News

Monday, November 19, 2018 - 09:10

హైదరాబాద్: నామినేషన్ల ఘట్టం ముగియనున్న వేళ కాంగ్రెస్ ఆరుగురు అభ్యర్థులతో కూడిన తుది జాబితాను విడుదల చేసింది. ఆదివారం (నవంబరు 18) రాత్రి ఆరు మంది అభ్యర్థుల పేర్లతో తుది జాబితాను వెల్లడించింది. అయితే ఫైనల్ లిస్టులో ఊహించని ట్విస్టులు ఇచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్య, సంచలన నిర్ణయం తీసుకుంది. సీనియర్లకు...

Monday, November 19, 2018 - 08:31

అమరావతి: తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఏపీ మంత్రి కళా వెంకట్రావు పవన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. విశాఖపట్నంలో యలమంచిలి రవి ఇంట్లో జగన్‌తో రహస్యంగా సమావేశం కావడం, 2014 ఎన్నికల్లో పోటీ చేసేందుకు జగన్‌ని 40 సీట్లు...

Sunday, November 18, 2018 - 17:15

హైదరాబాద్ : ఉత్కంఠ వీడింది...ఆ ఇద్దరు గులాబీ అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ముషీరాబాద్, కోదాడ నియోజకవర్గాల బరిలో నిలిచేది ఎవరో గులాబీ బాస్ ప్రకటించేశారు. 119 నియోజకవర్గాలకు విడతల వారీగా 117 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కేసీఆర్ రెండు స్థానాలు (కోదాడ, ముషిరాబాద్) పెండింగ్‌లో పెట్టారు. నవంబర్ 19వ తేదీ...

Sunday, November 18, 2018 - 17:08

బెంగళూరు : అన్నదాతల కోసం రాయచూర్ వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు ప్రత్యేక డ్రోన్ పరికరాన్ని రూపొందించారు. ఈ డ్రోన్ పరికరం పెస్టిసైడ్స్(పురుగు మందులు) చల్లేందుకు ఉపయోగపడుతుంది. కేవలం గంట వ్యవధిలోనే 2.5ఎకరాల్లో పురుగు మందులు చల్లొచ్చు. గాంధీ కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కృషి మేళా 2018లో ఈ పరికరాన్ని...

Sunday, November 18, 2018 - 17:02
మంగళగిరి : 10 రూపాయలు తీసుకెళితే ఏమి వస్తుంది ? ఆ ఒక ఛాయి..లేదా పావు కిలో కూరగాయాలు..లేదా బిస్కెట్..ఏదో చిరుతిండ్లు వస్తాయి..అంటారు కదా...కానీ అదే రూ. 10తో ఏడు రకాల కూరగాయాలు తీసుకెళ్లవచ్చు...తెలుసా ? అవునా నిజమా ఎక్కడో చెప్పండి ఇప్పడు వెళుతాం..అంటారా...? ఇది నిజమే కానీ.....
Sunday, November 18, 2018 - 16:47

సిద్ధిపేట: అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్ తగిలింది. ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాకకు చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. ముత్యం రెడ్డి టీఆర్ఎస్‌లో చేరనున్నారు. మహాకూటమి పొత్తుల్లో భాగంగా దుబ్బాక స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయించింది కాంగ్రెస్...

Sunday, November 18, 2018 - 16:37
హైదరాబాద్ : ఎట్టకేలకు తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. పీపుల్స్‌ ఫ్రంట్‌ కూటమిలో భాగంగా టీజేఎస్‌ నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో నలుగురు పేర్లను ప్రకటించారు. సోమవారం నామినేషన్ లకు చివరి రోజు కావడంతో చివరి జాబితాను ఆదివారం ప్రకటించే...
Sunday, November 18, 2018 - 16:29
హైదరాబాద్ : సీట్ల కేటాయింపు విషయంలో టీ.కాంగ్రెస్ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. తమకు టికెట్ రాకపోవడం..ఆశించిన నియోజకవర్గం కాకుండా మరొక నియోజకవర్గం స్థానం కేటాయించడంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. మహాకూటమి పొత్తులో భాగంగా సీపీఐ, టీటీడీపీ, తెలంగాణ జనసమితికి...
Sunday, November 18, 2018 - 16:21

హైదరాబాద్: నామినేషన్లు వేసేందుకు మరొక్క రోజు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించేస్తున్నాయి. బీజేపీ సైతం ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసింది. 19మంది అభ్యర్థులతో బీజేపీ 5వ జాబితా విడుదల చేసింది.

