
హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సినిమా 'వాల్మీకి'. ఈ సినిమా టైటిల్ ను మార్చాలని కోరుతూ గురువారం (సెప్టెంబర్ 5, 2019)న CGO టవర్స్‌లోని సెన్సార్ బోర్డు కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ నాయకులు ధర్నా నిర్వహించారు.
ఈ టైటిల్ మార్చాలని బోయ కులస్తులు గొడవ చేస్తున్నారన్నారు. వాల్మీకి బోయలతో పాటు హిందువుల ఆరాధ్య దైవమని పేర్కొన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి పేరు ఓ హింసాత్మక సినిమాకు ఎలా వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆందోళనకారులు.
వెంటనే సినిమా పేరును మార్చాలని భజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ ఎం.సుభాశ్ చందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సెన్సార్ బోర్డు చైర్మన్‌కు రాసిన లేఖను కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమా టీజర్ కూడా అదిరిపోయింది. ఇందులో వరుణ్ తేజ్ లుక్ మరీ రాక్షసంగా ఉంది. ఇదే అభిమానులను ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను కూడా పెంచేస్తుంది.