AP News

Saturday, July 4, 2015 - 09:48

హైదరాబాద్ : శనివారం సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. పలు పథకాలు అమలు, కొత్త పథకాలపై మంత్రులు చర్చించనున్నారు. ఆయా పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కేబినేట్ భేటీ ముగిశాక... సీఎం జపాన్ పర్యటనకు వెళ్తారు. శనివారం ఉదయం 11 గంటలకు సచివాయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. రాజీవ్ స్వగృహ అవకతవకలు, రాష్ట్రంలో 2 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణం, ఎర్రచందనం అక్రమ...

Saturday, July 4, 2015 - 09:29

విశాఖపట్టణం : ఆర్మీలో రిక్రూట్ మెంట్ ర్యాలీలో అపశృతులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నగరంలో చేపడుతున్న రిక్రూట్ మెంట్ ర్యాలీలో తోపులాటలు జరుగుతున్నాయి. పలువురు అభ్యర్థులు గాయపడ్డారు. అభ్యర్థులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జీ చేయాల్సి వస్తోంది. ఆర్మీలో పలు ఉద్యోగాల కోసం ఈనెల 13వ తేదీ రిక్రూట్ మెంట్ ర్యాలీ శుక్రవారం నుండి నగరంలో ప్రారంభమైంది. తొలి రోజు...

Saturday, July 4, 2015 - 08:57

అనంతపురం : జిల్లాలోని హిందూపురంలో దశాబ్దాలుగా ఉన్న కూరగాయల మార్కెట్ ను మున్సిపల్ అధికారులు శనివారం తొలగించారు. మార్కెట్ లోని భవనాలు పాతపడడంతో కొత్త భవనాలు నిర్మించేందుకు వీటిని తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పలువురు వ్యాపారస్తులు కూల్చివేతలను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సద్దుమణిగించారు. ఈ భవనాల కూల్చివేత...

Saturday, July 4, 2015 - 08:30

విశాఖపట్టణం : దేశభక్తితో కొందరు..పొట్ట పోషించుకొనేందుకు కొందరు..ఆర్మీలో చేరి ఉపాధి పొందాలని నిరుద్యోగులు ఆశిస్తున్నారు..వివిధ ప్రాంతాల్లో జరిగే ఆర్మీ రికూట్ మెంట్ ర్యాలీలో వీరు పాల్గొంటున్నారు.. కానీ ఈ నిరుద్యోగులకు పరీక్ష కంటే ముందే నరకం కనిపిస్తోంది. అధికారుల సమాచారలోపంతో వారు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.
ఆర్మీలో పలు ఉద్యోగాలకు ఈనెల 13వ తేదీ వరకు...

Saturday, July 4, 2015 - 08:11

కర్నూలు : వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. భూమాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆళ్లగడ్డ సబ్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అనారోగ్యం వల్ల హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి పోలీసులు తరలిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలీసులతో భూమా...

Saturday, July 4, 2015 - 06:29

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీలో మళ్లీ పదవుల పందేరం ప్రారంభం కాబోతోంది. మండలి విప్‌, చీఫ్‌ విప్‌ పదవులను భర్తీ చేయడంపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. దీంతో ఆశావహులు పదవులు దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. కౌన్సిల్‌లో కీలక పదవులు ఎగరేసుకుపోయేందుకు ఎవరికివారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
మండలిలో పెరిగిన సైకిల్ బలం..
...

Saturday, July 4, 2015 - 06:23

ప్రకాశం : ఏపీలో స్థానిక సమరం ఆట ముగిసింది. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఓటింగ్ ముగిసింది. చెదురుముదురు సంఘటనలు మినహా.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికను వైసీపీ బహిష్కరించగా.. కర్నూలులో అత్యధికంగా 99.67 శాతం పోలింగ్ నమోదయ్యింది. కాగా.. ఈనెల 7న ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల...

Saturday, July 4, 2015 - 06:19

అనంతపురం : జిల్లాలో హంద్రీనీవా రెండో దశ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబునాయుడు పరిశీలించారు. పనులపై కాంట్రాక్టర్ల పని తీరు పట్ల సీఎం అసహనం వ్యక్తం చేశారు. బ్లాక్‌ లిస్టులో పెడితే తప్ప కాంట్రాక్టర్లు మాట వినేలా లేరంటూ మండిపడ్డారు. వారిని వెనకేసుకొచ్చిన అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న నీటి...

