స్విట్జర్లాండ్ దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనాన్ని దాచుకున్న సుమారు 50 మంది భారతీయుల వివరాలను భారత దేశానికి అందజేసే ప్రక్రియను స్విస్ అధికారులు ప్రారంభించారు. కొన్ని వారాల క్రితం సుమారు 50 మంది భారతీయులకు నోటీసులు జారీ చేసినట్లు స్విస్ ప్రభుత్వం వెల్లడించింది. వీరి వివరాలను భారత ప్రభుత్వంతో పంచుకోవడానికి స్విస్ ప్రభుత్వ ప్రతిపాదనపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని వీరిని కోరినట్లు తెలిపింది. వీరిలో కొందరి ప్రాథమిక అపీళ్ళను ఇప్పటికే తిరస్కరించినట్లు తెలిపింది.


నల్ల ధనానికి స్వర్గధామం అనే పేరును వదిలించుకోవడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం కృషి చేస్తోంది. గత ఏడాదిలో సుమారు 100 మంది భారతీయ నల్ల కుబేరుల వివరాలను భారత ప్రభుత్వానికి అందజేసినట్లు స్విస్ అధికారులు తెలిపారు.నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 నుంచి చేస్తున్న కృషి వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టమయ్యాయి. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న అత్యధిక కేసుల విషయంలో కొన్ని నెలల్లో పరిపాలనాపరమైన సహాయాన్ని కూడా అందజేస్తామని స్విస్ అధికారులు హామీ ఇచ్చారు.

Switzerland
based
banks
ACCOUNTS
Indians
Black Money
share
Details
Modi
noose tightens
swiss accounts


మరిన్ని వార్తలు