AP News

Monday, October 23, 2017 - 15:24
Monday, October 23, 2017 - 15:08

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తారా ? గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. పాదయాత్ర చేయాలని సంకల్పించిన దృష్ట్యా తనకు హాజరు మినహాయింపు ఇవ్వాలని జగన్ వేసిన పిటిషన్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించడంతో ఆయన పాదయాత్రపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి.

నవంబర్ 2 నుండి మే 2 వరకు పాదయాత్ర చేయాలని జగన్ యోచించారు. తాను అక్టోబర్ లోనే...

Monday, October 23, 2017 - 13:31

అనంతపురం : జిల్లా ముదిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ మేళాపురంలో వైసీపీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. సమీపంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ నేతలు... నిరసన తెలుపుతున్న వైసీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే శివాలెత్తిపోయారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Monday, October 23, 2017 - 13:29

కృష్ణా : వైసీపీ నుండి వలస వెళ్లే వారితో పార్టీకి ఎలాంటి నష్టం లేదని వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. స్వార్థంతోనే కొందరు నేతలు వైసీపీని వీడుతున్నారని వారికి ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. తాను బేషరతుగా వైసీపీలోకి వచ్చానని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Monday, October 23, 2017 - 13:16

గుంటూరు : ఏపీ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ప్రోత్సాహం వల్లే నేను, రేవంత్ రెడ్డి ఈస్థాయికి ఎదిగామని, 6 నెలలుగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై పూర్తి వివరాలున్నాయని ఆయన అన్నారు. రేవంత్ చంద్రబాబును కలిశాఖ ఆ వివరాలపై స్పందస్తానాని, రేవంత్ రెడ్డి కి వ్యక్తిగత అజెండాలే ప్రధానమని ఆయన ఆరోపించారు. రేవంత్ జైలుకు...

Monday, October 23, 2017 - 11:55

అనంతపురం : జిల్లా కరవుకు శాశ్వత చిరునామా. ఈ జిల్లాలో ఎప్పుడూ కరువు విలయతాండవం చేస్తూనే ఉంటుంది. వర్షాలు పడక, సాగునీరు అందక పంటలు పండవు. తాగడానికి నీరు దొరకక అనేక పల్లెలు అలమటిస్తుంటాయి. కానీ వీటన్నిటికి మొన్న కురిసిన కుండపోత వర్షం చెక్‌పెట్టింది. సాగు,తాగునీటి కష్టాలకు పరిష్కారం చూపింది. ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలతో జిల్లాలో ఎక్కడ చూసినా నీరే...

Monday, October 23, 2017 - 11:38

కడప : జిల్లా బి.కోడూరు మండలం పాయకుంట్లలో దారణం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను, భార్యను నరికి చంపాడు. భార్య లక్ష్మీదేవి పై అనుమానంతోనే భర్త రమణారెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

Monday, October 23, 2017 - 11:27

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైళ్లో రిమాండ్‌లో ఉన్న రవి అనే ఖైదీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోటనందూరుకు చెందిన రవి గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టవ్వడంతో సెంట్రల్‌ జైలులో ఉంచారు. తనతో పాటు గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టయిన వారు జైల్లో చాలామందే ఉన్నారు. ఏళ్లు గడిచినా.. బయటికి రాని పరిస్థితి ఉండటంతో.. మనస్థాపానికి గురైన రవి.. ఆత్మహత్యకు...

Monday, October 23, 2017 - 11:25

హైదరాబాద్ : పాదయాత్ర నేపథ్యంలో సీబీఐ కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ వైసీపీ అధినేత జగన్‌ వేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. పాదయాత్ర సమయంలో ప్రతి శుక్రవారం కోర్టుకు రావడం కష్టమవుతుందని జగన్‌ పిటిషన్‌లో కోరారు. మరోవైపు జగన్‌కు ఇవ్వకూడదని సీబీఐ వాదిస్తోంది.  పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Monday, October 23, 2017 - 11:24

గుంటూరు : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రంలో కార్తీక సోమవారం, నాగుల చవితి పర్వదినాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. మొదటి కార్తీక సోమవారం కావడంతో.. క్షీరా రామ లింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాజమండ్రిలోని గోదావరి ఘాట్లన్నీ భక్తుల పుణ్యస్నానాలతో కిటకిటలాడాయి. దీనికి తోడు నాగుల చవితి పర్వదినం కూడా కలిసి రావడంతో...

