న్యూస్ మార్నింగ్

Monday, August 13, 2018 - 10:32

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేడు, రేపు దీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్‌ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో రాహుల్‌ పర్యటించే ప్రాంతాలను రాష్ట్ర పోలీసులతో కలిసి ప్రత్యేక భద్రతాదళం అధికారులు పరిశీలించారు. ఓయూలో రాహుల్ సభకు ప్రభుత్వం, వీసీ అనుమతివ్వలేదు. దీంతో కొంత దుమారం రేగింది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా...

Sunday, August 12, 2018 - 08:36

ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. రాజకీయాలు వేడుకుతున్నాయి. అన్ని పార్టీలు 2019 ఎన్నికలకు సిద్ధమవుతన్నాయి. టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత మండలం హనుమంతురావు, బీజేపీ నేత ఉమామహేశ్వరరాజు, టీడీపీ నేత గొట్టిముక్కల రామకృష్ణప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Saturday, August 11, 2018 - 08:25

ఈడీ ఛార్జీషీట్ లో భారతి పేరుందని వచ్చిన కథనాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. రఘురాం సిమెంట్స్ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదులో జగన్ సతీమణి వైఎస్ భారతిని 5వ నిందితురాలిగా పేర్కొంది. దీనిపై శుక్రవారం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఛార్జీషీట్ ను సీబీఐ న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకముందే పత్రికల్లో వార్తలు ఎలా ప్రచురిస్తారని ప్రశ్నించారు. సీబీఐ విచారణలో...

Friday, August 10, 2018 - 20:27
Friday, August 10, 2018 - 08:47

ఏపీలో టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇదే ఏపీ రాజకీయాలపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు లక్ష్మీనారాయణ, టీడీపీ నేత సూర్యప్రకాశ్, వైసీపీ కిలారి రోశయ్య పాల్గొని, మాట్లాడారు. ఏపీలోని  విపక్షాల మధ్య ఐక్యత లోపించదన్నారు. రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంపై పోరాడాల్సింది పోయి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారని తెలిపారు. అందరూ ఐక్యంగా హక్కుల సాధన...

Thursday, August 9, 2018 - 08:08

ఇవాళ రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పదవికి ఎన్నిక జరగనుంది. ఎన్డీయే తరపున జెడియు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, విపక్షాల తరపున కాంగ్రెస్‌ అభ్యర్థి బికె హరిప్రసాద్‌ పోటీ పడుతున్నారు. తమ తమ అభ్యర్థుల గెలుపుపై ఇరుపక్షాలు ధీమాతో ఉన్నాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగియడానికి ఒకరోజు ముందు ఈ ఎన్నిక జరుగుతోంది. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్...

Wednesday, August 8, 2018 - 09:00

డీఎంకే అధినేత కరుణానిధి మృతి తీరని లోటు అని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, బీజేపీ నేత కుమార్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి క్రిశాంక్ పాల్గొని, మాట్లాడారు. తమిళ రాజకీయాల్లో కరుణానిధితో పోల్చదగిన నాయకుడు లేరన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని నమ్మినవాడని.. హేతువాది అని అన్నారు. సంక్షేమ పథకాలు ఆద్యుడు కరుణానిధి తెలిపారు. మరిన్ని...

Tuesday, August 7, 2018 - 19:27

గత 11 రోజులుగా మృత్యువుతో పోరాడి అలసిపోయిన డీఎంకే అధ్యక్షుడు, మాజీ సీఎం కరుణానిధి కావేరీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటు మృతి చెందారు. దేశ రాజకీయ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక పార్టీకి 50 ఏళ్లు అధ్యక్షుడిగా వున్న కరుణానిధి నాయకత్వంతో డీఎంకే ఎన్నో విజయాలను చవి చూసింది. తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి రాజకీయ మార్క్ అసాధారణమైనది. ఈ అంశంపై చర్చ, ఈ చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు...

Tuesday, August 7, 2018 - 12:08

మధ్యాహ్నం భోజన పథకం ప్రైవేటీకరణకు ప్రభుత్వం సిద్ధం అయింది. ప్రజా సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఇదే అంశంపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు గఫూర్ పాల్గొని, మాట్లాడారు. మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రైవేటీకరించవద్దని ఆయన అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Tuesday, August 7, 2018 - 10:27

పార్లమెంట్‌లో పెద్దల సభ ఎన్నికలకు సిద్ధం అయ్యింది. ఈనెల 9న జరుగనున్న రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికపై అధికార, విపక్షాలు దృష్టి సారించాయి. 26ఏళ్ల తర్వాత ఉపసభాపతి పదవికి ఎన్నిక జరుగుతుండడంతో ఆ పదవి ఎవరిని వరిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించినట్టుగానే... డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఎన్డీయే వ్యూహాలు...

Thursday, August 2, 2018 - 21:14

ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచింది. కీలక వడ్డీరేట్లను పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 6.25 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది. రెపో రేటు పెరగడంతో బ్యాంకులు రుణాలపై వడ్డీ శాతాన్ని పెంచే అవకాశం ఉంది. 2019 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆర్థికరంగ విశ్లేషకులు శశికుమార్ పాల్గొని, మాట్లాడారు...

Thursday, August 2, 2018 - 20:43

దళితాగ్రహానికి కేంద్రం దిగి వచ్చింది. మరో విడత ఆందోళనల అగ్గి రాజుకోకముందే జాగ్రత్త పడింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని తీర్మానించింది. ఈ చట్టం మునుపటిలాగా కఠినంగా, పటిష్టంగా ఉండేలా చూడాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై మోడీ సర్కార్ కు ఉన్న కమిట్ మెంట్ ఎంత ? ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో...

