News

Friday, February 12, 2016 - 12:49

హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ ఈనెల 19కు వాయిదా పడింది. ఉదయం ఆస్తుల విలువ, వివరాలను యాజమాన్యం కోర్టుకు సమర్పించింది. వీటిని పరిశీలించిన ధర్మాసనం.. విచారణ ఈనెల 19కు వాయిదా వేసింది. మరోవైపు అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాలపై ఏర్పాటైన సీతాపతి కమిటీ ఇవాళ సమావేశం కానుంది.

 

Friday, February 12, 2016 - 12:47

పశ్చిమగోదావరి : ఏలూరు కోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ ముగిసింది. సంస్థ ఛైర్మన్, ఎండీలకు న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం... ఇద్దరిని ఏలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు వీరిద్దరిని తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.

 

Friday, February 12, 2016 - 12:38

హైదరాబాద్ : శాసనసభలో తమదే అసలైన టీడీపీగా గుర్తించాలని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పీకర్‌కు లేఖ రాశారు. పార్టీ సభ్యుల్లో 2/3 వంతు ఎమ్మెల్యేలు తమవైపు ఉన్నారని ఎర్రబెల్లి లేఖలో పేర్కొన్నారు.

 

 

Friday, February 12, 2016 - 12:35

హైదరాబాద్ : ఆధునిక కలం ఆగిపోయింది. యువ జర్నలిస్టుల, నవ రచయితల దిక్సూచి అనంత కాలంలో కలిసిపోయింది.  సూటిగా..బాణంలా దూసుకుపోయే అక్షరాలు.. అన్యాయాన్ని నిలబెట్టి కడిగేసే పదునైన పదాలు...మూగబోయాయి. ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిస్టులకు రోల్ మోడల్‌ అయిన అరుణ్‌సాగర్‌ నిశ్శబ్ధంగా అందరినీ వీడి నింగికేగారు.
1967 జనవరి 2న జననం 
1967 జనవరి 2న...

Friday, February 12, 2016 - 12:29

హైదరాబాద్ : ప్రముఖ కవి, సీనియర్‌ జర్నలిస్ట్ అరుణ్‌సాగర్‌ కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అరుణ్‌సాగర్‌ అకాల మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీసీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, హన్స్ ఇండియా ఎడిటర్ నాగేశ్వర్,...

Friday, February 12, 2016 - 12:27

హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి కసరత్తులు కూడా ప్రారంభించింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్మాతల మండలితో కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశమయ్యింది. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను నిర్మాతలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.  
...

Friday, February 12, 2016 - 12:25

స్వార్థంతోనే ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహింహిచన న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీడీపీ నేత దుర్గాప్రసాద్, వైసిపి నేత ఉప్పులేటి కల్పన పాల్గొని, మాట్లాడారు. స్పీకర్లు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. జర్నలిస్టు అరుణ్ సాగర్ మరణం అనూహ్యంగా ఉందని... చాలా బాధాకరమన్నారు.  సాగర్ తనకంటూ ఒక...

Friday, February 12, 2016 - 11:31

ప్రైవేట్ ఉద్యోగాల్లో అభద్రతా భావంతోనే ప్రభుత్వ ఉద్యోగాలపై యువత ఆసక్తి చూపుతోందని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు.  గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. విద్యావ్యస్థలో సమూల మార్పులు తేవాలన్నారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే...

'గవర్నమెంట్ రంగంలో ఎప్పుడూ వేలు, లక్షల సంఖ్యలో ఉద్యోగ పోస్టులను వేయరు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు...

Friday, February 12, 2016 - 10:52

కరీంనగర్‌ : జిల్లా కోరుట్లలో నకిలీ నోట్లు పట్టుబడ్డాయి.. మేడిపల్లి జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. అందులో సోదాలు జరిపిన పోలీసులకు దాదాపు 2లక్షల 9వేల రూపాయల నకిలీ నోట్లు దొరికాయి. ఈ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు... వాహనంలోఉన్న నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఈ డబ్బు...

Friday, February 12, 2016 - 10:51

పశ్చిమగోదావరి : అగ్రిగోల్డ్ నిందితులను సీఐడీ అధికారులు ఏలూరు కోర్టులో హాజరుపర్చారు.  అగ్రిగోల్డ్ ఛైర్మన్ వెంకట రామారావు, ఎండీ వెంకట శేషునారాయణరావులను నిన్న సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. 

Pages

Don't Miss