మా క్యాంప‌స్‌లో సరస్వతి పూజను అనుమతించం

Submitted on 7 February 2019
No Saraswati Puja , we are secular: Kerala varsity to students from North

చదువుల తల్లి సరస్వతి అంటే ప్రత్యేకించి విద్యార్థులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే స్కూల్ నుంచి కాలేజీలు, వర్శిటీలన్నీ సరస్వతి పూజలు నిర్వహిస్తుంటాయి. ఇటీవల వర్శిటీ క్యాంపస్ లో నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ ను సరస్వతి పూజ నిర్వహించొద్దంటూ కేరళ వర్శిటీ అల్టిమేటం జారీ చేసింది. అంతేకాదు.. ఈ క్యాంపస్.. లౌకికవాదంతో కూడిందని, ఇక్కడ ఎవరిని మతపరమైన పూజా కార్యక్రమాలకు అనుమతించేది లేదని తేల్చిచెప్పింది. కోచిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT) ప్రభుత్వ వర్శిటీ కాలేజీ అయినప్పటికీ స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. 2018 ఏడాది వరకు కేరళ వర్సిటీ కుట్టనంద్ (CUSAT) క్యాంపస్ లో వార్షిక వేడుకులు జరుపుకుంటున్నారు. 


ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సరస్వతి పూజకు విద్యార్థులంతా కలిసి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. 2019 జనవరి 9 నుంచి జనవరి 11 వరకు క్యాంపస్ ప్రాంగణంలో సరస్వతి పూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు వర్శిటీ మేనేజ్ మెంట్ ను అభ్యర్థించారు. అందుకు వర్శిటీ వైస్ ఛాన్సలర్ నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ అభ్యర్థనను తోసిపుచ్చారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 1 తేదీతో లెటర్ ను రిలీజ్ చేసింది. ఆ లెటర్ లో.. వర్శిటీ క్యాంపస్ లో మతపరమైన కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ లెటర్ బయటకు రావడంతో వర్శిటీ వార్తల్లో నిలిచింది. 
 

మరోవైపు పట్నాలోని ఓ కాలేజీలో ఇటీవల సరస్వతి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో విద్యార్థులు అసభ్యకరమైన డ్యాన్స్ లతో స్టేజీపై రచ్చ చేశారు. బీఎన్ కాలేజీ కి చెందిన విద్యార్థులు బార్ డ్యాన్సర్లను క్యాంపస్ కు రప్పించి సరస్వతి పూజ సందర్భంగా చిందులు వేయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాలేజీ యాజమాన్యమే షాక్ అయింది. కాలేజీ హాస్టల్ పూజా కమిటీపై ఎఫ్ఐఆర్ నమోదైంది.  

Saraswati Puja
secular
Kerala varsity
North students  

మరిన్ని వార్తలు