'కలుపు' కాదు..పోషకాల 'ఆకుకూరలు'..

20:03 - September 4, 2018

ఆకుకూరల్ని రైతులు పడిస్తుంటారు. లేదా పెరట్లో పెంచుకుని వాటుకుంటుంటాం. మనం రోజు తినే..చూసే అకుకూరలు మనం పెంచకపోయినా..ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోయినా అన్ని మొక్కల్లో కలిసిపోయి పెరుగుతుంటాయి. వాటి సంగతి మనకు తెలియదు. అసలు అవి ఆకుకూరలని కూడా మనకు తెలియదు. కొన్ని రకాల ఆకుకూరలు కలుపు మొక్కల్లో మొక్కలుగా పెరుగుతాయనే సంగతి మీకు తెలుసా? ఇలా పెరిగే ప్రతి మొక్కలోనూ ఔషధ, పోషక గుణాలు పుష్కలంగా వున్నాయని పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ ఆకు కూరల పంటల పట్ల గ్రామీణ ప్రజల్లో అవగాహన ఉన్నప్పటికీ పట్టణ ప్రజలకు వీటి పేర్లు కూడా చాలావరకూ తెలియవంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఖరీప్‌, రబీ సీజన్లలో పొలాల్లోను, పొలంగట్లు వెంబడి, ఆఖరికి మొక్క మొలవని బీడు భూముల్లోను, గుట్టల్లోను ఇలా వివిధ రకాల ఆకుకూరలు దొరుకుతాయి. వాటిలో ముఖ్యంగా దొగ్గలి, జొన్నచెంచలి, తెల్లగలిజేరు, సన్నపాయిలి, బర్రెపాయిలి, తలావావిలి, ఎలుకచెవికూర, ఎర్రదొగ్గలికూర, గునుగుకూర, తుమ్మికూరలను పాతతరం వారు ఆకుకూరల్లా వండుకు తినేవారు. వీటిల్లో ఆద్భుతమైన పోషకాలు వుండేవని పెద్దగా అవగాహన లేని పెద్దలు చెబుతుండేవారు. ఇప్పుడంటే న్యూట్రిషియనిస్ట్ లు చెబుతున్నారు గానీ పాతకాలంలో ఆనుభవమున్న పెద్దలే పెద్ద న్యూట్రిషియనిస్టులు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు..మరి మీరేమంటారు? అవును కదా? పెద్దల మాట సద్ధన్నం మూట.

Don't Miss