బాదుడు షురూ : మెట్రో ప్రయాణికులకు చేదువార్త 

Submitted on 4 September 2019
Hyderabad Metro to charge for extra luggage

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు ఇది చేదువార్త. లగేజీతో వచ్చే వారిపై అదనపు భారం పడనుంది. అధిక లగేజీపై అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు మెట్రో అధికారులు సిద్ధమయ్యారు. కొందరు ప్రయాణికులు ఎక్కువ లగేజీతో మెట్రో స్టేషన్లకు వస్తున్నారు. దీంతో ప్రయాణికులు క్యూలు కట్టాల్సి వస్తోంది. తోటి ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. లగేజీ చెకింగ్ మెషిన్ దగ్గర క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. మెట్రో బోగీలో నిల్చుని ప్రయాణం చేయాల్సి పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు లగేజీపై అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు రెడీ అయ్యారు.

ఒక వ్యక్తి దగ్గర లగేజీ బరువు 15 కిలోల కన్నా ఎక్కువ ఉంటే ఛార్జీ వసూలు చేస్తారు. ప్రతి మెట్రో స్టేషన్ లో బరువుని కొలిచే మెషిన్లు పెడతారు. ఆ మెషిన్ల ద్వారా లగేజీ బరువుని కొలుస్తారు. దీని కోసం 10 నిమిషాల సమయం పడుతుందని అంచనా వేశారు. ఒక్కో ప్రయాణికుడు తన వెంట 40 కిలోల వరకు బరువున్న లగేజీతో రావడానికి మెట్రో అధికారులు పర్మిషన్ ఇచ్చే యోచనలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం లగేజీ బరువుని 25కేజీలుగానే ఫిక్స్ చేసింది.

కేంద్ర గృహ నిర్మాణ శాఖ రూల్స్ ప్రకారం.. ఒక వ్యక్తి 25 కిలోల బరువున్న లగేజీని వెంట తెచ్చుకోవడానికి అనుమతి ఉంది. అయితే బండిల్స్ రూపంలో ఉన్న లగేజీని అనుమతించరు. 25 కిలోల కన్నా తక్కువ బరువున్న లగేజీ వెంట తెచ్చుకోవచ్చు. కొలతల విషయానికి వస్తే 80 సెంటీమీటర్లు, 50 సెంటీమీటర్లు ఉండాలి. అధిక బరువున్న లగేజీని అనుమతించడం ద్వారా.. తోటి ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రయాణం మొత్తం నిల్చుని వెళ్లాల్సి వస్తోంది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మెట్రో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

గతంలో లగేజీ పరిమితి 15 కిలోలు మాత్రమే ఉండేది. ఇటీవలే దాన్ని 25 కిలోలకు పెంచారు. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ ఆగస్టు 27న మెట్రో రైల్‌ నిబంధనలు-2014 సవరించింది. మెట్రో రైలు అధికారుల ప్రకారం రైలులో ప్రయాణికులు అధికారుల ముందస్తు అనుమతితో నిర్ణీత పరిమాణానికి లోబడి ఉన్న 25 కేజీల బరువును మించని వ్యక్తిగత వస్తువులను కలిగి ఉన్న బ్యాగును తప్ప మరే ఇతర వస్తువులను తమతో పాటు తీసుకెళ్లకూడదని ప్రకటించింది. ఎయిర్ పోర్టులకు వెళ్లే మెట్రో రైళ్లలో 32 కేజీల బ్యాగ్‌కు మంత్రిత్వ శాఖ అనుమతించింది. అయితే బండిల్స్‌ రూపంలో ఉన్న ఎటువంటి సామానును అనుమతించరు.

Hyderabad Metro
charge
extra luggage

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు