AP News

Tuesday, October 30, 2018 - 22:04

 కడప: ప్రొద్దుటూరులో ధర్మపోరాట సభలో కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మీరు ముందుకొస్తారా? లేదా? న్యాయానికి కట్టుబడి ఉన్నారా? లేదా? బాధ్యత తీసుకుంటారా? లేదా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. రాయలసీమలో కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని...

Tuesday, October 30, 2018 - 21:50

విజయవాడ: వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై కత్తితో దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు శ్రీనివాసరావు ఫోన్ కాల్స్ లిస్టును పరిశీలించిన పోలీసులు అతని ఫోన్ నుంచి ఓ మహిళకు అధికంగా కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. దీంతో ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆ మహిళను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకుని...

Tuesday, October 30, 2018 - 20:15

విజయవాడ: తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ పోరాటయాత్ర షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 2వ తేదీ నుంచి తుని పట్టణం నుంచి పవన్ పోరాటయాత్ర ప్రారంభమవుతుంది. ఆ రోజు సాయంత్రం తుని రైల్వేస్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం స్థానిక నాయకులతో సమావేశం అవుతారు. తదుపరి...

Tuesday, October 30, 2018 - 18:47

విశాఖ: వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై కత్తి దాడి చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పోలీసులు అతడిని కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు శ్రీనివాసరావును భూజాలపై మోసుకెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉదయం నుంచి శ్రీనివాసరావు ఆహారం తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే,...

Tuesday, October 30, 2018 - 18:17

హైదరాబాద్: జనసేన పార్టీకి జనసేనాని మాతృమూర్తి విరాళం ఇచ్చారు. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ తల్లి కొణెదల అంజనాదేవి 4 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. జనసేన కార్యాలయానికి వెళ్లిన అంజనాదేవి.. పార్టీ చీఫ్, తన కుమారుడు పవన్‌ను కలిసారు. తన తరఫున 4లక్షల రూపాయల చెక్కుని పవన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా తన తల్లి...

Tuesday, October 30, 2018 - 12:52

విశాఖ : ఏపీలో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిన్న గుంటూరులో దాడులు చేసిన ఐటీ అధికారులు...ఇవాళ విశాఖలోని పేర గ్రూపు సంస్థలో సోదాలు జరుపుతున్నారు. పేరం గ్రూపు అధినేత హరిబాబు.. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు బంధువు. 

ఐటీ దాడులతో రియల్ ఎస్టేట్ సంస్థల్లో, కన్‌స్ట్రక్చన్స్ కంపెనీల్లో...

Tuesday, October 30, 2018 - 09:34

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఈసీ దూరం పెట్టింది. తెలంగాణ ఎన్నికల బందోబస్తుకు ఏపీ పోలీసులను వినియోగించకూడదని నిర్ణయించింది. ఏపీ ఇంటిలిజెన్స్ పోలీసులు.. తెలంగాణ ఓటర్లను ప్రలోభ  పెడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రచారంలో అభ్యర్ధుల తీరుతెన్నులను పరిశీలిస్తోంది. ఎప్పటికప్పుడు ఖర్చులను...

Tuesday, October 30, 2018 - 08:39

గుంటూరు: గుంటూరుజిల్లా నరసరావుపేట, వరవకుంటలోని ఓటింబర్ డిపోలో మంగళవారం తెల్లవారుఝూమున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. డిపోలోని టేకు దుంగలు అగ్నికి ఆహుతయ్యాయి. 4 ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకురావటానకి ప్రయత్నిస్తున్నాయి. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సిఉంది. 

 

Tuesday, October 30, 2018 - 07:53

కడప : ప్రొద్దుటూరులో ఇవాళ టీడీపీ ధర్మపోరాట సభ తలపెట్టారు. ఈనేపథ్యంలో ముందస్తు అరెస్టులకు తెర తీశారు. ధర్మపోరాట సభలో సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. కడప జిల్లాలో ఉక్కు ఏర్పాటుకు ముఖ్యమంత్రి తీరుకు నిరసనగా ఆయన్ను ఖచ్చితంగా అడ్డుకుంటామని అఖిలపక్ష నేతలు ప్రకటించడంతోసీపీఐ, జనసేన నేతలను పోలీసులు అదుపులోకి...

