హేమమాలినిపై సెటైర్లు: చాపర్ లో వచ్చి ‘కోత’లు 

Submitted on 7 April 2019
netizens trolling over BJP MP candidate Hema Malini

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి..నేతలంతా వినూత్న ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో మధుర నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత హేమమాలిని గోధువ పంటల్ని కోసిన ఫోటోలపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమె అత్యంత ధనవంతురాలైన రైతుఅని..పంటల్ని కోసి హెలీ కాఫ్టర్ లో పట్టికెళ్లిన అత్యంత శ్రీమంతురాలైన రైతు అంటు సెటైర్లు వేస్తున్నారు. ఇవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో మహిళా రైతులకు హెలికాప్టర్ల సౌకర్యం కల్పించారని ట్రోల్ చేశారు. గోవర్థన్ లో ఆమె రీసెంట్ ఫోటోలతో పాటు 2014,2015 సంవత్సరాలలో వేరు వేరు సందర్భాలలో తీసిన ఫోటోలను యాడ్ చేస్తున్నారు. 
 

ప్రత్యేక సౌకర్యాల కోసం హెలికాప్టర్ ఇచ్చారని జర్నలిస్ట్ పాయల్ మెహతా ఏప్రిల్ 3న పోస్ట్ చేశారు. ఈ ఫోటోలపై నెటిజన్స్ చెలరేగిపోయారు. డ్రీమ్ గర్ల్ హేమమాలిని హెలికాప్టర్ రైతు అని.. ధనవంతురాలైన రైతు కామెంట్లు చేస్తే అవే ఫొటోలను వైరల్ చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మథుర నంచి పోటీ చేస్తున్న క్రమంలో గోధుమ పంటలను కోస్తు ప్రచారం చేశారు. గోవర్ధన్ ఏరియాలో పంట పొలాలను పరిశీలించాననీ..నా ఎన్నికల ప్రచారాన్ని పంటలతో  ప్రారంభించానని హేమమాలిని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించటంతోపాటు దానికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. వీటికి పాత ఫోటోలను కూడా పోస్ట్  చేస్తు బీజేపీ నేత హేమమాలినిపై ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోరోజు గోవర్థన్ లో కూడా హేమమాలిని ట్రాక్టర్ స్టీరింగ్ పట్టుకుని ప్రచారాన్ని చేసిన విషయం తెలిసిందే. .  

BJP
MP
Candidate
Hema Malini
Netizens
Trolling
Mathura

మరిన్ని వార్తలు