బీజేపీ ఎమ్మెల్యే...

Sunday, November 18, 2018 - 16:13

హైదరాబాద్ : అమెరికాలో తెలంగాణ వాసి హత్య కలకలం రేపుతోంది. ఓ బాలుడు జరిపిన కాల్పుల్లో మెదక్ జిల్లాకు చెందిన సునీల్ హతమయ్యాుడ. ఆయన తల్లి 95వ జన్మదిన వేడుకల కోసం భారత్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన జరిగడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
...

Sunday, November 18, 2018 - 16:02

హైదరాబాద్ : విరసం నేత వరవరరావుకు పూణె కోర్టు కస్టడీ విధించింది. మహారాష్ట్ర పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేసి పూణేకు తరలించిన సంగతి తెలిసిందే. ట్రాన్సిట్ వారెంట్ పై ఆయన్ను అరెస్టు చేశారు. నవంబర్ 18వ తేదీ ఆదివారం వరవరావును పూణె కోర్టులో ప్రవేశ పెట్టారు. వరవరరావును కస్టడీలోకి అనుమతినివ్వాలని అక్కడి...

Sunday, November 18, 2018 - 15:51

హైదరాబాద్: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో పలువురు మహిళలు అయ్యప్పస్వామి ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించడం.. అయ్యప్ప భక్తులను వారిని అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంలో అయ్యప్ప ఆలయం వివాదంపై...

Sunday, November 18, 2018 - 15:37

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో టీ.కాంగ్రెస్ 94 స్థానాల్లో పోటీ చేయనుంది. మహాకూటమిలో భాగంగా సీపీఐ, టీటీడీపీ, తెలంగాణ జనసమితికి పలు స్థానాలను కేటాయించింది. కూటమి పొత్తులో భాగంగా 94 స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ శనివారం వరకూ 88 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది....

Sunday, November 18, 2018 - 15:24

పంజాబ్‌: అమృత్‌సర్‌ జిల్లా అద్లీవాల్ గ్రామంలో కలకలం చెలరేగింది. నిరంకారి భవన్‌పై దాడి జరిగింది. బైక్‌పై వచ్చిన దుండగులు గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. నిరంకారి భవన్‌లో భజనలు జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. గాయాలపాలైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు....

Saturday, November 17, 2018 - 11:42

హైదరాబాద్ : కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదల అయింది. 13 మందిలో కాంగ్రెస్ జాబితా విడుదల చేశారు. మూడో జాబితాలో పిసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు చోటు లభించింది. ఒకటి, రెండో జాబితాలో పోన్నాలకు సీటు దక్కలేదు. దీంతో హుటాహుటిన పొన్నాల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అదిష్టానంతో మంతనాలు జరిపారు. జనగామ సీటు విషయమై రాహుల్‌ను...

Saturday, November 17, 2018 - 11:35

హైదరాబాద్ : టీమిండియా టీం కొద్ది రోజుల్లో ఆసీస్ లో పర్యటించనుంది. ఇందుకోసం కోహ్లీ సేన నేతృత్వంలో భారత్ టీం బయలుదేరింది. ఈ సందర్భంగా బీసీసీఐ శుభాకాంక్షలు తెలియచేసింది. ఈనెల 21వ తేదీ నుండి మూడు టీ 20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు జరుగనున్నాయి. 
ముంబై విమానాశ్రయానికి చేరుకున్న టీమిండియా టీం...

Saturday, November 17, 2018 - 11:24

హైదరాబాద్ : బంగారం అంటే భారతీయ మహిళలకు ఎంతో మక్కువ. వివాహాలు, నూతన ఇంటి ప్రవేశాలు, సీమంతాలు, తదితర వేడుక ఏదైనా అతివలు తమ వద్దనున్న బంగారు ఆభరణాలు ధరించనిదే బయటకు వెళ్లరు. బంగారం అంటే అతివలు ప్రాణం పెడతారు. కానీ బంగారం అంటే కాస్ట్లీ ఏం కొంటాం..అని అనుకొనే వారు. కానీ గత కొన్ని రోజులుగా బంగారం ధర...

Saturday, November 17, 2018 - 11:07

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా చింతమనేని తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పని చేస్తే సరిపోదని పద్ధతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్తు...

