AP News

Friday, August 31, 2018 - 17:14

నెల్లూరు : పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. జీవో నెం 279 రద్దు చేయాలని 18 రోజుల నుంచి పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా చెత్తాచెదారం, చెత్తకుప్పలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ప్రజలు రోగాల బారిన పడి ఆస్పత్రి పాలవుతున్నారు. దీంతో ప్రజలు తీవ్రంగా అనారోగ్యాలబారిన పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతుఆన్నరు....

Friday, August 31, 2018 - 16:57

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువై వున్న కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో శ్రావణమాసం సందర్భంగా శ్రావణ శోభ సంతరించుకుంది. మహిళలంతా వరలక్ష్మీ నోముతో కళకళలాడుతో కనిపించారు. దీంతో ఇంద్రకీలాద్రి శ్రావణమాస శోభను సంతరించుకుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. వందలాది మహిళలు తరలివచ్చి సామూహిక వ్రతాలు, ప్రత్యేక పూజలు...

Friday, August 31, 2018 - 16:53

ఢిల్లీ : ఏపీ హైకోర్టు విభజనపై కేంద్రం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇప్పుడున్న హైకోర్టు ఏపీకి ఇచ్చేందుకు సిద్దమని తెలంగాణ తెలిపింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. 

Friday, August 31, 2018 - 16:49

శ్రీకాకుళం : మూడు దశాబ్దాల సమస్యపై అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. శ్రీకాకుళం జిల్లాలో ఆందోళన రేకెత్తిస్తున్న మూత్రపిండాల వ్యాధి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నారు ఉన్నతాధికారులు. వైద్యసేవలు, పెన్షన్లు, ఉచిత మందులు నేరుగా అందించాలని నిర్ణయించారు.

గత ముప్పై ఏళ్ళుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో...

Friday, August 31, 2018 - 16:27

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నార్కెట్ పల్లిలోని కామినేని ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరికృష్ణను ఆసుపత్రికి తరలించిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది వైద్యం చేయకుండా గాయలపాలైన హరికృష్ణ పరిస్థితిని అర్థం చేసుకోకుండా..వైద్యం చేయకుండా సెల్ఫీలు తీసుకున్న వైనం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు...

Friday, August 31, 2018 - 15:48

విజయవాడ : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వందరోజుల పాలన పూర్తయిన సందర్భంగా సీఎం కుటుంబసభ్యులతో కలిసి విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు కుమారస్వామికి ఘన స్వాగతం పలికారు. కుమారస్వామిని సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం పార్టీతో తమది సోదర బంధం అన్నారు కుమారస్వామి. ఎన్డీఏ...

Friday, August 31, 2018 - 15:47

విజయవాడ : పెద్ద నోట్ల రద్దు ఒక చారిత్రక వైఫల్యమని విమర్శించారు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి. నోట్ల రద్దుతో దేశంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. ఇప్పటికీ రద్దు భారం ప్రజలు మోస్తున్నారని తెలిపారు. ఒక్క వ్యక్తిని హత్య చేస్తే యావజ్జీవ శిక్ష లేదా ఉరి వేస్తారని అలాంటిది 150 మంది చనిపోవడానికి కారణమైన ప్రధాని తన పదవికి రాజీనామా చేయాలని తులసి...

Friday, August 31, 2018 - 15:33

తిరుపతి : క్యాన్స్ రోగులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. క్యాన్సర ట్రీట్‌మెంట్‌కు అవసరమైన ఆధునాతనమైన సౌకర్యాలు శ్రీ వెంకటేశ్వర క్యాన్సర్‌ వైద్య, విజ్ఞాన సంస్థలో రాబోతున్నాయని తెలిపారు సీఎం చంద్రబాబు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర క్యాన్సర్‌ వైద్య, విజ్ఞాన సంస్థ నిర్మాణానికి చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో టాటా గ్రూపు సంస్థల...

Friday, August 31, 2018 - 13:51

చిత్తూరు : ఏపీ సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ క్యాన్సర్‌ అండ్‌ కేర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ రతన్‌ టాటా పాల్గొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Friday, August 31, 2018 - 11:32

హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో వెండి పతకం సాధించిన విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రాష్ట్రానికి చేరుకున్నారు. జ్యోతి సురేఖకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఆసియా క్రీడల్లో మరోసారి అవకాశం వస్తే స్వర్ణ పతాన్ని సాధిస్తానని జ్యోతి తెలిపారు. వచ్చే నెలలో టర్కీలో జరిగబోయే క్రీడల్లో పాల్గొనున్నట్లు తెలిపారు. తనకు ప్రభుత్వం...