Wednesday, August 1, 2018 - 20:41

ఇక లంచం ఇస్తే కటకటాలపాలే..లంచం ఇచ్చిన వారికి కూడా ఏడేళ్ల జైలు శిక్ష పడనుంది. ఇక లంచం తీసుకోవడంతోపాటు ఇవ్వడం నేరమే.. లంచం ఇస్తే జైలుకు పోకతప్పదు.. ఈ విషయాన్ని రాష్ట్రపతి ఉత్తర్వులు స్పష్టం చేశాయి. వీటిపై భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తున్నాయి. ఇదే అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు రాజేంద్రప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. చట్టాల ద్వారా అవినీతిని కంట్రోల్...

Wednesday, August 1, 2018 - 19:57

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అధికార, విపక్షాలు విమర్శలకు దిగాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్‌ కుట్రలు చేస్తుందని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. హరీష్‌రావు వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి తిప్పికొట్టారు. ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్‌ పేరుతో 50 వేల కోట్ల రూపాయలను కేసీఆర్‌ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి కూడా...

Tuesday, July 31, 2018 - 21:24

తెలంగాణలో రేపటితో గ్రామ పంచాయతీ సర్పంచ్ ల పదవీ కాలం ముగియనుంది. ఆగస్టు 2 నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. రెండో తేదీ నుంచి 4 వేలకు పైగా కొత్త గ్రామ పంచాయతీలు రానున్నాయి. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్న గ్రామ పంచాయతీలకే నిధులు, అధికారాలు సరిగా ఇవ్వడం లేదని విమర్శలు చేస్తున్నారు. ఇదే అంశంపై నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో...

Tuesday, July 31, 2018 - 20:42

అసోంలో భారత పౌరులకు సంబంధించిన లిస్టును నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ విడుదల చేసింది. ఈ రిజిస్టర్‌ ముసాయిదాలో 40 లక్షల మందికి పౌరసత్వం లభించకుండా పోయింది. మొత్తం 3.29 కోట్ల మందికి గాను 2.89 కోట్ల మందిని ఈ ముసాయిదాలో చేర్చారు. ఇది కేవలం డ్రాఫ్ట్‌ మాత్రమేనని తుది జాబితా కాదని అధికారులు స్పష్టం చేశారు. ముసాయిదాలో లేనివారిని విదేశీయులుగా పరిగణించబోమని జాతీయ పౌర రిజిస్టర్...

Tuesday, July 31, 2018 - 07:39

గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. దీంతో వీరి స్థానంలో ప్రత్యేకాధికారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టు కేసుల కారణంగానే పంచాయితీ ఎన్నికలను వాయిదా వేశామని నిన్న గవర్నర్ భేటీలో కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ క్రమంలో ఆగస్టు 2వ తేదీ నుంచి పంచాయతీలు ప్రత్యేకాధికారులు ఏలుబడిలోకి వెళ్తాయి. కొత్తగా ఏర్పాటు చేసిస పంచాయతీలు...

Monday, July 30, 2018 - 20:41

అసోంలో భారత పౌరులకు సంబంధించిన లిస్టును నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ విడుదల చేసింది. ఈ రిజిస్టర్‌ ముసాయిదాలో 40 లక్షల మందికి పౌరసత్వం లభించకుండా పోయింది. మొత్తం 3.29 కోట్ల మందికి గాను 2.89 కోట్ల మందిని ఈ ముసాయిదాలో చేర్చారు. ఇది కేవలం డ్రాఫ్ట్‌ మాత్రమేనని తుది జాబితా కాదని అధికారులు స్పష్టం చేశారు. ముసాయిదాలో లేనివారిని విదేశీయులుగా పరిగణించబోమని జాతీయ పౌర రిజిస్టర్...

Monday, July 30, 2018 - 20:14

కాపు రిజర్వేషన్ పరిధి దాటింది. అన్ని పార్టీలు కాపు రిజర్వేషన్ పై చర్చిస్తున్నాయి. ఏపీలో కాపు రిజర్వేషన్ అంశంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. జగన్ వ్యాఖ్యలపై కాపునేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. జగన్ వ్యాఖ్యలను రాజకీయంగా వాడుకునే పనిలో టీడీపీ పడింది. కాపులను టీడీపీనే మోసం చేసిందని వైసీపీ అంటోంది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు ఎస్.వెంకట్రావు, టీడీపీ...

Monday, July 30, 2018 - 17:41

అవసరానికి మించి మెడిసిన్ వాడటం ఆరోగ్యానికి ప్రమాదకరం.. కంబైన్డ్ డ్రగ్స్, పెయిన్ కిల్లర్ విషయంలో జాగ్రత్తలు అవసరం... సిటి స్కాన్ విషయంలో మరింత చైతన్యం రావాలి. వైద్యం రంగంలో నైతిక విలువలు..మెడిసిన్ తో జాగ్రత్త..! అనే అంశంపై నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో డా.శాతవాహన చౌదరి పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే..
'మొట్ట మొదటి యాంటి బయాటిక్.. పెన్సిలిన్. రెండు,...

Sunday, July 29, 2018 - 12:19

రక్షణ శాఖ అనుమతి లేకుండానే 'రాఫెల్' ఒప్పందాలు జరిగిపోయాయా ? కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంతా ? యూపీఏ హయాంలో ఏం జరిగింది ? ఎన్డీయే హయాంలో ఏం జరుగుతోంది ? 'రాఫెల్' రగడపై గత కొన్ని రోజులుగా హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో నగేష్ (విశ్లేషకులు), కిశాంక్ (కాంగ్రెస్), సుదర్శన్ (రక్షణ రంగ నిపుణులు), ఎన్.వి.సుభాష్ (బిజెపి...

Pages

Don't Miss