పెరుగుతున్న చలి, మరో 2 రోజులు పొడి వాతవరణం

weather 090119

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ రోజు పొడి వాతావరణం ఉంటుంది.  హైదరాబాద్ లో  గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, కనిష్టంగా 11డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.  రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. మంగళవారం తెల్లవారుజామున అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 8, రామగుండంలో 12, హన్మకొండలో 13, హైదరాబాద్‌లో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంకన్నా 3 డిగ్రీలు తక్కువగా ఉండటం వల్ల చలి పెరిగి పొగమంచు కురుస్తోంది. బుధ, గురువారాల్లో ఇదే తరహా వాతావరణం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.