Friday, August 31, 2018 - 11:11

విజయవాడ : కర్నాటక సీఎం కుమార స్వామి విజయవాడకు వచ్చారు. కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి కుమార స్వామి కుటుంబసమేతంగా విజయవాడకు వచ్చారు. గేట్ వై హోటల్ బస చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి, ఎమ్మెల్యే ఆంజనేయులు కుమార స్వామిని కలిశారు. ఏపీ, కర్నాటక రాష్ట్రాలు కేంద్రంపై అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. మర్యాదపూర్వకంగా...

Friday, August 31, 2018 - 09:30

కృష్ణా : జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా నివాసముంటున్న వృద్ధులే టార్గెట్‌గా దోపిడీలకు పాల్పడుతున్నారు. దీంతో వృద్ధులు, ఒంటరి మహిళలు రాత్రి ఇంట్లో ఉండాలంటేనే వణికిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

దొంగలు పగలంతా సూదులు, ఇతరత్రా వస్తువులు...

Friday, August 31, 2018 - 09:25

కర్నూలు : నేటి నుండి మూడు రోజుల పాటు మంత్రాలయంలో ఆర్ఎస్ఎస్ అఖిల భారత మహాసభలు జరుగనున్నాయి. సమావేశంలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లు మంత్రాలయానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ, జాతీయ నేతలు పాల్గొననున్నారు. సమావేశం జరిగే ప్రాంతం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని...

Friday, August 31, 2018 - 09:21

పశ్చిమగోదావరి : జిల్లాలో ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన తంగెళ్లమూడి కబాడిగూడెంలో చోటు చేసుకుంది. సతీష్ అనే వ్యక్తిపై గురువారం రాత్రి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. నలుగురు దాడి చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. తీవ్రగాయాలపాలైన సతీష్ ను ఏలూరు...

Friday, August 31, 2018 - 06:29

విశాఖపట్టణం : భవిష్యత్తులో దక్షిణాదికి తుఫానుల ముప్పు తప్పదా..? అంటే.. జరుగుతున్న పరిణామాలు.. నిపుణుల మాటలను బట్టి ఇది నిజమే అనిపిస్తోంది. దక్షిణాదిని తుఫానులు ముంచెత్తుతాయంటున్నారు వాతావరణ శాస్ర్తవేత్తలు. బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానుల సంఖ్య తగ్గినప్పటికీ తీవ్రత మాత్రం గతంలోకంటే చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అక్టోబర్, నవంబర్‌లో ఏదో ఒక తుపాను...

Thursday, August 30, 2018 - 19:26

తిరుమల : మంత్రి అఖిల ప్రియ దంపతులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో నిన్న వివాహం చేసుకున్నఅఖిలప్రియ.. రాత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఉదయం స్వామి వారిని దర్శించుకున్నారు. తమ ఇంట్లో శుభకార్యం జరిగితే.. నడచి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని అఖిలప్రియ అన్నారు.

Thursday, August 30, 2018 - 19:24

శ్రీకాకుళం : జిల్లాలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో వామపక్షనేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వామపక్షనేతలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప ప్రజా సమస్యలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు స్పందించడం లేదని వామపక్ష నేతలు ఆరోపించారు. ప్రభుత్వ, ప్రతిపక్ష నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాష్ట్రాభివృద్ధి...

Thursday, August 30, 2018 - 17:10

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన పెద్దమనసుని చాటుకుంది. హరికృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించి గౌరవించింది. ఈ నేపథ్యంలో నందమూరి హరికృష్ణ గురించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హరికృష్ణ అంత్యక్రియలు జరుగుతున్న మహా ప్రస్థానంలోనే ఆయన స్మారకాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా 450 గజాల స్థలాన్ని...

Thursday, August 30, 2018 - 16:15

హైదరాబాద్ : మెహిదీపట్నంలోని నివాసం నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానానికి హరికృష్ణ అంతిమయాత్ర జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం శ్మశానవాటికకు చేరుకుంది. ఈ యాత్రలో ప్రముఖులు పాల్గొన్నారు. అంతిమయాత్ర వాహనంలో హరి భౌతికకాయం పక్కనే ముఖ్యమంత్రి చంద్రబాబు నిల్చున్నారు. మరోవైపు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిలబడ్డారు. టీడీపీ నేతలతో కలసి నారా లోకేష్...

Thursday, August 30, 2018 - 15:27

హైదరాబాద్ : మెహిదీపట్నంలోని నివాసం నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానానికి హరికృష్ణ అంతిమయాత్ర మరికాసేపట్లో మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను ఘనంగా చేసింది. దాదాపు 200ల మంది పోలీసులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, సినీ అభిమానులు వంటి వేలాదిమంది తుది వీడ్కోలు పలుకేందుకు...

