నెటిజన్స్ ట్రోలింగ్ : లాగి ఒక్కటిస్తానన్న రకుల్ 

Submitted on 17 January 2019
netizens trailing on heroine Rakul Preet Singh
  • రకుల్ ప్రీత్ సింగ్, నెటిజన్స్ మధ్య వార్

  • పొట్టి బట్టలేంటి.. బట్టల్లేవా అంటు కామెంట్స్

హైదరాబాద్ : హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ పై నెటిజన్స్ మండి పడుతున్నారు. ట్రోలింగ్ తో రకుల్ పై విరుచుకుపడతున్నారు నెటిజన్స్. తనపై కామెంట్స్ చేసిన ఓ యువకుడి తల్లిని నానా మాటలు అన్న రకుల్ పై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.చిరిగిపోయిన డ్రెస్‌  వేసుకుని కారు దిగుతున్న త‌న ఫోటోను ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. మనలో ఉన్న చిన్నపిల్లల మనస్తతత్వాన్ని ఎప్పటికీ అలాగే ఉండనివ్వాలంటూ.. క్యాప్షన్ కూడా ఇచ్చింది. 

అంతే.. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఆమెని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. బికారీ అంటూ కొందరు..నీకంటే బిచ్చగాళ్ళే నయం మంచి బట్టలు వేసుకుంటారని..నీ దగ్గర బట్టలు లేకపోతే చెప్పు నేను ఇస్తానంటే మరికొందరు..ఒకప్పుడు చిరిగిన బట్టలు వేసుకుంటే పిచ్చోళ్లు అనేవారని ఇప్పుడు వాటినే బ్రాండ్ అంటున్నారంటు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.  ఈ క్రమంలో `కార్‌లో ఏదో సెష‌న్‌లో పాల్గొన్న ర‌కుల్ ప్యాంట్ వేసుకోవ‌డం మ‌ర్చిపోయింది` అని ఆ వ్య‌క్తి కామెంట్ చేశాడు. దీనికి రకుల్ కూడా అంతే ఘాటుగా సమాధానమిచ్చింది.

కొంచెం సంస్కారం నేర్చుకోమని..`నాకు తెలిసి మీ అమ్మ కూడా కార్లో చాలా సెష‌న్స్‌లో పాల్గొని ఉంటుంది. అందుకే నీకు ఈ విష‌యాలు బాగా తెలిశాయి. ఈ సెష‌న్‌ల గురించి కాకుండా కొంచెం సంస్కారానికి సంబంధించిన విష‌యాలు కూడా నేర్ప‌మ‌ని మీ అమ్మని అడుగు. ర‌క్ష‌ణ‌, స‌మాన‌త్వం అంటూ చర్చ‌లు సాగించ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌ద‌`ని ర‌కుల్ ట్వీట్ చేసింది.

ఈ కామెంట్ పై రెచ్చిపోయిన నెటిజన్స్ "నీపై వచ్చిన కామెంట్స్‌ కు కౌంటర్‌ ఇచ్చేందుకు నువ్వు కూడా ఓ మహిళనే అవమానిస్తావా?" అనీ.."అసలు నువ్వు ఎలాంటి డ్రస్ వేసుకున్నావో తెలుసా?" అని ఇంకొకరు.."నీ వాలకం చూస్తుంటే ఎలాగైనా అనుకోవచ్చు" అని మరొకరు... ఇలా సాగుతోంది రకుల్ ప్రీత్ పై నెటిజన్ల ట్రోలింగ్. 

ఇక తనపై వస్తున్న ట్రోలింగ్ ను చూస్తున్న రకుల్, తన ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించింది. "నా నీతి, నిజాయితీలను ప్రశ్నిస్తున్నవారు మహిళలను లక్ష్యం చేసుకున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? వారికి కూడా ఓ కుటుంబం ఉందని గుర్తు చేయాలన్నదే నా అభిప్రాయం. నాపై వచ్చిన కామెంట్లే వారిపైనా వస్తే..? అతని తల్లి లాగి ఒకటిస్తుంది అంటు ట్వీట్ చేసింది. మరి దీనిపై నెటిజన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

Mumbai
Heroine
Rakul Preet Singh
Drese
Nettigans
Comments
Trolling
Twitter

మరిన్ని వార్తలు