Monday, October 23, 2017 - 11:22

తూర్పుగోదావరి : జిల్లా ప్రత్తిపాడు మండల పరిషత్ సర్వసభ్యహాలులో ఉపాధి హామీ సిబ్బంది తాగుతూ మీడియాకు చిక్కారు. ఉన్నతాధికారులు కూర్చోవల్సిన సీట్లలో ఫీల్డ్ అసిస్టెంట్లు అర్థనగ్నంగా కూర్చుని మందు, సిగరెట్లు తాగుతూయ బిర్యానీలు తింటూ ఎంజాయ్ చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూద్దాం....

Monday, October 23, 2017 - 11:21

కర్నూలు: జిల్లా నంద్యాలలో ఓ భవనం ఒకేసారి కుప్పకూలింది. రోడ్డు విస్తరణలో ఆ భవనం కొంత కూల్చేశారు. మిగతా భాగం ఈ రోజు కూలింది. ఈ ప్రమాదంలో ప్రాణపాయం తప్పింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Monday, October 23, 2017 - 08:16

పశ్చిమగోదావరి : జిల్లా తణుకులో నర్సింగ్ స్కూల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మత్తు ఇంజక్షన్ చేసుకుని యప్సిబా ఆత్మహత్యాయత్నం చేసింది. స్కూల్ యాజమాన్యం స్పృహకోల్పోయిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందిస్తుండగా యప్సిబా మృతి చెందింది. ఆమె ఆత్మహత్యకు ముందు ఓ లేఖ రాశారు. అందులో అంజి అనే వ్యక్తి ప్రేమించి మోసం చేయడం వల్లే తాను చనిపోతునట్లు...

Monday, October 23, 2017 - 07:46

అనంతపురం : పెట్టుబడిదారులు దోపిడీని ఎలా చేస్తారో పెట్టుబడి గ్రంథం విశదీకరిస్తుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘువులు అన్నారు. పెట్టుబడి గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. ముఖ్యంగా నిత్యం దోపిడీకి గురవుతున్న ప్రతి కార్మికుడు వెంటనే క్యాపిటల్‌ గ్రంథాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. అనంతపురంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఏర్పాటు చేసిన కారల్‌మార్క్స్‌...

Monday, October 23, 2017 - 07:43

దుబాయి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుబాయ్‌ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఐదోరోజూ పలువురు ప్రముఖులతో చంద్రబాబు బృందం భేటీ అయ్యి.. రాష్ట్రానికి పెట్టుబడులపై చర్చించింది. చంద్రబాబు మొదట బిజినెన్‌ లీడర్స్‌ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత దుబాయ్‌లోని ప్రవాస తెలుగువారి సదస్సులో ప్రసంగించారు. ఆ వెంటనే డీపీ వరల్డ్‌ గ్రూపు చైర్మన్‌ , సీఈవో సుల్తాన్‌ అహ్మద్‌...

Sunday, October 22, 2017 - 21:16

విజయవాడ : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయికి చెందిన డీపీ వరల్డ్‌ గ్రూపు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్న అంశాలను పరిశీలించేందుకు జాయింట్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం, డీపీ వరల్డ్‌ గ్రూపు నిర్ణయించాయి. ఓడ రేవులు, విమానయాన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు DP వరల్డ్‌ ఆసక్తి వ్యక్తం చేసింది. UAE పర్యటనలో...

Sunday, October 22, 2017 - 19:43

రాజమండ్రి : చట్టసభల్లో బీసీలకు పూర్తి స్థాయి రిజర్వేన్లు పొందినప్పుడే నిజమైన రిజర్వేషన్లు సాధించినట్టని బిసి సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య అన్నారు. రాజమహేంద్రవరంలో బీసీ గర్జన కార్తీక సమారాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో వివిధ బీసీ కులాల నేతలు గర్జన సభలో తీర్మానాలు చేశారు. బీసీ గర్జన ఏ కులానికి వ్యతిరేకం కాదన్నారు కృష్ణయ్య. 

Sunday, October 22, 2017 - 19:37

హైదరాబాద్ : కొన్ని రోజులుగా సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న నటుడు పవన్ కళ్యాణ్ తాను స్థాపించిన 'జనసేన' పార్టీపై ఫోకస్ సారించారు. శనివారం ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో పవన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ జరిగిన సమావేశంలో వచ్చే 6నెలల్లో పార్టీ పరంగా చేపట్టబోయే ముఖ్య కార్యక్రమాలపై జనసేన నేతలతో పవన్ చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదు, ప్లీనరీ సమావేశాలు...

