News

Tuesday, October 23, 2018 - 22:25

కరీంనగర్ : జిల్లా డిప్యూటీ కలెక్టర్ కార్యాలయాన్ని జప్తు చేయడానికి ఓ సామాన్యుడు వచ్చాడు. అతన్ని చూసి సిబ్బంది తాళాలు వేసుకుని వెళ్లి పోయింది. కరీంనగర్ జిల్లాలో వెంకటేష్ అనే వ్యక్తి ఎస్సారెస్పీ కాలువ విస్తరణ పనుల్లో తన  భూమిని కోల్పోయాడు. పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. 35 ఏళ్లుగా వెంకటేష్ న్యాయపోరాటం...

Tuesday, October 23, 2018 - 22:08

నెల్లూరు : జిల్లాలో విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. ఓ విద్యార్థి మరో విద్యార్థిపై బీర్ బాటిల్‌తో దాడికి పాల్పడ్డాడు. సూళ్లూరుపేట ప్రభుత్వ కళాశాలలో మనోజ్‌, సురేష్ మధ్య ఘర్షణ జరిగింది. తన చెప్పును తీసుకురానందుకు మనోజ్ అనే విద్యార్థిపై సురేష్ బాటిల్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మనోజ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు....

Tuesday, October 23, 2018 - 21:47

ఖమ్మం : పట్టణంలో దారుణం జరిగింది. విద్యార్థుల మధ్య ఘర్షణలో ఒక విద్యార్థి మృతి చెందారు. ఓ విద్యార్థి.. మరో విద్యార్థిని హత్య చేశాడు. ఖమ్మం ప్రభుత్వ గిరిజన పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి.. జోసఫ్ అనే 4 వ తరగతి విద్యార్థితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో 10వ తరగతి విద్యార్థి.. జోసఫ్‌ను తీవ్రంగా కొట్టాడు. ఆపై జోసఫ్‌ను పెట్టెలో పెట్టి...

Tuesday, October 23, 2018 - 20:48

వరంగల్ అర్బన్ : మహాకూటమికి ఓటమి తప్పదని మంత్రి కేటీఆర్ అన్నారు. స్టేషన్ ఘనపూర్‌లో అభివృద్ధి టీఆర్ఎస్‌తోనే సాధ్యమని చెప్పారు. స్టేషన్ ఘనపూర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణ చాలా నష్ట పోయిందన్నారు. 

మిషన్ కాకతీయపై కాంగ్రెస్ నేతలు పనికిమాలిన ఆరోపణలు...

Tuesday, October 23, 2018 - 20:23

హైదరాబాద్ : యాదాద్రిలో మహిళలు, చిన్నారులతో వ్యభిచారం కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. చిన్నారులపై ఆక్సిటోసిన్ ఇంజక్షన్ వాడటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంజక్షన్ వాడకం వల్ల కలిగే అనర్దాలపై ధర్మాసనం వివరణ కోరింది. యాదాద్రిలో రెస్క్యూ అయిన చిన్నారులకు మరోసారి ఉస్మానియా వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు...

Tuesday, October 23, 2018 - 18:22

ఢిల్లీ: లంచం తీసుకున్నారనే అభియోగంలో ఎఫ్ఐఆర్ నమోదైన సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్ధానాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దాన్ని కొట్టివేయాలని, తనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా సీబీఐను ఆదేశించాలని ఆస్ధానా ఈరోజు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు చెప్పిన వివరాలు...

Tuesday, October 23, 2018 - 17:52

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమల్లో ప్రస్తుతం బయోపిక్‌ల హవా కొనసాగుతుంది.. మహానటి సావిత్రి బయోపిక్ తీస్తే బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్ధాయిగా నిలిచిపోయిన నందమూరి తారక రామారావు, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర రెడ్డి బయోపిక్‌లు షూటింగ్ జరుపుకుంటున్నాయి.. ఇప్పుడు తమిళ నాట స్వర్గీయ జయలలిత బయోపిక్...

Tuesday, October 23, 2018 - 17:29

గుంటూరు : ఏపీలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం 14 మంది ఐపీఎస్‌‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ రూరల్‌ ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ విశాఖ సిట్‌కు బదిలీ అయ్యారు. కడప ఎస్పీగా ఉన్న అట్టాడ బాబూజీని విశాఖ రూరల్‌ ఎస్పీగా బదిలీ చేశారు. చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌ను గుంటూరు రూరల్‌ ఎస్పీగా బదిలీ చేశారు. చిత్తూరు ఓఎస్డీ...

Tuesday, October 23, 2018 - 16:47

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బోగస్ఓట్లు తొలగింపులో ఎన్నికల సంఘం చర్యలు కంటితుడుపుగానే ఉన్నాయని, హైకోర్టును ఎన్నికలసంఘం తప్పుదోవ పట్టించిందని కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఈఅంశంపై న్యాయపోరాటం చేస్తానని ఆయన చెప్పారు. తమదగ్గర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సాఫ్ట్ వేర్ ఉందని చెప్పిన ఎన్నికల...