Monday, October 29, 2018 - 22:04

హైదరాబాద్: జగన్‌ భద్రత విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్న వైసీపీ.. ఆయన రక్షణపై కసరత్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వం భద్రత పెంచాలంటూ డిమాండ్ చేస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పాదయాత్రను జగన్ మొదలుపెట్టనుండడంతో.. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు... జగన్‌పై దాడి కేసులో సీబీఐ లేదా థర్డ్‌ పార్టీతో...

Monday, October 29, 2018 - 15:01

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజమండ్రి రూరల్‌లోని కొంతమూరు మండలం జంగాల కాలనీలో సోమవారం తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 70కి పైగా పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా బాధితులంతా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. స్థానికుల సమాచారంతో...

Monday, October 29, 2018 - 13:42

పాడేరు: విశాఖ మన్యంలో మావోయిస్టులు మళ్లీ  తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించారు. జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం ఆర్‌వీ నగర్‌ వద్ద  వెలసిన మావోల పోస్టర్లు, బ్యానర్లు  కలకలం రేపాయి. సోమవారం తెల్లవారుజామున వీటిని మావోలు పడేసినట్లు తెలుస్తోంది. "చట్టాల ప్రకారం అడవిపై హక్కు ఆదివాసీలదే అయినప్పటికీ అంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ది...

Monday, October 29, 2018 - 13:29

ఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజనపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌తో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. డిసెంబరు 15 కల్లా అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణం పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం గతవారం అఫిడవిట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌...

Monday, October 29, 2018 - 12:48

విజయవాడ : ఏపీ శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, టీడీపీ ఎమ్మెల్సీ ప్రతిభా భారతి ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. గత రెండు రో్జుల క్రితం ఆమె తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రతిభా భారతి తండ్రి అనారోగ్యంతో విశాఖలోని పినాకినీ ఆసుపత్రిలో చేరారు. దీనితో ఆయన్ను...

Monday, October 29, 2018 - 11:40

ప్రకాశం : వేరే కులస్తులను ప్రేమించడం నేరమా ? వివాహం చేసుకోవద్దా ? ప్రేమించినా ? వివాహం చేసుకున్నా చంపేస్తారా ? గత కొన్ని రోజులుగా ఇలాంటి హత్యలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబ పరువు పొతుందని స్వయంగా కుటుంబసభ్యులే అత్యంత దుర్మార్గానికి తెగబడుతున్నారు. కనిపెంచిన వారిపైనే దాడులు.....

Monday, October 29, 2018 - 11:22

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ దాడులు ఆగడం లేదు. తాము కేంద్రం నుండి బయటకు రాగానే తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని..సీబీఐ, ఈడీలను రాష్ట్రానికి పంపిస్తూ దాడులు చేయిస్తోందని ప్రభుత్వం పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వైసీపీ అధినేత జగన్‌పై దాడి అనంతరం మరింత రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై ఢిల్లీ...

Monday, October 29, 2018 - 11:00

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయాన్ని కేటీఆర్ వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి 100 కోట్లు ప్రకటించాలని మంత్రివర్గం సమ్మతితో కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. శంకుస్థాపన సమయంలో అమరావతికి  ప్రకటించాలని భావించారని...కానీ, ప్రధాని మోడీ...

Monday, October 29, 2018 - 10:58

ముంబై: సెక్యూరిటీ సిబ్బంది చొరవతో హార్ట్ఎటాక్‌తో కుప్పకూలిన ఓ ప్రయాణీకుడు ముంబై ఎయిర్‌పోర్టులో బతికి బయటపడ్డాడు. ఆంద్రప్రదేశ్‌కు చెందిన గుబ్బల సత్యనారాయణ ముంబై నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు శుక్రవారం ఉదయం వచ్చాడు. ఉన్నట్టుండి టెర్మినల్ 2 లో హార్ట్ ఎటాక్ రావడంతో కుప్పకూలిపోయాడు. ...

