2025 తర్వాత.. నో పెట్రోల్ వెహికల్స్ : ఇండియాలో ఈ-వాహనాలే అమ్మాలి!

Submitted on 24 May 2019
No More Petrol As Govt Plans Only Electric Two-Wheeler Sales In India After 2025

ఇందన వాహనాలకు కాలం చెల్లబోతుంది. భవిష్యత్తులో పెట్రోల్ తో నడిచే వాహనాలు క్రమంగా అంతరించి పోనున్నాయి. ఇండియాలో 2025 నాటికి పెట్రోల్ ఇంజిన్ టూ వీలర్ సేల్స్ పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఇందనంతో నడిచే వాహనాలు ఎయిర్ పొల్యుషన్ కారకాలుగా మారుతున్నాయి. అందుకే.. కేంద్ర ప్రభుత్వం.. పెట్రోల్ వాహనాలకు స్వస్తి చెప్పి.. ఎలక్ట్రానిక్ వాహనాల సంస్కృతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో త్వరలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ సేల్స్ తప్పనిసరి చేసే దిశగా ప్రభుత్వం ప్లాన్ రెడీ చేస్తోంది. 

టూ వీలర్.. త్రి వీలర్ కేటగిరీలే టార్గెట్ : 
ప్రత్యేకించి విభాగాలవారీగా ఈ విధానాన్ని అమల్లోకి తేనుంది. త్రి వీలర్, టూ వీలర్ ఇంజన్ కెపాసిటీ (150CC) వాహనాలతో కలిపి మొత్తం రెండు కేటగిరీల్లో అమలు చేయనుంది. ఇటీవల ఉన్నత స్థాయి ప్రభుత్వ కమిటీ సిఫార్సులతో ఈ అంచనాలు ఊపందుకున్నాయి. ఓ నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 2023 నుంచి ఏప్రిల్ 2025 మధ్యకాలంలో 150సీసీ ఇంజిన్ కెపాసిటీ ఉన్న టూ వీలర్, త్రి వీలర్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మాత్రమే సేల్ చేయడం తప్పనిసరిగా చేయనున్నారు. ఇండియాలో ఆటోమాటివ్ మార్కెట్ లో అత్యధికంగా అమ్మకాలు సాగే రెండు కేటగిరీలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. వార్షికంగా రెండెంటి కేటగిరీల్లో కలిపి మొత్తం 2 కోట్ల యూనిట్లు సేల్ అవుతున్నాయి. 

ఆటో పరిశ్రమలో ఈ విభాగాలపై ప్రస్తుతం అయ్యే ఖర్చును ప్రభుత్వ కమిటీ పరిగణనలో తీసుకున్నట్టు నివేదిక తెలిపింది. మరోవైపు BS-VI కంప్లయింట్ కారణంగా కొత్త ఉద్గార నిబంధనలు 2020 ఏప్రిల్ నుంచి అమ్లలోకి రానున్నాయి. ఇలాంటి కంప్లయింట్ వెహికల్స్ పై ఆటో మేకర్లు ప్రాఫిట్ పొందేందుకు 4 నుంచి 6 ఏళ్ల వరకు అనుమతి ఉంటుంది.

డైరెక్ట్ సబ్సిడీ రెట్టింపునకు ప్రపోజల్ :
ఈ నిర్ణయంతో స్కూల్, సిటీ బస్సులు వంటి డెలవరీ వెహికల్స్ లో కూడా ఇదే విధానం తప్పనిసరి చేయనున్నారు. నీతి ఆయోగ్ నేతృత్వంలోని అంతర్గత మంత్రిత్వ కమిటీ సీఈఓ అమితాబ్ కాంత్ ప్యానెల్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్ త్రి వీలర్ వెహికల్స్ కు రూ.20వేల కిలోవాట్స్ వరకు డైరెక్ట్ సబ్సిడీని రెట్టింపు తప్పనిసరి చేయాలని సూచించినట్టు నివేదిక పేర్కొంది. 

దీనికి సంబంధించి ఫ్రేమ్ వర్క్ కోసం కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ మెకానిజాన్ని అదనంగా కార్పొరేట్ ఎవరేజ్ ఫ్యూల్ ఎఫిసియన్సీ (CAFE) సంస్కరణలతో అమల్లోకి తెచ్చేందుకు మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ఆలోచన ద్వారా ఆటోమేకర్లు రానురాను తమ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉత్పత్తులను పెంచుకునేందుకు దోహదపడుతుందని అంచనా వేస్తోంది. ఈ విధానం అమలుపై ఆటో పరిశ్రమ నుంచి మిశ్రమ స్థాయిలో స్పందన వస్తోంది. దేశంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ సేల్స్ తప్పనిసరి చేయడంపై కొనసాగుతున్న ప్రయత్నాలు ఎంతవరకూ వర్క్ ఔట్ అవుతుందో చూడాలి. 

petrol
 Electric Vehicles
Two-Wheeler
 After 2025
Auto Maker Industry
Govt plan
150CC Engine Vehicles

మరిన్ని వార్తలు