Friday, July 3, 2015 - 21:27

శ్రీకాకుళం: జిల్లా జెడ్పీ సమావేశం రసాభాసగా మారింది. మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గందరగోళం నెలకొంది. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ బాధితులు మంత్రిని నిలదీశారు. పోడియం వద్దకు వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. దీంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు మంత్రి...

Friday, July 3, 2015 - 21:25

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు వైసీపీ తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తోంది. కొన్ని జిల్లాల్లో పార్టీని ముందుకు న‌డిపించే నేతలు లేకపోవడం.. మ‌రికొన్ని జిల్లాల్లో పార్టీ మ‌రింత బ‌ల‌హీనంగా ఉండ‌టంపై దృష్టి పెట్టిన వైసీపీ అధిష్టానం.. వాటిని స‌రిదిద్దేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో పార్టీ పటిష్టం చేయాలని యోచిస్తున్న అధ్యక్షడు జగన్‌.....

Friday, July 3, 2015 - 21:21

అనంతపురం: జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న ఆయన.. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు అన్నారు. అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి తెలిపారు.

Friday, July 3, 2015 - 19:54

విశాఖ: మున్సిపల్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలకు చెందిన అభ్యర్థులు...ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు తరలివచ్చారు. తొలి రోజు విశాఖ సిటీ, అనకాపల్లి సబ్ డివిజన్ ప్రాంతాలకు సంబంధించిన యువతకు టోకెన్ నంబర్లు అందజేశారు. 4న నర్సీపట్నం, పాడేరు, 5న శ్రీకాకుళం, 6న టెక్కటి సబ్ డివిజన్, 7న పాలకొండ, 8న విజయనగరం, 9న...

Friday, July 3, 2015 - 19:50

అనంతపురం: జిల్లా పుట్టపర్తిలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెట్లపొదల్లో వేశారు దుర్మార్గులు. దీంతో చిన్నారి శరీరాన్ని చీమలు విపరీతంగా కుట్టాయి. శిశువు అరుపులు విన్న ఓ కానిస్టేబుల్‌... స్థానిక మహిళ సాయంతో... పాపను సత్యసాయి జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి శరీరానికి చీమలు కుట్టడంతో.. ఒంటినిండా దద్దుర్లు వచ్చాయి. పాపను చూసి స్థానికులు...

Friday, July 3, 2015 - 19:48

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికలు ముగిశాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
1087 ఓటర్లు ఉండగా.. 1080 ఓట్లు పోలయ్యాయి..
కర్నూలు జిల్లాలో చెదురుముదురు సంఘటనలు మినహా ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రశాంతంగా...

Friday, July 3, 2015 - 18:32

కర్నూలు:వైసీపీ నేత, శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం జరిగిన పోలింగ్ సందర్భంగా ఆయన పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే తమ విధులకు అడ్డుతగిలారంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు. అరెస్టు చేసిన భూమాను త్రీటౌన్ పీఎస్ కు తరలించారు. ఆయనపై 353, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యింది. భూమా...

Friday, July 3, 2015 - 16:39

హైదరాబాద్: విజయనగరం జిల్లా భోగాపురంలో ఉద్రిక్తత నెలకొంది. మండలంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు కోసం... సర్వే బృందం భూ పరిశీలనకు వచ్చింది. వారిని బాధిత గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. కొయ్యపేట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయబోయారు. పక్కనే ఉన్న మహిళలు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. తమ భూముల్లోకి రావద్దంటూ అధికారులను అక్కడి...

Friday, July 3, 2015 - 16:35

కడప: స్కూల్‌ హెడ్‌మాస్టర్-టీచర్ల మధ్య స్కూల్‌ గ్రాంట్లపై జరిగిన గొడవ ఓ స్కూలుకు తాళాలు పడేలా చేసింది. ఈఘటన కడప జిల్లా జమ్మల మడుగు మండలం గూడెం చెరువులో చోటుచేసుకుంది. స్కూల్‌ హెడ్మాస్టర్ శాంతకుమారి, మరో ఇద్దరు టీచర్లు సుధాకర్, స్వర్ణకుమారీలకు స్కూల్‌కు వచ్చే గ్రాంట్ల విషయంలో గొడవ పడ్డారు. అయితే ఈ గొడవ ఎప్పటి నుంచో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఈ గొడవ...

