AP News

Sunday, November 11, 2018 - 18:09

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వంపై వైఎస్ జగన్ తల్లి విజయమ్మ చేసిన విమర్శలను ఏపీ మంత్రి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఖండించారు. విచారణకు జగనే సహకరించడం లేదన్నారు. పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చి ఆ తరువాత పాదయాత్రకు వెళ్లాలని తెలిపారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జగన్‌కు పాదయాత్రలో ఎవరు రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. 

Sunday, November 11, 2018 - 15:45

విశాఖపట్నం: మరో తుఫాను ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను కొనసాగుతోంది. ఈ తుఫానుకు శ్రీలంక సూచించిన ''గజ''గా నామకరణం చేశారు. పోర్ట్‌బ్లెయిర్‌కు పశ్చిమ వాయువ్య దిశగా 400 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 1050 కిలోమీటర్ల దూరంలో, తమిళనాడుకు 900 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రకృతమైంది...

Sunday, November 11, 2018 - 13:35

అమరావతి: ఆంద్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ ఆదివారం జరిగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలోని ప్రజావేదికలో వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.  కొత్త మంత్రులుగా ఎన్ఎమ్డీ ఫరూక్, కిడారి శ్రావణ్ కుమార్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఫరూక్ తెలుగులో ప్రమాణ...

Sunday, November 11, 2018 - 10:21

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం రాజులకండ్రిగలో సిలిండర్ పేలి ఒకే కుటుబానికి చెందిన నలుగురు మరణించారు. శనివారం అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి సిలిండర్ పేలిందని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. మరణించినవారు శ్రీనివాసులు రెడ్డి, భార్య బుజ్జమ్మ, పిల్లలు భవ్య,నితిన్ గా గుర్తించారు, మృతదేహాలు...

Sunday, November 11, 2018 - 09:02

హైదరాబాద్: గతనెల 25న విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంలో గాయపడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రజాసంకల్పయాత్రను సోమవారం నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకున్న ఆయన ఆదివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుని,...

Saturday, November 10, 2018 - 22:11

గుంటూరు : కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఐటీ రైడ్స్ జరుపుతూ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకుంటూ... రాజకీయ లబ్ధి పొందే పరిస్థితికి వచ్చారని మండిపడ్డారు. దేశాన్ని కాపాడుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. ఎన్డీఏ హయాంలో నోట్లరద్దుతో ఏటిఎంలు ఖాళీ అయ్యాయని విమర్శించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు...

Saturday, November 10, 2018 - 21:30

గుంటూరు : ఏపీ మంత్రివర్గ విస్తరణకు సర్వం సిద్ధమైంది. రేపు ఏపీ కేబినెట్ విస్తరణ జరుగనుంది. మంత్రుల శాఖల్లోనూ స్వల్ప మార్పులు చేయనున్నారు. ముస్లీం మైనారిటీ నుంచి ఫరూక్, ఎస్టీ వర్గం నుంచి కిడారి శ్రవణ్ కుమార్‌లకు చంద్రబాబు కేబినెట్‌లో చోటు కల్పిస్తున్నారు. రేపు ఉదయం 11.45 గంటలకు ఉండవల్లిలో కొత్త మంత్రుల...

Saturday, November 10, 2018 - 21:04

విజయవాడ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రానున్నారా? ధర్మపోరాట దీక్షలో ఆయన పాల్గొంటారా? చంద్రబాబు ఇంట్లో విందుకు హాజరవుతారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 23న ఏపీ రాజధాని అమరావతికి రాహుల్‌గాంధీ రానున్నారని, సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో ఏర్పాటు చేయనున్న...

Saturday, November 10, 2018 - 20:27

గుంటూరు : దేశ రాజకీయాల్లో కొత్త అధ్యయనం మొదలైందని కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తొలిసారిగా కూటమి ప్రారంభమైందని తెలిపారు. ఈ కూటమిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబుతో చర్చలు జరుపుతామని చెప్పారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలే కాకుండే ఇతర పార్టీలను స్వాగతిస్తామన్నారు. యూపీఏలో ఉన్న...

Saturday, November 10, 2018 - 19:50

విజయవాడ: దేశం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్‌తో చేతులు కలిపామని ఏపీ సీఎం, టీడీజీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ సిద్ధాంతాలతో విభేదించిన టీడీపీ... ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఆ పార్టీతో చేతులు కలిపిందని వివరించారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షం...

