News

Friday, May 27, 2016 - 21:56

చిత్తూరు : తిరుపతి వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మహానాడులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రెండు రాష్ట్రాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. 
చంద్రబాబుకు ఘనస్వాగతం
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు ఘనంగా...

Friday, May 27, 2016 - 21:50

హైదరాబాద్ : కృష్ణా బోర్డు సమావేశం వాడి వేడిగా సాగింది. బోర్డు చైర్మన్ నాథన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రెండు రాష్ట్రాల ప్రతినిథులు హాజరయ్యారు. 11 కీలక అంశాలపై ఇరు రాష్ట్రాలు తమ వాదనలను వినిపించాయి. రాబోయే సంవత్సరానికి సంబంధించిన నీటి అవసరాలు, లభ్యత, పంపిణీ లాంటి అంశాలను సమావేశం చర్చించింది. 
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం
...

Friday, May 27, 2016 - 21:44

హైదరాబాద్ : తనను తాను పొగుడుకోవడానికి, ప్రతిపక్షాలను విమర్శించడానికి మాత్రమే చంద్రబాబునాయుడు.. మహానాడు వేదికను ఉపయోగిస్తున్నారని  కాంగ్రెస్‌ నాయకుడు రామచంద్రయ్య ఆరోపించారు.  మహానాడు వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. రాష్ట్రంలో ధరలు పెరిగిపోతున్నాయని, నిరుద్యోగం కూడా పెరిగిపోతుందని వాటి గురించి మహానాడు కార్యక్రమంలో చర్చించాలని డిమాండ్‌ చేశారు. 

Friday, May 27, 2016 - 21:18

ఎండలు సేయంగ పంటలు ఎండినాయ్, బోర్లు ఎండినాయ్, బావులు ఎండినాయ్.. సర్కారు అదుకున్తదని సాకులు సెప్పలే ఆ రైతు .. జెర్ర బుర్ర వెట్టి ఆలోసించి  సూర్యుని  మీద, కరువు మీద గెల్సిండు  రైతు.. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అన్నట్టు ఉండే గీ  ముచ్చటేందో మీరే సుడుoడ్రి  

Friday, May 27, 2016 - 21:08

'అ..ఆ' మూవీ టీమ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా హీరో నితిన్, హీరోయిన్ సమంత, నటీ నదియాలు సినిమా విశేషాలను తెలిపారు. వారు తమ సినిమా అనుభవాలను వివరించారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

 

Friday, May 27, 2016 - 20:52

తిరుపతి గుంట కింద తిష్టేసిన పసుపు దళం.. బాబుగారిని ఎక్కిచ్చుడే ఇక అందలం, సచివాలయం మీదికి మర్రిన ముచ్చట... కూలగొట్టి కట్టేపడేస్తరట అచట, ఎరుగవోయి ఎల్లెలుకలవడ్డ ఎంకట్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీల తగ్గుకుంటొస్తున్న వన్నె, సమగ్ర సర్వే కాయిదాలకు మహర్దశ.. జోకేందుకొస్తున్న లిమ్కా బుక్కోళ్లు, లిఫ్టులో ఇరికిన హీరో, దర్శకుడు.. సల్లచముటలువట్టిచ్చిన అప్పన్న, దొంగను బరవత్తల నిలవెట్టింది...

Friday, May 27, 2016 - 20:15

తిరుపతి : ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం విభజన చట్టం తెచ్చి తెలుగు వాళ్లను విడదీసిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. నల్ల చట్టాలను తెచ్చి అనేక వివాదాలను మిగిల్చిన పాపం కాంగ్రెస్‌దేనని ఆయన ఆరోపించారు. విభజన చట్టంలో అనేక లోపాలున్నాయని కేంద్రం దృష్టికి తెచ్చిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు....

Friday, May 27, 2016 - 19:52

తూర్పుగోదావరి : కాకినాడ జీజీహెచ్‌లో డాక్టర్ల మధ్య వివాదం కలకలం రేపింది. ఎనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న డాక్టర్‌ అరుణ కుమారిపై మరో డాక్టర్‌ సుధాకర్‌ బాబు దాడిచేశాడు. ఈ ఘటనతో తోటి వైద్యులు ఆందోళనకు దిగి మేయిన్‌ గేట్‌ ముందు ధర్నాకు దిగారు. వైద్యురాలిపై దాడిచేసిన డాక్టర్ సుధాకర్‌, అతని బంధువులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. చట్టపరమైన చర్యలు...

Friday, May 27, 2016 - 19:50

విశాఖ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్నానం కోసం వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతిచెందిన ఘటన డుంబ్రిగూడలో జరిగింది. తొమ్మిదేళ్ల బాకురు సిద్ధార్థ, తాంగుల భవాని, ఎనిమిదేళ్ల స్వాబి హరిత చాపరాయి జలపాతానికి స్నానం కోసం వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు గెడ్డలో మునిగి చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనతో చిన్నారుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ చిన్నారులు...

Friday, May 27, 2016 - 19:46

హైదరాబాద్ : పోలవరంపై నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలైంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని... ఆరోపిస్తూ.. పోలవరం రైతు సంక్షేమ సంఘం ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. పర్యావరణ ఉల్లంఘన జరిగితే... ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్ రద్దు ఎందుకు కోరలేదని ప్రశ్నించింది. దీనిపై సవరించిన పిటిషన్‌...

Pages

Don't Miss