Yadadri

12:33 - September 24, 2017

యాదాద్రి : జిల్లాలోని చౌటుప్పల్‌లో నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉంటున్న రమాదేవి అనే మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రమాదేవికి.... నాలుగు నెలల క్రితమే గుంటూరు జిల్లాకు చెందిన ప్రదీప్‌తో వివాహం జరిగింది. తన మరణానికి ప్రదీప్ కారణమని ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:15 - September 24, 2017

యాదాద్రి : పోరాటం ద్వారా ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందన్నారు అరుణోదయ సమాఖ్య చైర్మన్‌ విమలక్క. యాద్రాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గందమల గ్రామంలో బహుజన బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొని బతుకమ్మ ఆడారు. ఊర్లలో ప్రజల మధ్య చక్కని అనుబంధం ఉంటుందన్నారు. అలాంటి గ్రామాలను ప్రాజెక్టులు కట్టి ముంచొద్దన్నారు విమలక్క. వేలాదిమందిని నిర్వాసితులు చేసే ప్రాజెక్టులు అవసరమా ? అని ఆమె ప్రశ్నించారు. గంధమలలో ప్రాజెక్టులు అవసరం లేదని... దీని కోసం ప్రజలంతా పోరాటం చేయాల్సిన అవసరముందని విమలక్క అన్నారు. 

20:13 - September 23, 2017

యాదాద్రి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద మరోసారి రైతులు ఆందోళనకు దిగారు. అర్హులకు నష్టపరిహారం చెల్లించకుండా కొంతమంది అధికార పార్టీ నేతల పేర్లను జాబితాలో చేర్చారని విమర్శిస్తూ.. రైతులు దామరచర్ల మండలం వీర్లపాలెంలోని పవర్ ప్లాంట్ పైలాన్ వద్ద ధర్నా చేపట్టారు. నష్టపరిహారం చెల్లించేందుకు మొదట విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు ఉన్నాయని.. కానీ రెండో జాబితాలో తమ పేర్లకు బదులు... వేరే వారి పేర్లు వచ్చాయని అర్హులైన రైతులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అక్కడికి చేరుకొని రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపారు. అర్హులైన రైతులందరికి పరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని.. లేదంటే ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామని హెచ్చరించారు.

19:39 - September 18, 2017

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదమైంది. పండక్కి.. చేనేత చీరలు అందిస్తామంటూ ప్రకటనలతో ఊదరగొట్టిన ప్రభుత్వం.. సూరత్‌, షోలాపూర్‌ తదితర ప్రాంతాల నుంచి తెప్పించిన పాలియెస్టర్‌ చీరలను మహిళలకు పంపిణీ చేసింది. దీంతో ఎక్కడికక్కడ మహిళాలోకం భగ్గుమంది. ఉదయం నుంచీ క్యూలైన్లలో నిలుచుని చీరలు తీసుకున్న మహిళలు.. వాటి నాణ్యతను చూడగానే ప్రభుత్వంపై శాపనార్థాలు మొదలు పెట్టారు.

పద్దెనిమిది సంవత్సరాల పైబడ్డ ప్రతి మహిళకూ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తామన్న ప్రభుత్వం.. కోటీ నాలుగు లక్షల చీరలను సిద్ధం చేసింది. సుమారు 222 కోట్ల రూపాయలను దీనికోసం ఖర్చు చేసింది. సిరిసిల్ల నేతన్నల నుంచి 52 లక్షల చీరలు.. మిగిలిన చీరలు టెండరింగ్ ప్రక్రియ ద్వారా సేకరించామని ప్రభుత్వం వెల్లడించింది. తీరా పంపిణీ సమయంలో.. చేనేత చీరలు కాకుండా పాలియెస్టర్‌ చీరలు అందించడంతో.. కొందరు మహిళలు వాటిని అక్కడికక్కడే తగులబెట్టేశారు.

హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని శ్రీశంకర్ కాలనీలో బతుకమ్మ చీరలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకో ప్రాంతంలో ఒకో రకం చీరలు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్బీనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉదయం నుంచి పడిగాపులు కాసినా అధికారులు చీరల పంపిణీ చేయకపోవడంపై మహిళలు భగ్గుమన్నారు.

బతుకమ్మ చీరలపై నల్లగొండ జిల్లా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతలేని చీరలను పంచుతున్నారంటూ.. కేసీఆర్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. రోడ్డుపై చీరలను కుప్పగా పారేసి నిరసన తెలిపారు.

బతుకమ్మ చీరలపై ఖమ్మం జిల్లా మహిళలు మండిపడ్డారు. సిరిసిల్ల చేనేత చీరలిస్తామన్న ప్రభుత్వం చివరికి నాసిరకం పాలిస్టర్ చీరలు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ చర్యను విపక్షాలూ తప్పుబట్టాయి. కేసీఆర్ ప్రభుత్వం మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆక్షేపించాయి.

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బతుకమ్మ చీరల బాగోతం బయటపడింది. నాసిరకం చీరలు అంటగడుతున్నారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా చల్‌గల్‌లో బతుకమ్మ చీరలపై మహిళలు ధ్వజమెత్తారు. తమకి ఇచ్చిన చీరలను విసిరికొట్టారు.

