తెలుగు తల్లికి పూలదండ కూడా వెయ్యలేదు: రూ. 18లక్షలు ఏం చేశారు? 

Submitted on 31 August 2019
N Chandrababu Naidu Slashes Govt Over Telugu Language Celebrations

ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజలనే కాదు. సాంప్రదాయాలను కూడా పట్టించుకోట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కీలకమైన సమస్యలపై ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేస్తున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు లేటెస్ట్ గా జగన్ ప్రభుత్వం తెలుగు భాషను, తెలుగు భాషా దినోత్సవాన్ని, తెలుగు తల్లిని అవమానించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు భాషా దినోత్సవం రోజున జరిగిన జగన్ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఎత్తి చూపి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుభాషా దినోత్సవం రోజున, విజయవాడ నడిబొడ్డున ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి కనీసం పూలమాల వేయలేదని, జగన్ ప్రభుత్వం తెలుగు భాషకు ఇస్తున్న ప్రాధాన్యత దీనిని బట్టే అర్థమవుతుంది అంటూ విమర్శించారు.

అలాగే ‘తెలుగు భాషా దినోత్సవం రోజున ప్రభుత్వం తరుఫున రూ.18 లక్షల ఖర్చు చూపిస్తున్నారు.. కానీ.. తెలుగుతల్లికి కనీసం ఒక దండ కూడా వేయలేదు.. మరి ఆ డబ్బు ఏం చేశారు.. ’ అంటూ జగన్‌ని నిలదీశారు. "మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. మా కన్నతల్లికి మంగళారతులు.." అంటూ ఆంధ్రులు గర్వంగా పాడుకునే రాష్ట్రీయ గీతం... ఈ మూడు నెలల్లో ఏ ఒక్క అధికారిక కార్యక్రమంలో అయినా వినిపించిందా? ఏమిటీ రాష్ట్ర దౌర్భాగ్యం? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
 

N Chandrababu Naidu
Telugu Language Celebrations
Telugu

మరిన్ని వార్తలు