షియోమీ, వన్‌ప్లస్‌కు పోటీగా : ఇండియాలో Nokia స్మార్ట్ TV వస్తోంది

Submitted on 17 November 2019
Nokia TV may launch with 55-inch 4K UHD screen, Android OS

ఫిన్నీష్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ నోకియా నుంచి కొత్త స్మార్ట్ టీవీ రాబోతోంది. ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ భాగస్వామ్యంతో Nokia Smart TVని భారత మార్కెట్లలో ప్రవేశ పెట్టనుంది. గతవారమే ఫ్లిప్ కార్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. నోకియా స్మార్ట్ టీవీ JBL ఆడియోతో వస్తోంది. మిగతా ఫీచర్లకు సంబంధించి ఫ్లిప్ కార్ట్ రివీల్ చేయలేదు. కొత్త రిపోర్టు ప్రకారం.. నోకియా టీవీ 55 అంగుళాల 4K డిస్‌ప్లేతో రానుంది. 

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ద్వారా ఈ కొత్త నోకియా స్మార్ట్ టీవీ సర్టిఫికేషన్ అయినట్టు ధ్రువీకరించింది. నోకియా బ్రాండెండ్ స్మార్ట్ టీవీని ఇండియాలో 55 అంగుళాల స్ర్కీన్‌తో 4K UHD LED ప్యానెల్ తో తీసుకొస్తోంది. ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అయ్యే ఈ స్మార్ట్ టీవీ గూగుల్ ప్లే స్టోర్ పై కూడా సపోర్ట్ చేస్తుంది. ప్లే స్టోర్‌ ద్వారా పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలతో పాటు మరెన్నో యాప్స్ ఈ ఆండ్రాయిడ్ టీవీపై యాక్సస్ చేసుకోవచ్చు. 

అంతేకాదు.. ఇంటెలిజెంట్ డిమ్మింగ్ టెక్నాలజీతో నోకియా టీవీ వస్తోందని రిపోర్టు తెలిపింది. ఇందులో బెటర్ కాంట్రాస్ట్, డీపర్ బ్లాక్స్ మొత్తం మీద మంచి డిస్ ప్లే క్వాలిటీ ఉంటుందని పేర్కొంది. నోకియా స్మార్ట్ టీవీపై ఓటీటీ స్ట్రీమింగ్ యాప్స్ నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో సహా ఇతర యాప్స్ కూడా ప్రీలోడెడ్ అయినట్టు రిపోర్టు తెలిపింది. నోకియా స్మార్ట్ టీవీ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేదానిపై కచ్చితమైన సమాచారం లేదు. 

డిసెంబర్ నెల ప్రారంభంలో నోకియా టీవీ లాంచ్ కానున్నట్టు అంచనా. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లలో స్మార్టీటీవీలను ఆఫర్ చేస్తున్న పాపులర్ కంపెనీల్లో షియోమీ ఎంఐ టీవీ, వన్ ప్లస్ టీవీ, మోటరోలా టీవీలో ధరకు పోటీగా నోకియా స్మార్ట్ టీవీ ధర ఉండనుంది. 

Nokia TV
4K UHD screen
Android OS
Play store
streaming platforms
Flipkart 

మరిన్ని వార్తలు