Monday, October 29, 2018 - 10:51

విజయవాడ : ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా ధర్మపోరాట సభలతో నిరసన తెలుపుతోన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. దీనిని దేశమంతటికీ విస్తరించాలని నిర్ణయించారు. తెలుగువారి ప్రాబల్య ప్రాంతాల్లో, భావసారూప్య పక్షాలున్న రాష్ట్రాల్లో ఈ పోరాట సభలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్వహించారు. ...

Monday, October 29, 2018 - 10:44

విజయవాడ : ఏపీలో ఆపరేషన్ గరుడ వాస్తవమేనా? అంటే అవుననే అంటోంది తెలుగుదేశం పార్టీ. తాము ఆరోపణలు చేయడం లేదు వాస్తవాలే చెబుతున్నామని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. ఆపరేషన్ గరుడకు బీజేపీ నేత రాం మాధవ్ చేసిన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయంటున్నారు. ఇంతకీ రాం మాధవ్ ఏమన్నారు?ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది. బీజేపి,...

Monday, October 29, 2018 - 08:16

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అంతమొందించేందుకు పెద్ద కుట్రే జరిగిందని ఎంఐఎం అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆయన ఆదివారం లోటస్ పాండ్ లో జగన్ మోహన్ రెడ్డిని కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఒవైసీ, విశాఖ విమానాశ్రయంలో...

Sunday, October 28, 2018 - 22:03

కర్నూలు : జిల్లాలో స్వైన్‌ ఫ్లూ విజృంభిస్తోంది. ఇవాళ ప్రభుత్వ వైద్యశాలలో ముగ్గురు స్వైన్ ఫ్లూకు బలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులుండగా.. వారిలో నాలుగు నెలల చిన్నారి మృతి చెందడం విషాదాన్ని నింపింది. చిన్నారి తల్లికీ స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆస్పత్రిలో పదిమంది ఇంకా చికిత్స పొందుతుండగా.. వారిలో ఇద్దరి...

Sunday, October 28, 2018 - 22:00

విజయవాడ: వైజాగ్ ఎయిర్‌పోర్టులో వైసీపీ చీఫ్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరుగుతోంది. జగన్‌ను చంపేందుకు టీడీపీ కుట్రపన్నింది అని వైసీపీ.. సానుభూతి కోసం జగన్ డ్రామా ఆడారని టీడీపీ.. ఇలా...

Sunday, October 28, 2018 - 21:28

విజయవాడ: ఏపీలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహలు రచిస్తున్నాయి. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ, జనసేన.. ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. మరోసారి అధికారం కైవసం చేసుకోవాలని టీడీపీ పట్టుదలగా ఉంటే.. ఎట్టిపరిస్థితుల్లో అధికారం దక్కించుకోవాలని జగన్...

Sunday, October 28, 2018 - 21:02

విశాఖ : విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారుల తనిఖీలు చేశారు. కడుపులో బంగారం పెట్టుకుని ప్రయాణించిన నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్లను కేజీహెచ్‌కు తరలించారు.. ఆపరేషన్‌ చేసి బంగారాన్ని బయటకు తీసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. 

 

Sunday, October 28, 2018 - 20:40

గుంటూరు : బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణపై ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఇంటి పైన బీజేపీ జెండా ఇంట్లో వైసీపీ జెండా పెట్టుకుని కన్నా లక్ష్మినారాయణ తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. ఈమేరకు అమరావతిలో బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోనే కన్నాకు మించిన ధనవంతులు లేరని,...

Sunday, October 28, 2018 - 20:13

నెల్లూరు : జిల్లాలోని రంగనాయులపేటలో విషాదం నెలకొంది. భర్త మృతి చెందాడని మనస్థాపంతో భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాలిక మృతి చెందింది. వివాహిత, మరో బాలిక పరిస్థితి విషమంగా ఉంది.

రంగనాయులపేటలోని గొల్లల వీధిలో కొండల్ రావు, సుజాత దంపతులు. తమ ఇద్దరు పిల్లలు విష్ణువర్ధిని, దివ్యలతో కలిసి గత...

Pages

Don't Miss