Saturday, November 10, 2018 - 17:30

విజయవాడ: కత్తి దాడి గాయం నుంచి కోలుకున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ప్రజల మధ్యకు రానున్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు.  ఈ నెల 12 నుంచి ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటానని జగన్ వెల్లడించారు. ఈ మేరకు ‘12వ తేదీ నుంచి మీ మధ్యకు...

Saturday, November 10, 2018 - 16:54

కడప: కాంగ్రెస్-టీడీపీ కలయికను నిరసిస్తూ ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కడప జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య వైసీపీలో చేరుతున్నారు. ఈనెల 13న ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఎల్లుండి నుంచి వైసీపీ అధినేత జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర విశాఖ జిల్లాలో తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల...

Saturday, November 10, 2018 - 15:07

విజయవాడ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానం నచ్చడంతోనే తాను జనసేనలో చేరానని కాంగ్రెస్ మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తెలిపారు. విజయవాడలో జనసేన అధినేత పవన్ సమక్షంలో బాలరాజు జనసేన కండువా కప్పుకున్నారు. పవన్ ఏ లక్ష్యంతో పనిచేయాలనుకున్నారో అందుకు తాను ముందుంటానన్నారు. ప్రజల కోసం పవన్ చేస్తున్న ఆలోచనా...

Saturday, November 10, 2018 - 14:16

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల సముదాయం "హ్యాపీనెస్ట్"కు మంచి స్పందన లభించింది. ఫ్లాట్ల బుకింగ్ కోసం ఆన్ లైన్లో  నమోదు చేసుకునేందుకు, కేవలం  300 ప్లాట్ల కోసం లక్ష మంది దాకా పోటీ పడ్డారు.  బుకింగ్ ప్రాంరంభించగానే ప్రపంచ వ్యాప్తంగా లక్ష మందికి పైగా పోటీ పడటంతో సర్వర్లు మొరాయించాయి. చాలామందికి...

Saturday, November 10, 2018 - 12:49

నెల్లూరు : రోడ్ల వెంట తిరిగే పందులు రోగాలకు కారణాలుగా మారతాయని తెలుసు. కానీ ఆసుపత్రిలో ఓ పంది పెట్టిన చిచ్చు పోలీసు కేసుల వరకూ వెళ్లింది. ఇదేమిటి అనుకుంటున్నారా? నిజమేనండీ బాబూ..

...

Saturday, November 10, 2018 - 12:19

కడప : సీనియర్ నేత సి.రామచంద్రయ్య రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ జంపింగ్ కు సిద్ధపడ్డారు. పార్టీలు మారటంలో ఆయనదిట్ట. ఈ క్రమంలో వైసీపీలో చేరనున్నారు. 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించిన రామచంద్రయ్య 1985లో కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మంత్రిగా పనిచేశారు. 
కాంగ్రెస్ పార్టీ మాజీ నేత సి.రామచంద్రయ్య వైసీపీ తీర్థం...

Saturday, November 10, 2018 - 11:51

అమరావతి: 2019ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా, దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జేడీఎస్,డీఎంకే  అధ్యక్షులతో సమావేశం అయ్యారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజస్ధాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో అమరావతిలో భేటీ...

Saturday, November 10, 2018 - 11:50

విజయనగరం : నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకున్న ఓ మోసగాడు కోట్ల డబ్బుతో ఉడాయించాడు. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటు యువకులను మోసం చేసిన ఘనానా గంగుల ఉదంతం బైటపడింది. నిరుద్యోగుల నుండి కోట్ల రూపాయలు వసూలు చేసిన కేటుగాల్లు మోసం చేసిన పారిపోయారు.  ఒక్కో నిరుద్యోగి నుండి రూ.10 నుండి 17 లక్షలు వసూలు చేసిన ఘరానా మోసంలో ఓ మహిళా పోలిస్...

