పాస్‌పోర్ట్ లేకున్నా దుబాయ్ ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ

Submitted on 22 July 2019
No passport Travel smartly through Dubai Airport

పాస్‌పోర్ట్‌ కోసం రోజురోజుకూ నిబంధనలు సడలిపోతున్నాయి. పాస్‌పోర్ట్ కావాలంటే నానాతిప్పలు పడే సమయం నుంచి అది లేకుండానే పనైపోయేలా మారిపోయాయి పరిస్థితులన్నీ. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఈ సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకురానున్నారు. ఓ ప్రత్యేక ద్వారం గుండా అనుమతించే వ్యక్తులకు పాస్ పోర్టు, ఐడెంటిటీ ప్రూఫ్ అవసర్లేదట. 

ఈ స్మార్ట్ ఎంట్రీ బిజినెస్ ట్రావెలర్స్ లాంటి వాళ్లకు చాలా ఉపయోగకరంగా మారనుంది. ఎటువంటి ఎగ్జిట్ స్టాంప్లు, ఐడీల మీద పంచ్‌లు లేకుండానే పనులు జరిగిపోతాయన్నమాట. కెమెరా వైపు ఒకసారి చూసి టన్నెల్‌లోకి వెళ్లిపోవచ్చు. అంతేక్షణాల్లో మైగ్రేషన్ పూర్తయిపోతుంది. 

దుబాయ్‌లోని రెసిడెన్సీ అండ్ ఫారెనర్స్ అఫైర్స్ డైరక్టరేట్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి గతేడాది దీని ట్రయల్ వర్షన్‌ను పూర్తి చేశారు. దీని కోసం ప్రయాణికులు కచ్చితంగా 6నెలల గడువున్న పాస్‌పోర్టు కలిగి ఉండాలి. తొలి సారి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ స్మార్ట్ సిస్టమ్ కోసం ముందుగానే పాస్‌పోర్ట్, ఐడీ ప్రూఫ్ వంటి వివరాలతో బయోమెట్రిక్ సిస్టమ్‌లో వివరాలు ఎంట్రీ చేస్తారు. ఈ వివరాలతో టన్నెల్‌లోకి వెళ్లే ముందు కెమెరా ముందు ఓ సారి నిలబడితే చాలు. 

No passport
Dubai Airports
Dubai Airport

మరిన్ని వార్తలు