వనపర్తిలో ఇదే సీన్ కనిపించింది. చేనేత చీరలు ఇస్తామని చెప్పి.. పాలిస్టర్ చీరలు ఇస్తారా అంటూ మహిళలు మండిపడ్డారు. పనులు మానుకుని వచ్చిన తమ కూలీ డబ్బులు అధికారులు ఇస్తారా అని నిలదీశారు.

మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం బొద్దుగుంటలో తమకిచ్చిన చీరలు వెనక్కు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. బొంతలు కుట్టుకునేందుకు కూడా ఈ చీరలు పనికి రావని మహిళలు విమర్శించారు.

మరోవైపు చీరల పంపిణీలో ఎటువంటి గోల్ మాల్ జరగలేదన్నారు టెక్స్ టైల్ కమిషనర్ శైలజా రామయ్యర్. సూరత్‌లో తయారు చేసిన చీరలు ఇతర చీరల కన్నా కాస్త భిన్నంగా ఉంటాయని చెప్పారు. ఈ చీరల క్వాలిటీపై పూర్తి పర్యవేక్షణ జరిగిందని స్పష్టం చేశారు.

ఎంతో అట్టహాసంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అభాసుపాలయ్యే పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలపై దృష్టి సారించింది. చీరలు కాల్చిన వారిపై నాన్‌బెయిలబుల్‌ కేసుల నమోదుకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో భువనగిరి, జగిత్యాల జిల్లాలో అరెస్టులు జరిగాయి. చీరలు తగలపెట్టారని... భువనగిరిలో పోలీసులు 18 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జగిత్యాల జిల్లా జల్గల్ సర్పంచ్ కవిత భర్త రాజేందర్‌ను కూడా ఇదే నెపంతో.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు.. పీఎస్‌ ముందు ధర్నాకు దిగారు.

16:03 - September 18, 2017
19:12 - September 15, 2017

యాదాద్రి : మదర్‌ డైరీకి సరఫరా చేస్తున్న పాలకు లీటర్‌కు నాలుగు రూపాయల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలంటూ యాదాద్రి జిల్లా భువనగిరిలో రైతులు చలో ప్రగతి భవన్‌ చేపట్టారు. ఈ నిరసనకు సీపీఎం, ఆ పార్టీ అనుబంధ సంఘాలు, రైతు సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, యువ తెలంగాణ అధినేత జిట్టా బాలకృష్ణా రెడ్డి మద్దతు పలికారు. విజయ డైరీలో చెల్లిస్తున్నట్లుగా పాడి రైతులకు ప్రోత్సాహకం ఇవ్వాలని డిమాండ్ చేశారు.. నిరసనలో భాగంగా వినాయక నగర్‌ చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరిన సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌తో పాటు పాడి రైతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.. 

16:38 - September 12, 2017

యాదాద్రి : జిల్లాలోని మోత్కూరు మండలం కేంద్రంలో ఓ విద్యార్థి ఆత్మహత్యయత్నం చేశాడు. జెడ్ పీహెచ్ ఎస్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కొంపెల్లి నవీన్‌ ప్రాణాలు తీసుకోబోయాడు. ఇది గమనించిన స్థానికులు నవీన్‌ను భువనగిరి ఆస్పత్రికి తరలించారు. కాగా ఇంగ్లీషు టీచర్‌ సత్యనారాయణ వేధింపులే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:12 - September 9, 2017

యాదాద్రి : వైద్యంకోసం వచ్చిన మహిళలపై అత్యాచారం చేసిన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం తహసిల్దార్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. స్థానికంగా నర్సింగ్‌ హోం నిర్వహిస్తున్న అజీజ్‌ పాషా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. వైద్యం కోసం వచ్చిన రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడని... ఆపరేషన్‌ అవసరం లేకపోయినా డబ్బుకోసం చేస్తున్నాడని మండిపడ్డారు. మహిళా రోగులపై అత్యాచారం చేస్తున్న డాక్టర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని తహశిల్దార్‌ను కోరారు. 

15:49 - September 6, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లా ఆలేరులో దారుణం జరిగింది. ఓ యువకుడు, అతని తల్లి బంధువులమని చెప్పి ఓ బాలికను గురుకుల కళాశాల నుంచి ఇంటికి తీసుకెళ్ళాడు. బాలిక తల్లి హాస్టల్‌కు ఫోన్‌చేయడంతో విషయం బయటపడింది. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిందితుడు జేమ్స్‌, అతని తల్లి రూబీని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై కిడ్నాప్‌, అత్యాచారం, నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

12:02 - September 6, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట నల్లపోచమ్మ వాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. భువనగిరి జిల్లా సెంట్ ఆన్ స్కూల్ కు చెందిన మినీ బస్సులో కొంతమంది విద్యార్థులు వెళుతున్నారు. స్కూల్ సమీపిస్తుందనగా టర్నింగ్ పాయింట్ వద్ద వెనుకనుండి వచ్చిన డీసీఎం బస్సును ఢీకొంది. దీనితో వర్షిత అనే(5) విద్యార్థిని మృతి చెందింది..నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి..వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - Yadadri