కొత్త ఇసుక పాలసీ : సీఎం కీలక నిర్ణయం

Submitted on 9 October 2019
new sand policy

ఏపీలో ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని రూపొందించిన సంగతి తెలిసిందే. కొత్త ఇసుల పాలసీలో భాగంగా సీఎం జగన్ కీలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి అక్రమాలు లేకుండా ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. జాయింట్ కలెక్టర్ లకు పర్యవేక్షణ అధికారాలను ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఇసుక తవ్వకాలు, సరఫరా, విక్రయం, రవాణ,  సమీకరణ మొదలైన విషయాలను జాయింట్ కలెక్టర్ లు చూడాల్సి ఉంటుంది. ఖనిజాభివృద్ది సంస్థ ద్వారా ఇసుక సరఫరా చేస్తున్నందున ఈ బాద్యతలు చూడడానికి ఎక్స్ అఫీషియో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లుగా కూడా వీరిని నియమించారు. పర్యవేక్షణ కోసం వీరికి రూ.8వేలు గౌరవ వేతనం కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇసుక ధర భారీగా తగ్గించేలా ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇకపై ఆన్‌లైన్ లో ఇసుక బుకింగ్.. జీపీఎస్ అమర్చిన వాహనాల ద్వారా ఇసుక తరలిస్తారు. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో రీచ్‌ల నుంచి ఇసుకను స్టాక్‌ యార్డులకు తరలించి అమ్మకాలు జరుపుతారు. రీచ్‌ల దగ్గర టన్ను ఇసుక ధర రూ.375గా నిర్ణయించారు. వ్యవసాయ భూముల్లోని ఇసుక నిక్షేపాలను క్యూబిక్ మీటర్ రూ.60 చొప్పున కొనుగోలు చేయనున్నారు. ఇసుక స్టాక్ యార్డులు పెట్టుకోవడానికి ఎవరికీ అనుమతి లేదు.. ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణా చేయడం నిషేధం.

ఇసుకకు సంబంధించిన నగదు చెల్లింపు కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఇసుక రవాణ ఛార్జీలను నిర్ణయించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. నిబంధనల్ని వ్యతిరేకించి జీపీఎస్‌ లేకుండా ఇసుక తరలిస్తే జరిమానాల మోత తప్పదు. ఇసుక రీచ్‌లు, స్టాక్‌ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఇసుక పాలసీని రూపొందించామని ప్రభుత్వం తెలిపింది.

new sand policy
cm jagan
joint collectors
AP

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు