ఊరట : GST నుంచి మినహాయింపు

Submitted on 25 May 2019
No GST at duty free shops

జీఎస్టీతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు అలహాబాద్ హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే ఇది డ్యూటీ ఫ్రీ షాపుల నుంచి కొనుగోలు చేసే వస్తువులకు మాత్రమే వర్తిస్తుంది. డ్యూటీ ఫ్రీ స్టోర్స్ లో కొనుగోలు చేసే వస్తువులపై ఎలాంటి జీఎస్టీ విధించరాదని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వస్తువులు బోర్డర్ దాటవని, ప్రయాణికులు వాటిని సొంత ఐటెమ్స్ గా తీసుకెళతారని.. అలాంటి వస్తువులపై జీఎస్టీ విధించడం న్యాయం కాదని అన్నాయి. కర్నాటక హైకోర్టు కూడా ఇదే తరహా తీర్పు ఇచ్చింది. ఫ్లెమింగో డ్యూటీ ఫ్రీ షాప్ లో ఐటెమ్స్ కొనుగోలు చేస్తే జీఎస్టీ విధించరాదని చెప్పింది. మధ్యప్రదేశ్ హైకోర్టు మాత్రం భిన్నంగా ఆదేశాలు ఇచ్చింది. జీఎస్టీ వసూలు చేయొచ్చని చెప్పింది. 

విదేశాలకు వెళ్లే వారు డ్యూటీ ఫ్రీ షాప్స్ లో తమకు కావాల్సిన ఐటెమ్స్ కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా ఈ స్టోర్స్ నుంచి చాక్లెట్లు, పెర్ఫ్మూస్, ఆల్కహాల్ కొనుగోలు చేస్తారు. వాటిపై జీఎస్టీ వసూలు చేయడం వినియోగదారులకు భారంగా మారింది. దీంతో జీఎస్టీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

No GST
duty free shops
High Court
allahabad high court
Items

మరిన్ని వార్తలు