బహిష్కరణపై యూపీలో కలకలం : దళితులకు హెయిర్ కట్ చేయం

Submitted on 13 July 2019
No haircuts for Dalits in this Uttar Pradesh village. Know why

సమాజం ఎక్కడికి పోతోంది. మనుషులంతా సమానమనే విషయాన్ని మరిచి కొన్నివర్గాల ప్రజలను ఇంకా అంటరానివాళ్లుగానే ముద్రవేస్తున్నారు. దశబ్ద కాలంగా అంటరానితనమనే మూఢ విశ్వాసంతో సాటి మానవుని, మనిషిగా చూడలేని పరిస్థితి నెలకొంది. ఈ అంటరానితనం అనాదిగా వస్తోంది. సమాజంలో ఉంటూనే ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి కుల వివక్షత కొనసాగుతూనే ఉంది. 

ఉత్తరప్రదేశ్ లోని మోర్దాబాద్ జిల్లాలోని బోజ్ పూర్, పీపల్ సేన గ్రామంలో నివసించే దళితులను అంటరానివాళ్లుగా చూస్తున్నారు. ఈ గ్రామంలో సల్మానీ కమ్యూనిటీ (ముస్లిం బార్బర్లు) మెజార్టీ సంఖ్యలో నివసిస్తున్నారు. ముస్లిం కమ్యూనిటీకి చెందిన వారంతా ఇక్కడ బార్బర్లుగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఇదే గ్రామంలో నివసించే దళితులకు షేవింగ్, హెయిర్ కటింగ్ చేయమంటూ నిషేధం విధించారు.
Also Read : కోడెల శివరాం మరో అరాచకం: ఉద్యోగం ఇప్పిస్తానని 7 లక్షలు స్వాహా

దీంతో తమను అంటరానివాళ్లగా చూస్తున్నారంటూ దళితులు మోర్దాబాద్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమమై వివక్షను చూసి తట్టుకోలేక గ్రామానికి చెందిన దళితులంతా SSP మోర్దాబాద్ అధికారులకు లేఖ రాశారు. తమ కమ్యూనిటీకి చెందిన వారికి కనీసం హెయిర్ కటింగ్, షేవింగ్ కూడా చేయడం లేదని వాపోయారు. 

‘దశబ్ద కాలంగా దళితులపై అంటరానితనం కొనసాగుతోంది. కానీ, ఈ వివక్షను ఇకపై ఉపేక్షించేది లేదు. అంటరానితనంపై వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం’ అని రాకేశ్ కుమార్ అనే దళిత వ్యక్తి చెప్పాడు. సల్మానీ కమ్యూనిటీ తమను అంటరానివాళ్లుగా ముద్రవేయడంతో తన తండ్రితో పాటు తన కుటుంబ సభ్యుల్లో చాలామంది భోజ్ పూర్ సిటీకి వెళ్లి హెయిర్ కటింగ్ చేయించుకోవాల్సి వస్తోందని రాకేశ్ వాపోయాడు. కాలం మారింది.. ఇకపై గ్రామంలో మా వాణీని గట్టిగా వినిపించాలనుకుంటున్నాం’ అని తెలిపాడు. 

దళితులు SSPకి ఫిర్యాదు చేయడంతో ఆ గ్రామంలోని సల్మానీ కమ్యూనిటీ వారంతా నిరసనగా తమ షాపులను మూసివేశారు. మోర్దాబాద్ సీనియర్ ఎస్పీ అమిత్ పట్నాయక్ మాట్లాడుతూ.. బాధితుల నుంచి ఫిర్యాదు అందిందని, త్వరలోనే దీనిపై విచారణ చేపడుతామని చెప్పారు. బాధితుల ఆరోపణలు నిజమని తేలితే మాత్రం అంటరానివాళ్లుగా ముద్రవేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 
Also Read : పాపం పండింది : బాలకృష్ణ మాజీ పీఏకు జైలు శిక్ష‌

haircuts
dalits
Uttar Pradesh
SSP Moradabad
Peepalsana village
untouchable

మరిన్ని వార్తలు