బిగ్ బాస్ 3: అషూ రెడ్డి అవుట్.. హీరోయిన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా?

Submitted on 25 August 2019
Bigg Boss Telugu 3: Ashu to be eliminated

బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్ రసవత్తరంగా సాగుతుంది. కంటెస్టెంట్ల అలకలు.. కోపాలు.. గొడవలు.. బుజ్జగింపులు మధ్య నెలరోజులు అయిపోయాయి. ఇప్పటికే హౌస్ నుంచి నలుగురు సభ్యులు అవుట్ అయ్యారు. ఈ క్రమంలోనే 5వ వారం కూడా హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యారు.

ఈ ఆదివారం(25 ఆగస్ట్ 2019) ఎలిమినేషన్‌కు సంబంధించి షో ప్రసారం అవుతుండగా.. ఈ వారం షో నుంచి అషూ రెడ్డి ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ వారం శివజ్యోతి, పునర్నవి, హిమజ, అషు రెడ్డి, రాహుల్, మహేష్, బాబా భాస్కర్‌లు ఎలిమినేషన్ లిస్టులో ఉన్నారు.

అయితే శనివారం(24 ఆగస్ట్ 2019) ప్రసామైన షో లో మహేష్, శివజ్యోతి సేఫ్ అయ్యినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించగా.. పునర్నవి, హిమజ, అషు, రాహుల్, బాబా భాస్కర్‌లు ఎలిమినేషన్ లిస్టులో ఉన్నారు. అయితే చివరకు రాహుల్, అషూ ఉండగా అషూ షో నుంచి ఎలిమినేట్ అయ్యారని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్‌తో పాటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని, ఈ ఎంట్రీలో హీరోయిన్ శ్రద్ధాదాస్, ఈషా రెబ్బా ఇద్దరిలో ఒకరు హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ విషయంలో క్లారిటీ లేదు. 

Bigg Boss Telugu 3
Ashu
Eliminate

మరిన్ని వార్తలు