Saturday, November 17, 2018 - 10:41

హైదరాబాద్: దేశంలోకి అక్రమంగా చొరబడి అన్ని అర్హత సర్టిఫికెట్లు సంపాయించి హైదారాబాద్‌లొ నివాసముంటున్న పాకిస్థాన్ దేశీయిడు మహ్మద్ ఇక్రమ్ అలియాస్ అబ్బాస్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకొన్నారు. తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇక్రమ్ భాగోతం ఒకటొకటి బయటకు వచ్చింది. ఇక్రమ్‌కు నకిలీ సర్టిఫికెట్లు పొందటంలో సహకరించిన...

Saturday, November 17, 2018 - 10:35
హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా చమురు ధరలు తగ్గుతుండడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుండడమే ఇందుకు ప్రధాన కారణమని ఇండియన్ ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నారు. శనివారం కూడా మరోసారి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 76.91 ఉండగా...
Saturday, November 17, 2018 - 10:33

ఢిల్లీ: బంగ్లాదేశ్ రచయిత్రి, మహిళా హక్కుల ప్రచారకర్త తస్లీమా నస్రీన్ శబరిమల వివాదంపై తీవ్రంగా స్పందించారు. శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మహిళలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప ఆలయంలోకి వెళ్లాలని మహిళా కార్యకర్తలు ఎందుకంత ఆసక్తి చూపుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఈ సందర్భంగా...

Saturday, November 17, 2018 - 10:20

హైదరాబాద్ : ఓట్ల పండుగ వచ్చేస్తోంది. తెలంగాన రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ జరుగనుంది. ప్రతొక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే విపరీతమైన ప్రచారం చేసింది. కానీ అందరి దృష్టి ‘సాఫ్ట్ వేర్’ వారిపైనే నెలకొంది. ఎందుకంటే వీరు ఓటు వేస్తారా ? లేదా ? అనే అందరి మదిలో నెలకొంది....

Saturday, November 17, 2018 - 09:58
సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో, రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ, 2.ఓ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ, అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజుకొక న్యూ అప్‌డేట్‌తో, న్యూ పోస్టర్‌తో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తుంది మూవీ యూనిట్. 2.ఓ ట్రైలర్ ఇప్పటికే దాదాపు 15కోట్ల వ్యూస్‌కి చేరువలో ఉంది. రీసెంట్‌గా 2.ఓ తమిళ వెర్షన్ సెన్సార్ పూర్తయింది. సినిమా చూసిన సెన్సార్...
Saturday, November 17, 2018 - 09:56

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల దాఖలుకు గడువు ముంచుకొస్తోంది. సోమవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న సంగతి తెలిసిందే. దీనితో ఆయా పార్టీల అభ్యర్థుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఎంపిక ప్రక్రియ ఇంకా కొన..సాగూ..తూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు డిసెంబర్ 7వ...

Saturday, November 17, 2018 - 09:55

హైదరాబాద్ : మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. తెలంగాణ జనసమితి నేడు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించనుంది. ఎనిమిది స్థానాల్లో ఆరు స్థానాలపై క్లారిటీ వచ్చింది. అయితే వరంగల్ ఈస్ట్, మిర్యాలగూడ స్థానాలపై సందిగ్థత కొనసాగుతోంది. మధ్యాహ్నంలోగా ఈ రెండు సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు....

Saturday, November 17, 2018 - 09:46

హైదరాబాద్ : మహాకూటమిలో సీట్ల పంచాయతీ తేలాయి. నేడు కాంగ్రెస్ మూడో జాబితా విడుదల చేయనుంది. 19 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించనుంది. ఇప్పటికే రెండు జాబితలో 75 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. నామినేషన్ దాఖలుకు సోమవారం ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులకు ఇవాళా బీపామ్‌లు అందజేయనుంది. ఇప్పటివరకు 75 మందిని ప్రకటించిన...

Saturday, November 17, 2018 - 09:40

హైదరాబాద్: నందమూరి సుహాసిని తన కూతురితో సమానమని, ఆమెని గెలిపించడం తన బాధ్యత అని టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి అన్నారు. కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా సుహాసిని బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాబాయ్ బాలకృష్ణ, కుటుంబసభ్యలతో కలిసి ఆమె ఈ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించి ఆయన ఆశీస్సులు...

Pages

Don't Miss