ఇండియాలో ఆపిల్ ఫస్ట్ స్టోర్ : ఆన్‌లైన్‌‌‌లో నేరుగా ఐఫోన్ల సేల్స్ 

Submitted on 29 August 2019
Apple to sell directly in India through online first

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ సొంత ఆన్‌లైన్‌ స్టోర్ నుంచి ఐఫోన్ల సేల్స్ ప్రారంభించనుంది. భారతీయ వినియోగదారులకు నేరుగా ఆన్‌లైన్‌లోనే ఐఫోన్లు విక్రయించనుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI)నిబంధనల సడిలింపును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో సింగిల్ బ్రాండ్ రిటైల్ కంపెనీలు సహా అనేక రంగాలకు భారీ ఊరట లభించినట్టయింది. ఈ నిబంధన సడలింపు ద్వారా విదేశీ సింగిల్ బ్రాండ్ కంపెనీలు తమ ప్రొడక్టులను నేరుగా సొంత ఆన్ లైన్ వెబ్ స్టోర్లలోనే విక్రయాలు జరుపుకోవచ్చు. 

అంతకుముందు, 51 శాతానికి పైగా FDI ఉన్న కంపెనీలు తమ వస్తువులలో కనీసం 30 శాతం దేశీయ మార్కెట్ నుండి పొందవలసి ఉంది. కానీ ఇప్పుడు సింగిల్ బ్రాండ్ రిటైల్ కంపెనీలు తమ ఉత్పత్తులలో 20 శాతం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే, ఇండియాలో తమ సోర్సింగ్‌ను కేవలం 10 శాతానికి పరిమితం చేయడానికి అనుమతి ఉంది.

ఇండియాలో సొంత ఆన్‌లైన్ స్టోర్ నుంచి ఐఫోన్లు, ఐప్యాడ్ వంటి ప్రొడక్టులను సేల్స్ ప్రారంభించబోయే తొలి విదేశీ బ్రాండ్ కంపెనీగా ఆపిల్ కానుంది. సింగిల్ బ్రాండ్ రిటైల్ కంపెనీలతో పాటు ఇతర రంగాలకు విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఆర్థిక వృద్ధిని పెంచడానికి, మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడానికి, ఉపాధిని కల్పించడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల సడలింపును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇలాంటి రాయితీల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ తయారీదారు సంస్థ ఆపిల్ సొంత వెబ్ స్టోర్ ఏర్పాటుపై దృష్టి సారించింది. వచ్చే 3 నుంచి 5 నెలల్లో ఇండియన్ మార్కెట్లో ఆపిల్ వెబ్ స్టోర్ ప్రారంభం కానున్నట్టు ఇద్దరు సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటీవ్ తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆపిల్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు చెప్పారు. 

రానున్న 12-18 నెలల్లో ముంబైలో ఏకైక బ్రిక్ అండ్ మోర్టార్ ఆపిల్ స్టోర్ ప్రారంభించాలని యూఎస్ సంస్థ నిర్ణయించింది. విదేశీ దిగుమతులు, ప్రొడక్టుల తయారీపై కాంట్రాక్టులను కూడా ప్రభుత్వం అనుమతించిన తరుణంలో 5ఏళ్ల కాల పరిమితిలో 30 శాతం స్థానిక స్సోరింగ్ ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇప్పటివరకూ దేశంలో 35-40శాతం ఐఫోన్ల సేల్స్ ఈకామర్స్ నుంచి జరుగుతున్నాయి. ఆన్‌లైన్ బిగ్ సేల్స్ జరిగే ప్రొడక్టుల్లో ఐప్యాడ్ ట్యాబెట్లు, మ్యాక్ బుక్ ల్యాప్ టాప్స్ లతో కలిపి మొత్తంగా 25శాతం వరకు ఇండియాలో సేల్స్ జరుగుతున్నాయని ఎగ్జిక్యూటీవ్ ఒకరు తెలిపారు. ప్రస్తుతం.. ఇండియాలో ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్, పేటీఎం మాల్ సంస్థలతో ఆన్ లైన్ సేల్స్‌లో ఆపిల్ భాగస్వామ్యం కలిగి ఉంది. 

తమ ప్రొడక్టులను థర్డ్ పార్టీ సేల్స్ ప్రొడక్టులపై కూడా ఆపిల్ అధికారం కలిగి ఉంది. ఇండియాలో కాంట్రాక్టు మ్యానిఫ్యాక్చరింగ్ ద్వారా ఐఫోన్ల అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి తమ ప్లాన్లను ఈజీగా విస్తరించడానికి స్థానిక సోర్సింగ్ ప్రమాణాలను సులభంగా చేరుకోగలదు. ఇండియా నుంచి ఐఫోన్లను ఎగుమతి చేయడం కూడా ప్రారంభించింది. ఇప్పటికే 25 దేశాల్లో ఆపిల్ సొంత కంపెనీ స్టోర్లతో పాటు వెబ్ స్టోర్ కూడా రన్ చేస్తోంది. 

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆపిల్ 2 శాతం కంటే తక్కువ వాటాను కలిగి ఉంది. అధిక ధరలు, 20 శాతం అధిక దిగుమతి సుంకాల కారణంగా సేల్స్ క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా, ఐకానిక్ ఐఫోన్‌ల అమ్మకాలు 2018, 2019 ప్రారంభంలో గణనీయంగా పడిపోయాయి. 2019 రెండవ త్రైమాసికంలో ఆపిల్ కేవలం 38 మిలియన్ ఐఫోన్‌లను మాత్రమే విక్రయించింది. ఇది సంవత్సరానికి 13.8 శాతం క్షీణించింది. మరోవైపు, శాంసంగ్ కంపెనీ ఇదే కాలంలో 75 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది. ఏడాదికి 1.1 శాతం పాయింట్ల వాటాను పెంచుకుంది. 

Apple
online first
FDI
Indian consumers
iPhones
Indian Retail industry

మరిన్ని వార్తలు