Tuesday, October 23, 2018 - 16:47

ఢిల్లీ : నవంబర్‌‌లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనుంది. ఈ నెల చివరి నాటికి స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయనుంది. నవంబర్‌ మొదటివారంలో అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా పేర్కొన్నారు. ఈనెల చివరికి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సిద్ధం అవుతుందన్నారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో...

Tuesday, October 23, 2018 - 16:35

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్‌డేసందర్భంగా, యు.వి.క్రియేషన్న్ వారు షేడ్స్‌ఆఫ్ సాహో చాప్టర్1 పేరుతో విడుదల చేసిన వీడియో దెబ్బకి, డార్లింగ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న వారి పోస్ట్‌లకి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది..
సాహో వీడియో చూసిన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.. మరోవైపు సెలబ్రిటీలు కూడా సైరా సాహో, సాహోరే సాహో అంటూ ఒక రేంజ్‌లో ట్వీట్లు చేస్తున్నారు.....

Tuesday, October 23, 2018 - 16:27

ఢిల్లీ : అత్యున్నత విచారణ సంస్థ సీబీఐలో లంచాల వ్యవహారం కలకలం రేపుతోంది. లంచాల అంశం దుమారం చెలరేగుతోంది. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. 

సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మకు, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాకు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు అంశం కోర్టుకు చేరింది. తనపై కేసు నమోదు చేయడాన్ని...

Tuesday, October 23, 2018 - 16:19

ఢిల్లీ: సరికొత్తగా ముస్తాబైన 'హ్యుందాయ్‌ శాంత్రో’ మళ్లీ భారత మార్కెట్‌లోకి వచ్చేసింది. ప్రముఖ కొరియన్ కార్ల కంపెనీ హ్యుందాయ్ తన సరికొత్త శాంత్రో మోడల్ కార్‌ను దేశీయ విపణిలో నేడు ప్రవేశ పెట్టింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సరికొత్త ది ఆల్ న్యూ 'శాంత్రో' ఫ్యామిలీ కారును ఘనంగా ఆవిష్కరించారు. ఈ సరికొత్త...

Tuesday, October 23, 2018 - 15:44

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులోఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగిస్తూ ప్రభుత్వం ఈఏడాది ఆగస్టు 1న జారీ చేసిన జీవో నెంబరు 90ని  హైకోర్టు మంగళవారం కొట్టి వేసింది. వచ్చే 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్పెషల్ ఆఫీసర్ల పాలనను వ్యతిరేకిస్తూ మాజీ సర్పంచ్ లు  దాఖలు చేసిన...

Tuesday, October 23, 2018 - 15:41

హైదరాబాద్: ప్రొ.కోదండరామ్ ఆధ్వర్యంలో వచ్చిన తెలంగాణ జనసమితి పార్టీకి ఎన్నికల గుర్తు ఖరారైంది. టీజేఎస్‌ ఎన్నికల గుర్తుగా ''అగ్గిపెట్టె'' కేటాయించారు. ఇవాళ సాయంత్రం అధికారికంగా  సీఈసీ ప్రకటించనుంది. తెలంగాణ జనసమితి పార్టీ నూతనంగా ఆవిర్భవించడంతో ఆ పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించాలని సీఈసీని గతంలో కోరారు....

Tuesday, October 23, 2018 - 15:34

తనీష్, ప్రియా సింగ్ జంటగా, యూ అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై, వి.కార్తికేయ డైరెక్షన్‌లో, ఎ.పద్మనాభ రెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు నిర్మిస్తున్న మూవీ, రంగు.. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది..
అప్పుడెప్పుడో నచ్చావులే, రైడ్ సినిమాల తర్వాత ఇప్పటి వరకూ తనీష్‌కి హిట్ పడలేదు.. కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన నక్షత్రం కూడా నిరాశ పరచింది.. ఈ మధ్య...

Tuesday, October 23, 2018 - 15:33

కర్నూలు : జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ కేసులు అధికమవుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో మరో నలుగురికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఏడుగురు స్వైన్‌ఫ్లూ వ్యాధితో మృతి చెందారు. స్వైన్‌ఫ్లూతో తుంగభద్ర...

Tuesday, October 23, 2018 - 15:26

హైదరాబాద్: కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇంకా అభ్యర్థులను ప్రకటించనేలేదు. ఆశావహులు మాత్రం జోరుగా ప్రచారంలో మునిగిపోయారు. తమకే టికెట్‌ వస్తుందనే ఆశాభావంతో తమ తమ నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే సర్వే రిపోర్టు ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని అధిష్ఠానం తేల్చి చెప్పడంతో ఆశావహులు కాస్తా...