Thursday, August 30, 2018 - 15:03

హైదరాబాద్ : దివంగత హరికృష్ణ అంతిమయాత్ర మెహిదీపట్నంలోని నివాసం వద్ద నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా అంతిమయాత్ర కొనసాగుతున్న రోడ్డు జనసముంద్రంగా మారింది. అశేషమైన అభిమానులతో రోడ్డు నిండిపోయాయి. హరికృష్ణ చివరి చూపు కోసం భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా హరికృష్ణ అమర్ రహే... జోహార్ హరికృష్ణ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. సాయంత్రం...

Thursday, August 30, 2018 - 11:27

హైదరాబాద్ : సినీ నటుడు, టిడిపి నేత హరికృష్ణ పార్థీవ దేహానికి సినీ, రాజకీయ రంగ ప్రముఖులు నివాళులర్పించారు. ఏపీ మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హైదరాబాద్ కు వస్తున్నారు. టిడిపి మంత్రులు సోమిరెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చింతమనేని, ఎంపీలు సీఎం రమేష్, టి.జి.వెంకటేశ్ లు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆయన ఎంతో మంచి వ్యక్తి అని,...

Thursday, August 30, 2018 - 11:16

హైదరాబాద్ : చైతన్య రథాన్ని నడిపించిన నాయకుడు హరికృష్ణ అని, కానీ దురదృష్టవశాత్తు డ్రైవింగ్ లో చనిపోవడం బాధాకరమని ఏపీ మంత్రి హరికృష్ణ పేర్కొన్నారు. ఎంపీగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, టిడిపి నేతగా ఎనలేని కృషి చేశారన్నారు. కేబినెట్ లో ఇద్దరం సహచర మిత్రులుగా ఉండేవారని, కానీ దురదృష్టవశాత్తు డ్రైవింగ్ లో చనిపోవడం బాధాకరమన్నారు. ఎంపీగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా,...

Thursday, August 30, 2018 - 09:12

 

చిత్తూరు : ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాకు ప్రభుత్వం..పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమ రవాణా ఆగడం లేదు. తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్నారు. పలు సందర్భాల్లో పోలీసులపైకి దాడులు చేస్తున్నారు. తాజాగా మరో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాకు చెక్ పెట్టారు. తిరుపతి - చెన్నై రహదారిపై ఎర్రచందనం దుంగలను...

Thursday, August 30, 2018 - 08:36

కర్నూలు : ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ వివాహ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆళ్లగడ్డలోని భూమా శోభనాగిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఈ వివాహం బుధవారం జరిగింది. నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి లు అఖిల ప్రియ వివాహాన్ని సాంప్రదాయ బద్ధంగా జరిపించారు. అఖిల ప్రియ - భార్గవ్ రామ్ లకు దేవస్థాన పురోహితుడు అహోబిలేశుడు ఆశ్వీరాదాలను...

Thursday, August 30, 2018 - 06:41

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు, మూడు నెలల్లో ఎలక్ట్రిక్‌ బస్సులు పరుగులు తీయనున్నాయి. పైలట్‌ ప్రాజెక్ట్‌గా మొదట విజయవాడలో రెండు బస్సులు నడపనున్నారు. విశాఖ సీఐఐ పార్టనర్‌ సమ్మిట్‌లో ఏపీఎస్‌ ఆర్టీసీ, ఏపీ ట్రాన్స్‌కో, నెడ్‌క్యాప్‌లతో బెలారస్‌కు చెందిన యాక్సిస్‌ మొబలిటీ సంస్థ ఎంవోయూ కుదుర్చుకున్న నేపథ్యంలో.. అమరావతి సచివాలయంలో అధికారులను మొబలిటీ సంస్థ...

Thursday, August 30, 2018 - 06:40

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐక్యరాజ్యసమితి నుంచి ఆహ్వానం అందింది. వచ్చే నెల 24న సదస్సులో కీలకోపన్యాసం చేయాలంటూ ఆహ్వానం పంపారు. ఫైనాన్సింగ్‌ సస్టైనబుల్‌ అగ్రికల్చర్‌.. గ్లోబల్‌ ఛాలెంజెస్‌ అండ్‌ ఆపర్చునిటీస్‌ అనే అంశంపై న్యూయార్క్‌లో జరిగే సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. జీరో బడ్జెట్‌, ప్రకృతి సేద్యంలో ఏపీ ముందుకెళ్తున్న యూఎన్‌...

Pages

Don't Miss