Friday, July 3, 2015 - 13:55

గుంటూరు: ఏపీ రాజధాని గుంటూరులో మహిళా దొంగలు...షాపుల యజమానుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. గతకొద్దిరోజులుగా వస్త్రదుకాణాల్లో చాకచక్యంగా చీరల దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. ఒకవైపు షాపుల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ధైర్యంగా చోరీలకు తెగబడుతున్నారు. తాజాగా గుంటూరు నగరంలోని అరండల్ పేటలోని మూర్తీ ఫ్యాషన్స్ వస్త్ర దుకాణంలో నలుగురు మహిళలు...

Friday, July 3, 2015 - 13:50

కర్నూలు : మరోసారి జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా తమ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారంటూ కర్నూలు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణి ఆరోపించారు. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడుకు చెందిన ఎంపీటీసీ హుస్సేన్‌ను వైసీపీ నేతలు కిడ్నాప్‌ చేశారంటూ మీడియా ముందు చక్రపాని వెల్లడించారు. ఎంపీటీసీ ఆచూకీ కనుక్కోవాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన...

Friday, July 3, 2015 - 13:46

అనంతపురం: జిల్లాలోని బెళుగుప్ప మండలం కొట్టాల గ్రామంలో ఓ వర్గం వారు ఎమ్మార్వోపై దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన ఎమ్మార్వోపై ఈ దాడి జరిగింది. దాడి నుంచి బయటపడిన ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Friday, July 3, 2015 - 12:20

ప్రకాశం: కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలుత మందకొడిగా ప్రారంభమైన ఓటింగ్‌ ఆ తర్వాత మెల్లగా ఊపందుకుంటోంది. కర్నూల్ లో ఉదయం 10 గంటల వరకు 31 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు తెలిపారు. కర్నూలులో 114, ఆదోనిలో 131, నంద్యాలలో 111 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం 387 మంది ఓటు వేశారు. జెడ్ పిటిసి, ఎంపిటిసి, వార్డు సభ్యులు తమ ఓటు...

Friday, July 3, 2015 - 11:53

సిటీలు పెరుగుతున్నా పార్కులు పెరగడం లేదు. సమాజానికీ, ప్రకృతికీ ఎంతో మేలు చేసే పార్కుల విషయంలో ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. పార్కులకు కేటాయించిన భూములు కబ్జా అవుతున్నా అధికారులు నిద్ర నటిస్తున్నతీరు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా పార్కుల నిర్వహణపై శ్రద్ధ పెట్టకపోతే ఫలితాలు దారుణంగా వుంటాయి.                                                          ...

Friday, July 3, 2015 - 11:14

అనంతపురం: టీడీపీ మాజీ నేత దాడి వీరభద్రరావు తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత కాలం స్తబ్దుగా ఉన్న దాడి.. టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు పుట్టపర్తిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. రాజకీయ గ్రహణం పట్టడం వల్లే తాను వైసీపీలోకి వెళ్లినట్టు...

Friday, July 3, 2015 - 09:48

ప్రకాశం: కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగనుంది. ప్రకాశం జిల్లాలో ఎన్నికను వైసీపీ బహిష్కరించడంతో.. అందరి దృష్టీ కర్నూలు జిల్లాపైనే పడింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ కర్నూలు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పరిస్థితి ఉత్కంఠంగా మారింది. ఇరు పార్టీల నేతలు ఎవరి...

Friday, July 3, 2015 - 09:43

గుంటూరు: మాచర్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కొత్తపల్లి జంక్షన్ సమీపంలోని ఓ డాక్డర్ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ముగ్గురు దొంగలు.. డాక్లరతోపాటు అతని భార్యను తాళ్లతో కట్టేసి... తుపాకీతో బెదిరించి చోరీ చేశారు. 15 సవర్ల బంగారం, రూ. 4 వేల నగదును అపహరించారు.

 

Friday, July 3, 2015 - 09:30

తిరుపతి: తిరుమల శ్రీవారి మెట్ల వద్ద చిరుతలు కలకలం సృష్టించాయి. 1300 మెట్టు దగ్గర ఒక పెద్ద చిరుత పులి, రెండు చిన్న చిరుత పులులు కనిపించాయి. భక్తులు భయంతో పరుగులు తీశారు. నడకదారి భక్తులను నలిపి వేశారు. చిరుతల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Friday, July 3, 2015 - 08:02

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. పోలింగ్‌ కేంద్రాలకు పెన్నులు, సెల్‌ఫోన్లు తీసుకురాకూడదనే నిబంధనను విధించారు. ఓటింగ్‌కు వైలెట్‌ కలర్‌ పెన్నులను అధికారులే...

Pages

Don't Miss