News

Wednesday, September 2, 2015 - 08:51

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు మూడో రోజుకు చేరాయి. కరవు, నీటి సమస్యలు, రైతు ఆత్మహత్యలపై వైసిపి వాయిదా తీర్మానం ఇవ్వనుంది. ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ.. వైసిపి తరపున లీడ్ చేయనున్నారు.

 

Wednesday, September 2, 2015 - 08:49

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా 'సర్దార్ గబ్బర్ సింగ్' టీజర్ విడుదల చేశారు. పోలీస్ డ్రెస్ లో, ఎర్ర శాలువా బుజంపై దరించి గుర్రాన్ని పట్టుకుని పవన్ స్టైలిష్ గా నడుచుకుంటూ వచ్చే టీజర్ ఒక్క రోజులోనే లక్షల హిట్స్ దక్కించుకుంది. 

Wednesday, September 2, 2015 - 08:40

హైదరాబాద్ : దేశంలో మరో చారిత్రాత్మక సమ్మె జరగబోతోంది. మోదీ సర్కార్‌ దూకుడుగా అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికలోకం ఏకమవుతోంది. సర్కార్‌ ద్వంద్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక సోదరులు నేడు ఒక్కరోజు సమ్మె చేపడుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సమ్మెతో కదం తొక్కేందుకు కార్మికులు సిద్ధమయ్యారు....

Wednesday, September 2, 2015 - 07:39

దేశవ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ వర్గాలు సమ్మెకు దిగాయి. ఉదయం ఆరు గంటల షిఫ్టులకు వెళ్లాల్సిన కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో ఎక్కడికక్కడ ఉత్పత్తి నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఆటోలు తిరగడం లేదు. రవాణా రంగం స్తంభించిపోయింది దేశంలో ఎక్కడ చూసినా సమ్మె వాతావరణమే కనిపిస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి భారీ సమ్మె ఇది....

Wednesday, September 2, 2015 - 06:57

ఢిల్లీ : మోడీ సర్కార్‌ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మికలోకం నేడు సమ్మె చేపడుతోంది. ఈ సమ్మెకు 10 కార్మికసంఘాలు మద్దతిచ్చాయి. ఇప్పటికే కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క కార్మికుడు సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. కార్మికుల సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి.
సమ్మెలో పాల్గొననున్న 15...

Tuesday, September 1, 2015 - 22:36

హైదరాబాద్ : అసలే అంతంత మాత్రం హక్కులు. వాటినీ హరించడానికి ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. కార్పొరేట్లకు రెడ్‌కార్పెట్‌ వేయడం కోసం కార్మికుల ప్రయోజనాలకు రెడ్‌సిగ్నల్‌ చూపిస్తున్నారు. అందుకే సమ్మె సైరన్‌ మోగింది. సర్కార్‌ ద్వంద్వ విధానాలపై కార్మికలోకం గర్జించింది. రేపటి నుంచి జరగనున్న సమ్మెకు సన్నాహాలు పూర్తయ్యాయి. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు యావత్ కార్మికలోకం...

Tuesday, September 1, 2015 - 21:34

హైదరాబాద్ : షీనా బోరా హత్యకు గురి కాలేదా? నిజంగానే ఆమె అమెరికాలో బతికే ఉందా? షీనా బోరా హత్య కేసు విచారణలో ఇంద్రాణి ముఖర్జీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు షీనా బోరాను డబ్బు కోసమే ఇంద్రాణి ముఖర్జీ హత్య చేసి ఉంటుందని ఆమె మొదటి భర్త ఆరోపించారు.

షీనా బోరా అమెరికాలో సజీవంగానే ఉందంటున్న తల్లి ఇంద్రాణి

షీనా...

Tuesday, September 1, 2015 - 21:30

హైదరాబాద్ : గజ్జె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటోంది. ఆయన వస్తాడనే వార్తలతో ప్రత్యర్థుల గుండెలు ఝల్లుమంటున్నాయ్‌. ఓరుగల్లులో గద్దర్‌ గజ్జె కట్టి ఘల్లుమనిపిస్తారనే వార్తలు ప్రధాన పార్టీలకు కలవరం పుట్టిస్తున్నాయి. వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నిక బరిలో ప్రజా గాయకుడు గద్దర్‌ను నిలిపేందుకు కృషి చేస్తున్నాయి వామపక్షాలు. తమ ప్రతిపాదనను గద్దర్‌ ముందు...

Tuesday, September 1, 2015 - 21:14

హైదరాబాద్ : వచ్చిన వారందరికీ రెడ్‌కార్పెట్ పరిచారు. రండి..రండంటూ...ఘనంగా ఆహ్వానం పలికారు. పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ పెద్ద పీట వేశారు. దీంతో కొత్త స్నేహం చిగురించింది. పాత బంధానికి బ్రేకు పడింది. దీంతో బాల్య మిత్రులు అసంతృప్తిగా ఉన్నారు. కొత్త మిత్రులు వచ్చాక...పాత దోస్తులను మర్చిపోయారని వాపోతున్నారు. ఈ వ్యవహారంతో..అసలైన సమయంలో.. అధినేతకు కొత్త తలనొప్పి...

Tuesday, September 1, 2015 - 20:31

హైదరాబాద్‌ : ఎవరైనా సరే తనకు తాను ఎదగాలని కానీ.. అండదండలు చూసుకుని ముందుకెళ్లకూడదని దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి అన్నారు. వరుణ్‌తేజ కంచె సినిమా ట్రైలర్‌ విడుదల సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ... పెద్ద సినిమా ఫ్యామిలీ నుండి వస్తున్నవారికి ఆ కుటుంబం నుండి రావడం ఎంత వరమో.. అంతే శాపమన్నారు. ఇండస్ట్రీలో ముందు నుండి కొనసాగుతున్న వారు సలహాలు ఇస్తుంటారని, ప్రతి విషయాన్ని...

Pages