తెలంగాణకు కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియట్ : సీఎం కేసీఆర్

Submitted on 18 June 2019
New Assembly, New Secretariat for Telangana says cm kcr

తెలంగాణలో కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియట్ భవనాలు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. పాత అసెంబ్లీ తరహాలోనే కొత్త అసెంబ్లీ నమూనా ఉంటుందన్నారు. రూ.100 కోట్లతో కొత్త అసెంబ్లీ, రూ. 400 కోట్లతో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం ఉంటుందని తెలిపారు. జూన్ 27వ తేదీ సెక్రటేరియట్ నిర్మాణానికి భూమి పూజ చేస్తామని తెలిపారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న స్థానంలోనే కొత్త సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అసెంబ్లీ, మండలి ఎర్రమంజిల్ లో 17 ఎకరాల్లో నిర్మిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనాన్ని వారసత్వ సంపదగా కాపాడుతామన్నారు. 

సెక్రటేరియట్, అసెంబ్లీ, కౌన్సిల్ హాల్ అన్ని గొప్పగా ఉండేలా నిర్మాణం జరుగుతుందన్నారు. భవన నిర్మాణం కోసం ముగ్గురు సభ్యులతో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సబ్ కమిటీ రిపోర్టుతో తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంచే విషయంపై ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత పీఆర్సీ, రిటైర్మెంట్ వయసుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. వీలైనంత త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. నూతన మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. కొత్త పంచాయతీ రాజ్‌ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. బీసీ, దళిత రిజర్వేషన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కొత్త మున్సిపల్‌ చట్టానికి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్త పోస్టుల నియామకానికి కేబినేట్‌ ఆమోదం తెలిపింది. అలాగే కోకపేటలో శారదా పీఠానికి రెండు ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించింది. 
 

New Assembly
new Secretariat
Telangana
CM KCR
Cabinet Meeting
Hyderabad


మరిన్ని వార్తలు