Saturday, November 10, 2018 - 07:31

కర్నూలు : మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. మరో ప్రాణం గాల్లో కలిసిపోయింది. మనిషిని మనిషి చంపుకునే అనాగరికత మరోసారి పడగ విప్పి బుసలు కొట్టింది. జిల్లాలలోని దేవన కొండ మండలం కె.వెంకటాపురంలో టీడీపీ నాయకుడిని దారుణంగా హత్య చేశారు. వేటకొడవళ్లలో వెంటపడిన నాగరిక మానవులు సోమేశ్వర గౌడ్ ను దారుణంగా హత్య చేశారు. దేవరకొండ నుండి తన...

Friday, November 9, 2018 - 21:31

విశాఖ: ఏపీ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి పంపించారు. బాలరాజు శనివారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే మరో కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్...

Friday, November 9, 2018 - 21:09

విజయవాడ: కృష్ణా జిల్లా పెడన వైసీసీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, ఉప్పాల రాంప్రసాద్ వర్గాలు బాహాబాహీకి దిగాయి. బస్టాండు వద్ద నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. ఈ ఘటనలో జోగి రమేష్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కారు అద్దాలు పగలగొట్టిన సమయంలో జోగి రమేష్ కారులో కాకుండా, బైక్ పై వెళ్తుండటంతో...

Friday, November 9, 2018 - 18:53

విజయవాడ: కేబినెట్‌ను విస్తరించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయనున్నారు. మైనార్టీ, ఎస్టీ అభ్యర్థులతో ఈ రెండు స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న ఫరూక్‌కు, మావోయిస్టుల చేతిలో హతమైన అరకు ఎమ్మెల్యే...

Friday, November 9, 2018 - 14:05

విజయవాడ : కార్తీక మాసం వచ్చిందంటే చాలు అతివలంతా చేతులు నిండుగా గాజులు వేసుకుని గాజుల గౌరమ్మ అవతారంలో వెలుగిపోయే దుర్గమ్మను కొలుచుకుంటారు. దీపావళి వెళ్లిన మరునాడు పాడ్యమి  నుండే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీకమాసం సందర్భంగా దుర్గమ్మకు ప్రత్యేక...

Friday, November 9, 2018 - 12:27

పశ్చిమగోదావరి : స్వతంత్ర్య భారతదేశానికి అతి పెద్ద ప్రజాస్వామ్యదేశం అనే పేరు. కానీ ఇక్కడ అన్నింటికి ఆంక్షలే. ముఖ్యంగా మహిళల విషయంలో ఈ ఆంక్షలనేవి మరింత జటిలంగా వుంటాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రాంతంలోని మహిళలకు ఆ ఊరి పెద్దలు ఓ వింత ఆదేశాలను జారీ చేశారు. అదేమంటే ఆ ఊరిలోని మహిళలు నైటీ వేసుకుంటే జరిమానా కట్టాలట. ఈ వింత ఆంక్షలు...

Friday, November 9, 2018 - 07:39

హైదరాబాద్ : మాజీ ఎంపీ లగడపాటి ఫైర్ బ్రాండ్ గా పేరు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్లమెంట్ లో పెప్పర్ స్ర్పే తో పెను సంచలనం సృష్టించిన తరువాత రాష్ట్ర విభజన అనంతరం పూర్తిగా రాజకీయాలకు దూరంగా వున్నారు. అప్పటి నుండి తిరిగి గత కొద్ది రోజుల క్రితం తెలంగాణలో పోటీ చేస్తానంటు మరోసారి వార్తల్లోకి వచ్చిన లగడపాటి మరోసారి వార్తల్లోకి...

Thursday, November 8, 2018 - 19:21

బెంగుళూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం బెంగుళూరులో జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ సీఎం దేవెగౌడతో, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ సమావేశం అయ్యారు. దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో భాగంగా చంద్రబాబునాయుడు వీరిని కలిశారు. సుమారు 40 నిమిషాలపాటు సమావేశమైన అనంతరం...

Thursday, November 8, 2018 - 16:37

విజయవాడ: విజయవాడలో టీడీపీ,జనసేన పార్టీల మధ్య ఫ్లెక్సీల వివాదం ముదురుతోంది. గతంలో జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై టీడీపీ నాయకుడు కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి  కౌంటర్ గా  జనసేనపార్టీ అధికార ప్రతినిధి మండలి రాజేష్ పేరుతో తెలుగుదేశం పార్టీని ఘాటుగా విమర్శిస్తూ  నగరంలో  బుధవారం ఫ్లెక్సీలు...

Pages

Don't Miss