చిన్న పరిశ్రమల కోసం వైఎస్ఆర్ నవోదయం పథకం

Submitted on 19 July 2019
New scheme titled YSR Navodaya : AP Cabinet approved

ఏపీ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు కొత్త పథకం తీసుకొచ్చింది. వైఎస్ఆర్ నవోదయం కింద కొత్త పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడేళ్లుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. జిల్లాల వారీగా 86 వేల ఎంఎస్ ఎంఈల ఖాతాలు గుర్తించారు. రూ.4 వేల కోట్ల రుణాలు వన్ టైమ్ రీస్ట్రక్చర్ ఎన్పీఏలుగా మారకుండా అవకాశం ఉంది. ఎంఎస్ ఎంఈలకు మరింత రుణం, తక్షణ పెట్టుబడికి ఈ పథకం ద్వారా అవకాశం ఉంది. ఈమేరకు శుక్రవారం జులై 19వ తేదీ అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం అయింది. 

నాటి ఏపీఈడీబీ చట్టం తొలగిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏపీ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ యాక్ట్-2019 ఏర్పాటు చేసింది. బోర్డు చైర్మన్ గా సీఎం, మొత్త ఏడుగురు డైరెక్టర్లు ఉంటారు. డైరెక్టర్లుగా ఆర్థిక, పరిశ్రమల శాఖల మంత్రులు, చీఫ్ సెక్రటరీ వ్యవహరిస్తారు. ఏపీఐపీఎంఏలో శాశ్వత ప్రత్యేక సలహా మండలికి నిర్ణయం తీసుకున్నారు. 

200 యూనిట్ల వరకూ ఎస్సీలకు ఉచితంగా విద్యుత్ ను సరఫరా చేయనున్నారు. రాష్ట్రంలో స్కూళ్లు, ఉన్నత విద్యా సంస్థల పర్యవేక్షణ, నియంత్రణలపై ముసాయిదా బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. చట్టం ద్వారా పర్యవేక్షణ, నియంత్రణకు త్వరలో కమిషన్ల ఏర్పాటు, విద్యాసంస్థల్లో నాణ్యతా ప్రమాణాలు, ఫీజుల నియంత్రణపై దృష్టి, విద్యాహక్కు చట్టం అమలుపైనా కేబినెట్ దృష్టి సారించింది. 
 

New scheme
YSR Navodaya
ap cabinet
approved
Amaravathi

మరిన్ని వార్తలు