Tuesday, October 23, 2018 - 15:07

దేశ అత్యున్నత నేర విచారణ వ్యవస్థ క్రైం బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సీబీఐ) పనితీరుపై దేశం యావత్తు నివ్వెరపోయాలా చేసిన సంఘటన ఇది. ఇద్దరు సీబీఐ అధికారుల మధ్య జరిగిన ఆదిపత్యపోరు సీబీఐ పరువును రోడ్డున పడేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.  

  1. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్  రాకేష్ ఆస్ధానా - 1984  బ్యాచ్ గుజరాత్ కు చెందిన ఐపీఎస్ క్యాడర్ అధికారి...
Tuesday, October 23, 2018 - 13:59

రంగారెడ్డి: ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ కార్యకర్తలతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహం, ఎన్నికల ప్రచారంపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా మహాకూటమి, ఏపీ సీఎం చంద్రబాబుపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. మహాకూటమి జుట్టు చంద్రబాబు చేతిలో ఉందన్న కేటీఆర్.. మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ...

Tuesday, October 23, 2018 - 13:32

నార్త్ కరోలినా : హొటల్ వెళితే మనకు సర్వ్ చేసిన సర్వర్స్ కు ఎంతో కొంత టిప్ ఇవ్వటం సర్వసాధారణంగా జరిగేదే. సర్వర్ మనకు సర్వ్ చేసిన విధానం మనకు బాగా నచ్చితే ప్రశంసలతో పాటు మరికొంత ఎక్కువ టిప్ ఇస్తాం. కానీ కేవలం తాగేందుకు మంచినీళ్లు ఇచ్చినందుకు ఓ మహిళా సర్వర్ కు 10వేల డాలర్ ఇచ్చిన సందర్భం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది...

Tuesday, October 23, 2018 - 13:25

ఢిల్లీ: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ రోజు విచారణకు స్వీకరించింది. అయితే వచ్చే నెల 13న మధ్యాహ్నం 3 గంటలకు వీటిపై విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.

కేరళలోని శబరిమల ఆలయంలోకి 10-...

Tuesday, October 23, 2018 - 13:11

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా, సోషల్ మీడియా అంతా సందడి సందడిగా, హడావిడిగా ఉంది.. 
చాలామంది సినీ ప్రముఖులు డార్లింగ్ ప్రభాస్‌కి ట్విట్టర్‌లో  పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. 
రానా దగ్గుబాటి, బాహుబలి అప్పుడు సరదాగా తీసుకున్న ఫోటో పోస్ట్‌చేసి, హ్యాపీ బర్త్‌డే టూ యూ బ్రదర్ అంటూ విష్ చెయ్యగా, జగపతి బాబు, సుధీర్...

Tuesday, October 23, 2018 - 13:03

ఢిల్లీ: సీబీఐ స్పెషల్ డైరెక్టర్  రాకేష్ ఆస్ధానా అవినీతి కేసులో  సోమవారం రాత్రి అరెస్టైన  సీబీఐ డీఎస్పీ  దేవేందర్ కుమార్  తన అరెస్టును  సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై  ఈ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరుగుతుంది. వేల కోట్ల రూపాయలు మనీలాండరింగ్ వ్యాపారం చేసే మాంసం వ్యాపారి ఖురేషి కి  సంబంధించిన...

Tuesday, October 23, 2018 - 12:58

అనంతపురం : అసలు కరవు ప్రాంతం. నీటి ఎద్దడి. పంటలు వేసిన రైతన్నలు ఆరుగాలం ఆకాశంవైపు నీటి కోసం చూడాల్సిందే. దానికి తోడు పండించిన పంటకు తగిన మద్దతు ధర లేక రైతన్నలు దేశవ్యాప్తంగా అల్లాడిపోతున్నారు. దీనికి తోడు పలు  తెగుళ్లు పంటను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. అసలే కష్టాల కడలిలో ఎదురీదుతున్న అనంతపురం జిల్లా అన్నదాతలకు మరో గట్టి...

Tuesday, October 23, 2018 - 12:58

న్యూఢిల్లీ: ఆయనో పెద్ద కంపెనీకి బాస్.. వందల కోట్ల ప్రజల సొమ్ముకు కాపలాదారుడు. ఎవరు ఎవరికి డబ్బులు చెల్లించాలన్నా ఈ కంపెనీ యాప్‌ను ఉపయోగించాల్సిందే!. అదే పేటీఎమ్. పేటీఎమ్ ఆఫీసులోకి ఒక్కసారిగా పోలీసులు ఎంటరయ్యారు. అక్కడ పనిచేస్తున్న సోనియా ధావన్ అనే మహిళను సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. సోనియా తన బాస్‌కు...

Tuesday, October 23, 2018 - 12:51

విశాఖ: ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్ విశాఖ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాబోయే రోజుల్లో విశాఖ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని సీఎం చెప్పారు. విశాఖలో ఫిన్‌టెక్ ఫెస్టివల్ రెండో రోజుకి చేరింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.....

Pages

Don't Miss