Sunday, October 22, 2017 - 18:28

ప్రకాశం : జిల్లా ఒంగోలులో సత్య కేబుల్ ఆధ్వర్యంలో ఆటోమొబైల్ అండ్ ప్రాపర్టీ ఎక్స్‌పోను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఎక్స్‌పోలో లేటెస్ట్ వెహికిల్స్‌ను ప్రదర్శనలో ఉంచారు. కార్లు, మోటార్‌ సైకిళ్లు రుణ సదుపాయంతో అందించేలా ఈ ఎక్స్‌పోను ఏర్పాటు చేశారు. ఒంగోలులో ఈ ఎక్స్‌పోను ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యే జనార్దన్‌...

Sunday, October 22, 2017 - 18:24

చిత్తూరు : తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద క్షురకుల ధర్నా కొనసాగుతుంది. తమను విధుల నుంచి టీటీడీ అకారణంగా తొలగించిందంటూ గత కొన్ని రోజులుగా క్షురకులు ఆందోళన బాట పట్టారు. నిరసనలో భాగంగా టీటీడీ తీరును ఎండగడుతూ.. ఇవాళ వారు గుండు గీయించుకున్నారు. టీటీడీ అధికారులు తమపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కుట్ర పూరితంగానే తమను రోడ్డున పడేశారని...

Sunday, October 22, 2017 - 18:23

గుంటూరు : 2020 నాటికి ఏషియన్ బీచ్ వాలీబాల్ పోటీలు విశాఖపట్నంలో నిర్వహించేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఎంపీ గల్లా జయదేవ్ చెప్పారు. గుంటూరులోని జరిగిన ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో జయదేవ్ పాల్గొన్నారు. స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం రాజధాని అమరావతిలో వంద ఎకరాల భూమిని కేటాయించాలని సీఎంని కోరతామని జయదేవ్ అన్నారు. 2018లో గోవాలో జరిగే జాతీయ క్రీడల్లో...

Sunday, October 22, 2017 - 18:21

విజయవాడ : అట్టహాసంగా.. ఆడంబరంగా శిలాఫలకాలు ఆవిష్కరించారు. వందల కోట్లు ఖర్చు పెట్టి శంకుస్థాపన చేశారు. కానీ రాజధాని నిర్మాణాన్ని మాత్రం మరచారు. ఏపీ రాజధాని నిర్మాణ పనులు ముందుకు కదలకపోవడంపై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ రాజధానికి శంకుస్థాపన చేసి రెండేళ్లు గడుస్తున్న సందర్భంగా 10టీవీ స్పెషల్ స్టోరీ. అక్టోబర్‌ 22, 2015.. నవ్యాంధ్ర చరిత్రలో...

Sunday, October 22, 2017 - 18:18

అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రమండలానికి వెళ్లినా ఎలాంటి పరిశ్రమలు రావని ఏపీసీసీ అధ్యక్షుడు రాఘువీరారెడ్డి విమర్శించారు. సిఎం, ప్రధాని చేసే విదేశీ పర్యటనలు వినోదయాత్రలే గాని వాటివల్ల ఎలాంటి లాభం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అమలు తోనే పరిశ్రమలు వస్తాయన్నారు. రాజకీయాలు చేస్తే కాంగ్రెస్‌లో ఉండే చేస్తానని ఇతర పార్టీలో చేరేదిలేదన్నారు రఘువీరా....

Sunday, October 22, 2017 - 18:15

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుబాయ్‌ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. బిజినెన్‌ లీడర్స్‌ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. దుబాయ్‌లోని ప్రవాస తెలుగువారి సదస్సులో ప్రసంగించారు. దుబాయ్‌ ఆర్థిక మంత్రి సుల్తాన్‌ బీన్‌ సయీద్‌ అల్‌ మన్సూరీ, డీపీ వరల్డ్‌ గ్రూపు చైర్మన్‌ సుల్తాన్‌ అహ్మద్‌ బీన్‌తో భేటీ అయ్యారు. పరస్పరం పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాలపై చర్చించారు....

Sunday, October 22, 2017 - 16:09

హైదరాబాద్ : టి.టిడిపిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. దుబాయిలో పర్యటిస్తున్న ఆయన ఇక్కడి నేతలతో టెలిఫోన్ లో మాట్లాడారు. ఎల్.రమణతో ప్రత్యేకంగా మాట్లాడారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని బాబు దృష్టికి రమణ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గత నాలుగు...

Sunday, October 22, 2017 - 13:22

కృష్ణా : విజయవాడ పాతబస్తీలో ప్రజాసంఘాల కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. భవన నిర్మాణానికి సీపీఎం ఏపీ కార్యదర్శి పి. మధు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన..ఏపీలో కార్మిక రంగం తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటుందని.. కార్మికులకు అండగా ప్రజా సంఘాల కార్యాలయం భరోసాగా ఉంటుందన్నారు. మరోవైపు మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు....

Pages

Don't Miss