పార్టీ మారే ప్రసక్తే లేదు : తేల్చి చెప్పిన గంటా

Submitted on 17 February 2019
No party switching : Ganta Clarification

విశాఖపట్నం :  అవసరమైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ  తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని, మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దని కోరారు. తాను లోక్‌సభ పోటీ చేయాలా? లేక అసెంబ్లీకి పోటీ చేయాలా? అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని  చెప్పారు.  ఎన్నికల్లో పోటీ చేయవద్దని పార్టీ ఆదేశించినా శిరాసావహిస్తానని గంటా అన్నారు. బీసీ గర్జన సభ పెట్టే అర్హత జగన్‌కు లేదని గంటా అన్నారు. 13 జిల్లాల్లో వైసీపీ ఎక్కడా బీసీ అధ్యక్షులను నియమించలేదని మంత్రి విమర్శించారు.  అవంతి శ్రీనివాస్ తనపై చేసిన వ్యాఖ్యలు పై మాట్లాడుతూ... కొందరి కోసం మాట్లాడి నా ప్రతిష్ట దిగజార్చుకోను అని ఆయన అన్నారు.

Ganta Srinivasa Rao
Visakhapatnam
Minister
TDP
Ysrcp
janasena
Bheemili
avanthi srinivas
Elections
Andhra Pradesh
politics

మరిన్ని వార్తలు