ఉత్తమ్‌, చంద్రబాబుపై కేటీఆర్‌ మండిపాటు

22:04 - September 12, 2018

హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ తాజా మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణకు అడ్డుపడ్డ రెండు గడ్డాలు ఒక్కటయ్యాయని వ్యాఖ్యానించారు. టీడీపీని కాంగ్రెస్‌కు తోక పార్టీగా మార్చిన ఘనత చంద్రబాబుదేని విమర్శించారు. ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పే అవకాశం ప్రజలకు దక్కిందన్నారు. ఉమ్మడి ఏపీ శాసనసభ మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ శాంతి.. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో  టీఆర్‌ఎస్‌ చేరారు. ఈ సందర్భంగా టీడీపీ-కాంగ్రెస్‌ పొత్తు అపవిత్రమని కేటీఆర్‌ దుయ్యబట్టారు. 

 

Don't Miss