సాహో బ్యాంగ్ చూశారా?

Submitted on 2 September 2019
Saaho Bang

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో.. భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న గ్రాండ్‌గా విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.. బాహుబలి క్రేజ్ దృష్ట్యా బాలీవుడ్‌లోనూ సాహోను భారీగా రిలీజ్ చేశారు. సాహోకు బాలీవుడ్ క్రిటిక్స్ 1.5 రేటింగ్ ఇచ్చారు. అయినా నార్త్‌లో ఫస్ట్ డే (హిందీ వెర్షన్) రూ.24.40 కోట్లు వసూలు చేసింది.

సెకండ్ డే రూ.25.20 కోట్లు కలెక్ట్ చెయ్యడం విశేషం. బాలీవుడ్ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో సాహో టాప్ 3లో నిలిచింది సాహో.. నార్త్ అమెరికాలో 2 మిలియన్స్ దాటేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.130 కోట్లు, రెండవ రోజుకి రూ.205 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సాహో.. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ రూ.294 కోట్లు కలెక్ట్ చేసింది.

రీసెంట్‌గా 'సాహో బ్యాంగ్' పేరుతో ఓ వీడియో రిలీజ్ చేసింది మూవీ టీమ్... ఇప్పటికీ చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. వినాయక చవితి కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

 

Prabhas
Shraddha Kapoor
Ghibran
Sujeeth
uv creations

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు